టాలీవుడ్

మేము అనుకున్నట్లే ‘కల్కి 2898 AD’ అఖండ విజయం సాధించడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది: నిర్మాత సి. అశ్వనీదత్

విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నం ఓపస్ ‘కల్కి 2898 AD’. ఈ విజువల్ వండర్ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె లీడ్ రోల్స్ లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్  సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ జూన్ 27న గ్రాండ్ గా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షులని మహా అద్భుతంగా అలరించి, యునానిమాస్ ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో నిర్మాత సి. అశ్వినీదత్ విలేకరుల సమావేశంలో ‘కల్కి 2898 AD’ విశేషాలని పంచుకున్నారు.  

కల్కి 2898 AD పై మీ అంచనాలు ఏమిటి ? మీ అంచనాలకి తగ్గ రిజల్ట్ ఎలా వచ్చింది ? ఎంత హ్యాపీ గా వున్నారు ?
చాలా చాలా హ్యాపీగా వున్నాను. నిన్న మార్నింగ్ షో నుంచే.. తెలుగు రాష్ట్రాలు, ముంబై, మద్రాస్, బెంగళూరు, ప్రపంచవ్యాప్తంగా రెవల్యూషనరీ రిపోర్ట్ వచ్చింది. నేను ఏదైతే అనుకున్నానో అలాంటి అఖండ విజయం వచ్చింది. హ్యాట్సప్ టు నాగ్ అశ్విన్. ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ.

నాగ్ అశ్విన్ గత రెండు సినిమాలు చాలా సెన్సిబుల్ గా వుంటాయి. తను ఇలాంటి వైల్డ్ డెప్త్ వున్న సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేయగలడనే కాన్ఫిడెన్స్ మీకు ఎప్పుడు వచ్చింది?

-తన మొదటి సినిమా నుంచి తనతో జర్నీ చేస్తున్నాం. తను ఎంత పెద్ద సినిమా అయినా తీయగలడనే కాన్ఫిడెన్స్ నాకు మొదటి నుంచి వుంది. అదే మా అమ్మాయిలతో చెప్పాను. తను ఏ సబ్జెక్ట్ చెప్పినా వెంటనే దూకేయమని అన్నాను. ఈ శతాబ్దంలో ఒక దర్శకుడు మా ఇంట్లోనే దొరికాడు( నవ్వుతూ).

– నా మొదటి సినిమా ఎదురులేని మనిషి నుంచి ఇప్పటివరకూ దర్శకుడు చెప్పింది వినడం, తనకు కావల్సినది సమకూర్చడం తప్పా మరో డిస్కర్షన్ పెట్టను. ఇది అందరికీ తెలుసు.

 – కల్కి 2898 AD మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఇంకా ఏం కావాలని అడగడం తప్పా నేను ఎప్పుడు ఎక్కడ ఇంటర్ఫియర్ కాలేదు.  

అమితాబ్ గారిని నాగ్ అశ్విన్ చాలా అద్భుతంగా చూపించారు కదా.. ఆయన్ని అలాంటి పాత్రలో చూడటం మీకు ఎలా అనిపించింది ?

-డైరెక్టర్ గారు ఏం అనుకున్నారో అలానే తీస్తారని తెలుసు, అలానే తీశారు కూడా.  హ్యాట్సప్ టు హిమ్.

అమితాబ్ గారు,  నిర్మాతగా మీకు గౌరవం ఇస్తూ మీ కాళ్ళకి నమస్కారించినప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి ?
-నాకు తలకాయ కొట్టేసినంత పనైయింది (నవ్వుతూ). మేము కలిసినప్పుడు పరస్పరం నమస్కరించుకుంటాం. అక్కడితో ఆగిపోతాం. అయితే స్టేజ్ మీద మాత్రం ఆయన అలా చేయడం నేను అస్సల్ ఊహించలేదు. అమితాబ్ గారు లెజెండ్. హ్యాట్సప్ టు హిమ్.

ఇందులో ‘బుజ్జి’ (కారు) ని కూడా ఒక పాత్ర చేశారు.. ఈ ఆలోచన చెప్పినపుడు ఎలా అనిపించింది ?
-ఇదంతా నాగ్ అశ్విన్ విజన్. ఈ కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. సినిమాలో చాలా గొప్పగా ప్రజెంట్ చేశారు.

ఈ కథ అనుకున్నప్పుడే పార్ట్ 2 ఐడియా ఉందా ?
-అవునండీ. ఈ స్టొరీ అనుకున్నప్పుడే పార్ట్ 2 థాట్ వచ్చింది. కమల్ గారు ఎంటరైన తర్వాత పార్ట్ 2  డిసైడ్ అయిపోయాం. కమల్ గారిది అద్భుతమైన పాత్ర.

కల్కి విషయంలో ఎలాంటి టెన్షన్ పడ్డారు?
-టెన్షన్ ఏమీ లేదండీ. మిడ్ సమ్మర్ లో రిలీజ్ అయితే బావుంటుందని అనుకున్నాం. అయితే మే 9 పోస్ట్ పోన్ అయ్యింది. తర్వాత జూన్ 27 కరెక్ట్ అనుకోని ఆ డేట్ కి తీసుకొచ్చాం. నాగీ, స్వప్న, ప్రియాంక ఈ ముగ్గురే కాపీ చూశారు. దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా అఖండ విజయం సాధిస్తుందనే ఉద్దేశంతోనే  తీశాం. ఆ ఉద్దేశం నెరవేరింది.

