షారూక్ ఖాన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘పఠాన్’. రీసెంట్‌గా ఆ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీజర్‌లో గమనిస్తే పఠాన్ చిత్రంలో జాన్ అబ్రహం షారూక్ ఖాన్ బద్ద శత్రువు పాత్రలో నటించారు. తన లుక్ కూడా కూల్‌గా కనిపిస్తుంది. అయితే అతను తన శత్రువు పూర్తి నాశనం చేయాలనుకునే సైనికుడు. ‘ఎలాన్‌తో కలిసి జాన్ మాత్రమే అలాంటి పాత్రలో నటించగలని భావించాం. నిజంగానే ఆయన తన నటనతో మమ్మల్ని థ్రిల్ చేశారు’ అని అన్నారు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘‘పఠాన్’ చిత్రం లార్జర్ దేన్ లైఫ్ మూవీ. అలాంటి సినిమాలో ధీటైన విలన్ ఉండాలని మేం భావించాం. స్క్రీన్‌పై అతని ప్రెజన్స్ ఓ కరెంట్‌లాగా ఉండాలని, క్రూరత్వంతో కూడినట్టు ఉండాలని మేం ఆశించాం.
అందుకనే జాన్ అబ్రహంను దృష్టిలో పెట్టుకునే ఆ పాత్రను రాసుకున్నాను’’ అన్నారు.తను ఇంకా మాట్లాడుతూ ‘‘జాన్ ఈ సినిమాకు మా మొదటి ప్రాధాన్యతే కాదు.. అతను మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేస్తాడని, అతన్నే తీసుకోవాలనుకున్నాను. ఎందుకంటే సినిమాలో ఓ పవర్ ఫుల్ ప్రతి నాయకుడి ఉన్నప్పుడు ప్రేక్షకులు దాన్ని ఎంజాయ్ చేస్తారు. అందుకు తగ్గట్టే టీజర్లో ప్రతి సన్నివేశానికి ప్రేక్షకుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. షారూక్ ఖాన్‌కి పాత్రను ఢీ కొట్టే నర రూప రాక్షసుడిలాంటి పాత్రకు జాన్ తనదైన నటనతో ప్రాణం పోశాడు. షారూక్, జాన్ అబ్రహం మధ్య సన్నివేశాలు సీట్ ఎడ్జ్‌గా ఉంటూ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి’’ అన్నారు.‘పఠాన్’ చిత్రం జనవరి 25 2023న హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలకానుంది.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…