క్రిస్ప్ స్క్రీన్ ప్లేతో ఇంటరాగేటివ్ థ్రిల్లర్ గా “ది ట్రయల్” ఆకట్టుకుంటుంది – దర్శకుడు రామ్ గన్ని

స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు లీడ్ రోల్స్ లో నటించిన సినిమా “ది ట్రయల్”. ఈ సినిమాను ఎస్ఎస్ ఫిలింస్, కామన్ మ్యాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించారు. సుదర్శన్ రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. “ది ట్రయల్” చిత్రాన్ని టాలీవుడ్ ఫస్ట్ ఇంటరాగేటివ్ ఫిల్మ్ గా రూపొందించారు దర్శకుడు రామ్ గన్ని. ఈ సినిమా ఈ నెల 24న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గన్ని “ది ట్రయల్” సినిమా హైలైట్స్ ఇంటర్వ్యూలో తెలిపారు.

  • నా పూర్తి పేరు రామానాయుడు గన్ని. మాది వైజాగ్. కాలేజ్ లో చదువుకుంటున్నప్పటి నుంచి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఎస్ ఐ పరీక్ష రాసి జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్ గా సెలెక్ట్ అయ్యాను. 2012 నుంచి 22 వరకు పదేళ్లు ఆ జాబ్ చేశాను. సినిమాల మీద ప్యాషన్ తో ఆ జాబ్ కు రిజైన్ చేసి ఇండస్ట్రీకి వచ్చాను. సాధారణంగా జాబ్ వదులుకుని సినిమాల్లోకి వస్తామంటే ఎవరూ ఒప్పుకోరు. కానీ నా ప్యాషన్ చూసి కుటుంబ సభ్యులు నాకు సపోర్ట్ చేశారు. ఇక్కడికి వచ్చి సెహరీ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేశాను. అప్పుడే “ది ట్రయల్” కథ రాసుకోవడం ప్రారంభించా.
  • డిప్యూటీ జైలర్ గా నా పదేళ్ల కెరీర్ లో ఎన్నో క్రైమ్ ఇన్సిడెంట్స్ గురించి, ఆ క్రైమ్స్ చేసి ఖైదీలుగా ఉన్న వారి కథలను విన్నాను. వాటి ఇన్సిపిరేషన్ “ది ట్రయల్” కథలో కొంత ఉంది గానీ మొత్తం ఒకరి లైఫ్ స్టోరి కాదు. ఫారిన్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మన దగ్గర అన్వయించుకుంటే ఎలా ఉంటుందని ఫిక్షనల్ గా రాసుకున్న స్టోరి ఇది.
  • “ది ట్రయల్” సినిమాను టాలీవుడ్ ఫస్ట్ ఇంటరాగేటివ్ ఫిల్మ్ అని ఎందుకు అంటున్నాం అంటే..ఇప్పటిదాకా మన సినిమాల్లో ఇంటరాగేషన్ సీన్స్ ఉన్నాయి గానీ మొత్తం సినిమా ఇంటరాగేషన్ మీద తీయలేదు. “ది ట్రయల్” సినిమాలో ఇంటరాగేషన్ రూమ్ నుంచి కథ మొదలై…అదే గదిలో ముగుస్తుంది.
  • మీరు “ది ట్రయల్” సినిమా ట్రైలర్ లో చూసినట్లు ఒక జంట తమ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. అబ్బాయి ఒక సర్ ప్రైజ్ ఉంది కళ్లు మూసుకోమని చెబుతాడు. ఆ అమ్మాయి కళ్లు తెరిచే లోగా అబ్బాయి బిల్డింగ్ మీద నుంచి కిందపడి చనిపోతాడు. అతనిది హత్యా, ఆత్మహత్యా అనే అంశంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఇంటరాగేషన్ ఆఫీసర్ విచారణ చేస్తున్నది ఒక మహిళ ఎస్ ఐని అయితే వారి మధ్య సంభాషణ ఎంత టఫ్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి.