పార్ట్ 2 రిలీజ్ ఎప్పుడు ?
-ఇప్పుడే ఏం తెలీదండి. నెక్స్ట్ ఇయర్ సమ్ వేర్ ఈ టైంలోనే రావచ్చు.

గతంలో శక్తి పీఠాలు నేపధ్యంలో శక్తి లాంటి సినిమా చేసినప్పుడు అలాంటి సబ్జెక్ట్ ఎందుకని కొందరు చెప్పారని అన్నారు. ఇప్పుడు దానికంటే పవర్ ఫుల్ మహాభారతం సబ్జెక్ట్ చేయడం భయం అనిపించలేదా?

-లేదండీ. నాగీ ఈ కథ చెప్పినప్పుడే చాలా పగడ్భందీగా ఫెంటాస్టిక్ గా చెప్పారు. దీంతో నేను ఎలాంటి ప్రశ్నే వేయలేదు.  

స్వప్నగారు రికార్డ్స్ గురించి అడిగితే సినిమాపై ప్రేమతో చేశామని అన్నారు ? మీరు ఏం చెప్తారు ?
-రికార్డ్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయండి. కానీ ఈసారి వస్తున్న రికార్డ్స్ చాలా అద్భుతం. ప్రభాస్, మితాబ్ బచ్చన్, కమల్ హాసన్, నాగ్ అశ్విన్ ఈ అద్భుతాన్ని చేశారు. ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాం.

ప్రభాస్ గారి కోపరేషన్ ఎలా వుంది ?
 చాలా బావుంది అండీ. ప్రభాస్ గారి కోపరేషన్ లేకపోతే అసలు సినిమా బయటికి రాదు. డార్లింగ్ అంటే నిజంగా డార్లింగ్ లానే పని చేశారు.

రాజమౌళి-ప్రభాస్ గారి ఎపిసోడ్ గురించి ?
-రాజమౌళి-ప్రభాస్ గారి ఎపిసోడ్ ఫన్నీగా పెట్టిందే. అలాగే బ్రహ్మానందం, రామ్ గోపాల్ వర్మ క్యామియోస్ ని కూడా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు.

వైజయంతి మూవీస్ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేస్తున్నారా ?
-ఇదొక అద్భుతమైన ప్రయాణం. నా మొదటి సినిమా నుంచి, నేటి కల్కి వరకూ అందరికీ రుణపడి వుంటాను. నటీనటులు, టెక్నిషియన్స్ అందరు సొంత మనిషిలా నన్ను దగ్గరకి చేర్చుకొని సినిమాలు చేశారు. అందరికీ హ్యాట్సప్.  

మీ అమ్మాయిలు వరల్డ్ రేంజ్ సినిమాని తీశారు. తండ్రిగా మీరు ఎలా ఫీలౌతున్నారు ?
-నేను గొప్ప అదృష్టవంతుడిని. మా అమ్మాయిలు సంస్థని గొప్ప శిఖరాలకి తీసుకెలుతున్నారు. తండ్రిగా చాలా గర్వపడుతున్నాను.

మీకు పొలిటికల్ అలైన్స్ వుంది. తెలుగు దేశంకు మీరు చాలా క్లోజ్ గా వుంటారు. ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చారు. ఇండస్ట్రీకి ఎలా ఉండబోతుంది?
-ఇకపై చింతపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారు అద్భుతంగా అభివృద్ధి చేస్తారు. పరిశ్రమకు అద్భుతంగా వుంటుంది.

కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో ఇంకా ఎన్ని పార్ట్స్ రావచ్చు ?
-ఈ రెండే వస్తాయి. తర్వాత ఎలా వుంటుందనే స్క్రిప్ట్ బట్టి చూడాలి.

వైజయంతీ మూవీస్ నుంచి రాబోయే సినిమాలు గురించి ?
-శ్రీకాంత్ గారి అబ్బాయితో ఓ సినిమా వుంటుంది. అలాగే దుల్కర్ సల్మాన్ తో ఓ సినిమా చేస్తున్నాం.

ఆల్ ది బెస్ట్
థాంక్ యూ

Tfja Team

Recent Posts

Rashmika Mandanna’s Intriguing First Look & Glimpse From Kubera Revealed

The acclaimed national award-winning filmmaker Sekhar Kammula is set to enthrall the audience with his…

30 mins ago

మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘ఆరంభం’ అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్

'C/o కంచరపాలెం'లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మోహన్ భగత్ లీడ్ రోల్ లో నటించిన మైండ్ బెండింగ్ టైమ్…

1 hour ago

The mind-bending sci-fi thriller ‘Aarambham’ is now streaming exclusively on Amazon Prime

'Aarambham' is a mind-bending time travel thriller starring Mohan Bhagat, who previously impressed audiences with…

2 hours ago

Nandamuri Kalyan Ram Looks Ferocious In Birthday Special Poster From #NKR21

The makers of Nandamuri Kalyan Ram starrer #NKR21 offered a special treat on the actor’s…

2 hours ago

Suriya’s Kanguva Nizam release by Mythri Movie Distributors, Grand Theatrical Release on October 10th

Star hero Suriya's prestigious movie 'Kanguva' is set for a grand worldwide theatrical release on…

2 hours ago

నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా అక్టోబర్ 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’

స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ' అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్…

2 hours ago