NBK108 షూటింగ్‌లో జాయిన్ అయిన కాజల్ అగర్వాల్

Must Read

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ ప్రాజెక్ట్ #NBK108. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్  శ్రీలీల చాలా కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ నెల ప్రారంభంలో సినిమా షూటింగ్‌లో జాయిన్ అయింది. ఏజ్ లెస్ బ్యూటీ కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుందని మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. ఈరోజు ఆమె హైదరాబాద్‌లో షూటింగ్‌లో జాయిన్ అయింది. బాలకృష్ణతో కాజల్ నటిస్తున్న మొదటి చిత్రం NBK108 కావడం విశేషం. బాలకృష్ణ, కాజల్ ఒకరిని నొకరు పిడికిలితో షేక్ హ్యాండ్స్ ఇస్తున్నట్లుగా కనిపిస్తున్న ఫోటోని మేకర్స్ షేర్  చేశారు.

బాలకృష్ణ మునుపెన్నడూ చూడని పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. #NBK108లో బాలకృష్ణ మార్క్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్, అనిల్ రావిపూడి మార్క్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి

#NBK 108లో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.  బాలకృష్ణ గత రెండు సినిమాలకు సంగీతం అందించిన ఎస్ థమన్ #NBK108కి సంగీతం సమకూరుస్తున్నారు. బాలకృష్ణ, అనిల్ రావిపూడి, ఎస్ థమన్ ల పవర్ ఫుల్ కాంబినేషన్ లో సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ షైన్ స్క్రీన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా వుంది.  

సి రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా..  తమ్మిరాజు ఎడిటర్‌ గా, రాజీవ్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పని చేస్తున్నారు. వి వెంకట్‌ యాక్షన్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

తారాగణం: నందమూరి బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్స్
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ:  సి రామ్ ప్రసాద్
ఎడిటర్: తమ్మి రాజు
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
ఫైట్స్: వి వెంకట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ
పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News