  • మొదట “ది ట్రయల్” సినిమాను ఓటీటీలో రిలీజ్ చేద్దామని అనుకున్నాం. అయితే ఓటీటీకి ఇవ్వాలంటే థియేటర్ రిలీజ్ కంపల్సరీ అంటున్నారు. మా సినిమాకు విచారణ అని పేరు పెట్టుకోవచ్చు కానీ ది ట్రయల్ అనేది యాప్ట్ అనిపించింది. మా సినిమాలో డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి. సేవ్ ది క్యాట్, అకిరా కురసోవా రూపొందించిన రాషోమన్ వంటి సినిమాల్లో భార్య భర్తలు ఇద్దరే ఉన్నప్పుడు భర్త చనిపోతే.. ఆ కేసులో విచారణ చేయాల్సింది కేవలం భార్యనే. ఎందుకంటే ఆ టైమ్ లో అక్కడున్న సాక్షి ఆమె మాత్రమే. అకిరా కురసోవా రాషోమన్ సినిమాలో ఆ భార్యను ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు భర్త డైరీ చదువుతుంటారు. ఆ డైరీలోని అంశాల ఆధారంగా క్వశ్చన్ చేసినప్పుడు ఇచ్చే ఆన్సర్ తో బ్యాక్ గ్రౌండ్ సీన్స్ మారిపోతుంటాయి. అడివి శేష్ ఎవరు సినిమా కూడా ఇదే స్ట్రక్చర్ స్క్రీన్ ప్లేతో ఉంటుంది. మా సినిమాలో కూడా అదే ఫాలో అయ్యాం. అయితే ప్రెజెంటేషన్ ఆఫ్ ది మూవీ కొత్తగా ఉండి ఆకట్టుకుంటుంది.
  • ఎస్ఐ రూప క్యారెక్టర్ కోసం స్పందన పల్లిని తీసుకోవడానికి కారణం ఆమె హైట్. చూడగానే ఎస్ ఐ అంటే నమ్మేలా ఉండాలి. స్పందన ఈ క్యారెక్టర్ కు యాప్ట్ అనుకున్నాం. సెహరీ మూవీ ప్రొడక్షన్ హౌస్ వర్గో పిక్చర్స్ లో నేను ఒక వెబ్ సిరీస్ కు అగ్రిమెంట్ చేసుకున్నాను. ఆ సినిమా వర్క్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈలోగా ఖాళీగా ఉండటం ఎందుకని ఈ మూవీ మొదలుపెట్టాను. ఇందులో రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఉన్నా..ఫాంటసీ ఉంటుంది. ఫాంటసీ యాడ్ చేయకుంటే సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉండదు.
  • మా సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ ..ఇలా టెక్నీషియన్స్ బాగా సపోర్ట్ చేశారు. సినిమా నిడివి 1 గంట 39 నిమిషాలు మాత్రమే ఉంటుంది. దాంతో సినిమా స్క్రీన్ ప్లే పరుగులు పెట్టినట్లే క్రిస్ప్ గా ఉంటుంది. ఎక్కడా విసుగు రాదు. పీవీఆర్ ద్వారా “ది ట్రయల్” రిలీజ్ చేస్తున్నాం. మా సినిమా కంటెంట్ మీద నమ్మకంతో ఉన్నాం. ఒక మెసేజ్ కూడా ఉంటుంది. బిజినెస్ కోసం వేసిన షోస్ చూసిన వాళ్లకు కూడా బాగా నచ్చింది. సినిమా బాగుందని మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.
  • ప్రస్తుతం వర్గో పిక్చర్స్, జీ 5 వాళ్ల ప్రాజెక్ట్ చేస్తున్నా. ఆ తర్వాత డార్క్ హ్యూమర్ తో ఒక సినిమా చేయాలనుకుంటున్నా అలాగే సూపర్ హీరో కథ ఒకటి రెడీ చేస్తున్నాను.
Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

12 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago