డిసెంబర్ 1న ఐదు భాషలలో “ఉపేంద్ర గాడి అడ్డా” విడుదల

కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్ గా, ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్. ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మించిన “ఉపేంద్ర గాడి అడ్డా” చిత్రం డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈ విషయాన్ని సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు ప్రకటించారు. తొలుత సినిమా ట్రైలర్ ను ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షులు, తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి కె.ఎల్.దామోదర్ ప్రసాద్ ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, “సాధారణంగా చిత్రపరిశ్రమలోని వాళ్లు అయినా కొత్తగా పరిశ్రమలోకి వచ్చినవాళ్లు అయినా తమ కుమారులను హీరోలుగా పరిచయం చేస్తూ, ఒకే ఒక్క సినిమాను చేస్తుంటారు. ఆ తర్వాత వాళ్లు బయటి నిర్మాతల సినిమాలను చేయడం చూస్తున్నదే. అయితే ఈ చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు గారు కుమారుడు కంచర్ల ఉపేంద్రను హీరోగా పెట్టి, ఇదే బ్యానర్ లో వరుసగా ఐదు సినిమాలు తీస్తుండటం ఒక సంచలనం, ఒక విశేషం. దీనిని ఉపేంద్ర నిలబెట్టుకుని, హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలి” అని ఆకాంక్షించారు.

నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, “తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ , హిందీ భాషలలో డిసెంబర్ 1న ఈ సినిమాను భారీగా విడుదల చేయబోతున్నాం. మా బ్యానర్ లో మేము వరుసగా తీస్తున్న సినిమాలను ప్రతీ నెలా ఒకటి చొప్పున విడుదల చేయబోతున్నాం. ఎన్నో ఏళ్లుగా విశాఖపట్నం లో మా ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మేము తీస్తున్న సినిమాల ద్వారా వచ్చే లాభాలను కూడా ప్రజా సేవా కార్యక్రమాలకు వెచ్చించదలచుకున్నాం” అని అన్నారు.

హీరో కంచర్ల ఉపేంద్ర మాట్లాడుతూ , “కొత్తగా పరిచయం కాబోతున్న నన్ను హీరోగా పెట్టి, మా నాన్న ఐదు సినిమాలు ఒకేసారి తీస్తుండటం నా అదృష్టం. తప్పకుండా నా ప్రతిభను నిరూపించుకుంటాను. ఒక కొత్త హీరో ప్రేక్షకులకు దగ్గరయ్యే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి” ‘ అని అన్నారు.

దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ , “మాస్, ఎంటర్టైన్ మెంట్ వంటి అంశాలకు సందేశాన్ని మిళితం చేసి, ఈ సినిమాను తీశాం. సోషల్ మీడియా నేటి సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలియంది కాదు. దానివల్ల చెడు మార్గాన్ని ఎంచుకోకుండా, మంచిని పెంపొందింపజేస్తే, సమాజం మరింత వికాసవంతం అవుతుందన్న పాయింట్ ను ఇందులో చూపించాం” అని అన్నారు.

హీరోయిన్ సావిత్రి కృష్ణ మాట్లాడుతూ, తన కెరీర్ మలుపునకు ఈ సినిమా ఎంతగానో దోహదం చేస్తుందన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

ఈ చిత్రానికి సంగీతం: అద్దంకి రాము, సినిమాటోగ్రఫీ: రవీందర్ సన్, సహ నిర్మాతలు కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత, నిర్మాత: కంచర్ల అచ్యుతరావు, దర్శకత్వం: ఆర్యన్ సుభాన్ ఎస్.కె.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

11 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

12 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

12 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago