సూర్య పుట్టిన రోజు సందర్భంగా ‘కంగువ’ ఫస్ట్ సింగిల్ రిలీజ్

Must Read

స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈరోజు సూర్య పుట్టిన రోజు సందర్భంగా ‘కంగువ’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ సాంగ్’ రిలీజ్ చేశారు. ఈ పాటలో యుద్ధ వీరుడిగా సూర్య మేకోవర్, ఫెరోషియస్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ‘ఫైర్ సాంగ్’ కు ఫైర్ ఉన్న పవర్ ఫుల్ ట్యూన్ కంపోజ్ చేశారు. శ్రీమణి ఆకట్టుకునే లిరిక్స్ అందించగా అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్ గా పాడారు. ‘ఆది జ్వాల..అనంత జ్వాల..వైర జ్వాల.. వీర జ్వాల..దైవ జ్వాల..దావాగ్ని జ్వాల.. ‘ అంటూ ఈ పాట సాగుతుంది. ‘పైర్ సాంగ్’ “కంగువ”కు స్పెషల్ అట్రాక్షన్ కానుంది.

“కంగువ” చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.

‘కంగువ’ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషర్స్ తెలుగులో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ జానర్ లో ఇప్పటిదాకా తెరపైకి రాని ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతోందీ సినిమా. పది భాషల్లో తెరకెక్కుతున్న ‘కంగువ’ త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Fire Song (Telugu) - Lyrical | Kanguva | Suriya | Devi Sri Prasad | Siva | Anurag Kulkarni

నటీనటులు – సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ – నిశాద్ యూసుఫ్
సినిమాటోగ్రఫీ – వెట్రి పళనిస్వామి
యాక్షన్ – సుప్రీమ్ సుందర్
డైలాగ్స్ – మదన్ కార్కే
కథ – శివ, ఆది నారాయణ
పాటలు – వివేక్, మదన్ కార్కే
కాస్ట్యూమ్ డిజైనర్ – అను వర్థన్, దష్ట పిల్లై
కాస్ట్యూమ్స్ – రాజన్
కొరియోగ్రఫీ – శోభి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఏ జే రాజా
కో ప్రొడ్యూసర్ – నేహా జ్ఞానవేల్ రాజా
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్
దర్శకత్వం – శివ

Latest News

Nuvvu Gudhithe lyrical song from Drinker Sai

Dharma and Aishwarya Sharma play the lead roles in Drinker Sai, which carries the tagline Brand of Bad Boys....

More News