యమ్ యన్ వి సాగర్ స్వీయ దర్శకత్వం లో నిర్మించిన ఆసక్తికరమైన చిత్రం ‘కాలం రాసిన కథలు.’ నూతన నటీనటులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై అందరినీ అలరించింది. ఈ సినిమా కి హిట్ టాక్ రావడం తో ఈ ఫిలిం యూనిట్ ఈ రోజు సక్సెస్ మీట్ నిర్వహించారు.
దర్శక నిర్మాతలు ఎం.ఎన్.వి సాగర్ మాట్లాడుతూ, “ఈ సినిమా కోసం గత రెండు సంవత్సరాలుగా నేను పని చేస్తున్నాను. సినిమా విడుదక అయ్యాక ప్రేక్షకుల స్పందన బాగుంది. చిన్న సినిమాల్లో మా సినిమా మంచిగా రాణిస్తుంది. మంచి రిలీజ్ ని మాకు అందించినందుకు డిస్ట్రిబ్యూటర్ కి థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా విజయం నేను తదుపరి చేయబోయే సినిమాల మీద విశ్వాసాన్ని పెంచింది. ఈ సినిమా లో పెద్ద స్టార్స్ లేకున్నా, కొత్త వాళ్ళని కూడా ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ చిత్రం లో అన్ని పాత్రలు ప్రేక్షకులకి దగ్గరయ్యాయి. ముఖ్యనగ, కిరాక్ కిరణ్ పాత్ర క్లైమాక్ లో బాగా పండింది. ఈ సినిమా లో చేసిన ముగ్గురు హీరోయిన్స్ కి స్పెషల్ గా థాంక్స్ చెప్తున్నాను.
హన్విక తనకి ఇచ్చిన పాత్ర లో అందరినీ మెప్పించింది. ఉమా కూడా అద్భుతమైన నటన కనబరిచి బేబీ సినిమా లో వైష్ణవి ఛైతన్య లాగా, ఆర్ఎక్స్ 100 లో పాయల్ రాజ్పుట్ లాగా మెప్పించింది. రాబోయే వారాల్లో కూడా ఈ సినిమా ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నాను.” అన్నారు.
హన్విక శ్రీనివాస్ మాట్లాడుతూ, “నేను ఈ చిత్రం లో నవ్య అనే పాత్ర పోషించాను. ఈ పాత్రని చాలా బాగా రాసారు. సాగర్ గారు ఈ పాత్రకి నన్ను ఎంచుకున్నందుకు ఆయనకీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను”. ఇక్కడకొచ్చిన మీడియా వాళ్లందరికీ కూడా థాంక్స్.” అన్నారు.
ఉమా రేచర్ల మాట్లాడుతూ, “ఈ సినిమా లో నా కో-స్టార్స్ అభిలాష్ మరియు శ్రీధర్ నాకు బాగా సపోర్ట్ చేసారు. నేను కొత్త అయినా నన్ను ప్రేక్షకులు ఆదరించినందుకు సంతోషంగా ఉంది.” అని చెప్పారు.
నటుడు వికాస్ మాట్లాడుతూ, “ఈ పాత్ర నాకు దక్కినందుకు చాలా అదృష్టం గా ఉంది. ఈ సినిమా మొదట నా దగ్గరకొచ్చినపుడు నేను చేయగలనో లేదో అనిపించింది కానీ సాగర్ గారు నాకు ధైర్యం ఇచ్చారు. మేమందరం సినిమా విజయం సాధించినందుకు సంతోషంగా ఉన్నాను.” అన్నారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…