కల్కి 2898 AD’ ట్రైలర్: ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్, ఎక్స్ ట్రార్డినరీ VFX

Must Read

మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’, మ్యాసీవ్ అంచనాలతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ ఫైనల్లీ రిలీజ్ అయ్యింది. ‘కల్కి 2898 AD’ సినిమాటిక్ యూనివర్స్ ని ఎక్స్ ట్రార్డినరీగా పరిచయం చేస్తూ రెండు నిమిషాల యాభై ఒక్క సెకన్ల నిడివి గల ట్రైలర్ ప్రేక్షకులను ఇండియన్ మైథాలజీ వరల్డ్ లోకి తీసుకెళ్ళింది. టాప్ క్లాస్  సైన్స్ ఫిక్షన్, VFXతో అత్యద్భుతం అనిపించింది. సినిమా ట్రైలర్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్ తో సహా పలు భాషల్లో చూడటానికి అందుబాటులో ఉంది.

ఎలక్ట్రిఫైయింగ్ ట్రైలర్‌లో, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన యాక్షన్ పవర్ ని ప్రజెంట్ చేసి, అశ్వత్థామ పాత్రకు ప్రాణం పోశారు. ఉలగనాయగన్ కమల్ హాసన్ తన అద్భుతమైన పాత్రలో నిజంగా గుర్తుపట్టలేనంతగా కనిపిస్తున్నారు. ఎక్సయిట్మెంట్ ని మరింతగా పెంచుతూ ఫ్యూచర్ వెహికల్, బెస్ట్ ఫ్రెండ్ ‘బుజ్జి’తో ప్రభాస్ తన పవర్-ప్యాక్డ్ యాక్షన్, కెమిస్ట్రీతో అదరగొట్టారు. దీపికా పదుకొనే ప్రతి ఫ్రేమ్‌లో ఎమోషన్స్ తో నెరేటివ్ కి డెత్ ని జోడిస్తుంది. దిశా పటాని తన అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంది. ట్రెయిలర్ హోరిజోన్‌లో ‘నయా యుగ్’ (కొత్త యుగం) రాబోయే బాటిల్ గురించి రిఫరెన్స్ లతో నిండి ఉంది.

పవర్-ప్యాక్డ్ డైలాగ్‌లు, అద్భుతమైన బీజీఎం, టాప్ క్లాస్  VFXతో, ‘కల్కి 2898 AD’ ట్రైలర్ ప్రేక్షకులు ఆడ్రినలిన్-ఫ్లూయిడ్ తో కూడిన సినిమాటిక్ జర్నీని హామీ ఇస్తుంది. ప్రతి అంశంలోనూ అద్భుతం అనిపిస్తూ, బెస్ట్ ఇంటర్ నేషనల్ సినిమా ఎక్స్ పీరియన్స్ ని అందిస్తూ, మేకర్స్ ఎక్స్ ట్రార్డినరీ ట్రైలర్‌ను అందించారు. ట్రూ పాన్-ఇండియన్ మూవీ ‘కల్కి 2898 AD’ భారతదేశంలోని అత్యుత్తమ ప్రతిభావంతులను ఒకచోట చేర్చింది. బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్, టెక్నికల్, మ్యూజిక్, విజువల్స్ మైండ్స్ పని చేస్తున్న కల్కి వివిధ పరిశ్రమల నుండి దేశంలోని అత్యుత్తమ వ్యక్తులకు రిప్రజెంట్ చేస్తోంది.

ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ “ఈ రోజు నా మనసు చాలా ఎమోషన్స్ తో నిండి ఉంది. ఒక ఫిల్మ్ మేకర్స్ గా ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ పట్ల నాకు చాలా పాషన్. ‘కల్కి 2898 AD’లో ఈ రెండు ఎలిమెంట్స్ ని మెర్జ్  చేయడం మా ఆర్టిస్ట్ లు. టీం అద్భుతమైన ప్రతిభ, అంకితభావం వల్ల సాధ్యమైంది. ఈ కలని సాకారం చేసుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. మా నిర్మాతలు, స్టార్ కాస్ట్ నుంచి అద్భుతమైన కక్రియేటివ్ మైండ్స్, ‘కల్కి 2898 AD’ మొత్తం సిబ్బంది,  ప్రతి వ్యక్తి ఈ చిత్రానికి ప్రాణం పెట్టి పని చేశారు. ఈ ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను, యావత్ దేశాన్ని గర్వించేలా చేస్తుందని, సినిమా కోసం వారిని ఎక్సయిట్ చేసేలా ఉంటుందని మేము ఆశిస్తున్నాము’ అన్నారు.

Kalki 2898 AD Trailer - Telugu | Prabhas | Amitabh Bachchan | Kamal Haasan | Deepika | Nag Ashwin

‘కల్కి 2898 AD’ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మల్టీలింగ్వెల్, మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్  సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ఫ్యూచర్ లో సెట్ చేయబడింది. ఈ చిత్రం 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News