మంచి కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రం “జిన్నా”

Must Read

‘ఆర్.ఎక్స్ 100’ చిత్రంలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకుంది పంజాబీ భామ ‘పాయల్ రాజపుత్’. ఇటీవల విడుదలైన ‘తీస్ మార్ ఖాన్ ’ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంది..తాజాగా డైనమిక్ హీరో మంచు విష్ణు నటిస్తున్న “జిన్నా” చిత్రంలో హీరోయిన్ నటిస్తుంది. అలాగే బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్ కూడా ఈ చిత్రంలో నటించడం విశేషం.అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఈశాన్ సూర్య హెల్మ్ దర్శకుడు. జి. నాగేశ్వర్ రెడ్డి కథ అందించిన ఈ చిత్రానికి.. కోన వెంకట్ స్క్రిప్ట్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. తన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రుత‌లూగించే అనూప్ రూబెన్స్, నాటు నాటు’ ఫేమ్.. ప్రేమ్ రక్షిత్ మాస్ట‌ర్ కొరియోగ్రఫీ. రెండు సార్లు జాతీయ అవార్డు గ్రహీత ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ లాంటి బడా సాంకేతిక నిపుణులు, భారీ తారాగణంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న “జిన్నా” సినిమాకు రోజురోజుకు మంచి బజ్‌ని సోంతం చేసుకుంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని తెలుగు తమిళం, మలయాళం, హిందీ వంటి నాలుగు భాషల్లో ఈ నెల 21 న గ్రాండ్ గా విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అనేదానికి Rx 100 సినిమా ఉదాహరణ. కోటి నుంచి రెండు కోట్లు పెట్టి సినిమా తీస్తే 30 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా నాకు మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాలో రా & రఫ్ క్యారెక్టర్ లో మేకప్ లేకుండా నటించాను.ఆ సినిమా తరువాత నా మేనేజర్ తో పాటు కొంతమంది నాకు రాంగ్ గైడెన్స్ ఇవ్వడంతో నా కొచ్చిన సినిమా స్క్రిప్ట్ కూడా వినకుండా వచ్చిన సినిమాలన్నీ చేశాను ఆ తరువాత మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తే నేమ్, ఫేమ్ వస్తాయని తెలుసుకొని ఇప్పుడు స్క్రిప్ట్స్ వింటున్నాను.నాకు నచ్చితేనే సినిమా చేస్తున్నాను.లాక్ డౌన్ టైమ్ లో నేను చాలా స్ట్రగుల్ ఫెస్ చేశాను . నాకు దగ్గరైన వ్యక్తిని కోల్పోయాను లైఫ్ అంటే ఏంటి అనేది దాని నుంచి చాలా నేర్చుకున్నాను. జిన్నా విషయానికి వస్తే నాకు మోహన్ బాబు సార్ గారు ఫోన్ చేసి “అనగనగా ఓ అతిథి” సినిమాలో చాలా మెచ్యూరిటీ గా ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ చేశావు అనడం చాలా గ్రేట్ గా ఫీలయ్యాను.నిజం చెప్పాలంటే ఆ సినిమా నాకు ఒక యాక్ట్రెస్ గా చాలా సంతృప్తి ఇచ్చింది. ఆ తర్వాత రెండు నెలలకు జిన్నా ప్రాజెక్ట్ లో వర్క్ చేసే అవకాశం వచ్చింది. ఇలా “జిన్నా” లో నటించే అవకాశం రావడానికి ప్రధాన కారణమైన మోహన్ బాబు గారికి బిగ్ థాంక్స్.

ఈ సినిమాలో నా క్యారెక్టర్ వెరీ యూనిక్ గా విలేజ్ గర్ల్ గా స్వాతి పాత్రలో పికిల్స్ అమ్మే అమ్మాయి గా నటిస్తున్నాను. ఇది పక్కా పైసా వసూల్ అయ్యే మాస్ రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ.విష్ణు గురించి మాటల్లో చెప్పలేను. తను చాలా ఎనర్జిటిక్, హంబుల్ పర్సన్. మంచి మనసున్న వ్యక్తి. ఆయనతో, సన్నీతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. అలాగే కోన గారితో, చోటా కె. నాయుడు, అనూప్ రూబెన్స్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఇలా అందరితో వర్క్ చేయడం చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను.దర్శకుడు సూర్య గారితో వర్క్ చేయడం ఇదే మొదటి సారి తన వర్క్ కు నేను బిగ్ ఫ్యాన్ అయ్యాను..ఎక్స్ప్రెషన్స్ విషయంలో, కానీ నటనలో కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి దానికి సీరియస్ గా తీసుకుని మా దగ్గరనుండి చక్కని నటనను రాబట్టుకుంటాడు.ఈ సినిమా మాకు ఒక ఇన్స్టిట్యూట్ లా చాలా విషయాలు నేర్చుకున్నాను. యాక్షన్ రొమాంటిక్ కామెడీ గా వస్తున్న ఈ సినిమాలో మంచి కథతో పాటు మంచి విజువల్స్ ఉన్నాయి.

ప్రస్తుతం ఆడియన్స్ అందరూ లెక్కలు వేసుకొని థియేటర్స్ కు వస్తున్నారు. థియేటర్ కు పెట్టే టికెట్ తో ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకొని మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చూడచ్చు అనే బిజినెస్ మైండ్ తో ఆలోచిస్తూ ఓటీటీ కి అలవాటు పడుతున్నారు. సినిమా అద్భుతంగా మంచి కంటెంట్ ఉంటేనే ఆదరిస్తున్నారు. ఆలా మంచి కంటెంట్ తో వచ్చిన Rx 100 సినిమా లో నటించడం నా కిస్మత్ అనుకుంటా ఎందుకంటే నాకు ఇండస్ట్రీ లో గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరు.ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్ రెడీ గా ఉన్నాయి.ఇందులో కన్నడ “హెడ్ బుష్” అనే బిగ్ మూవీ చేస్తున్నాను.ఇది అండర్ వరల్డ్ డాన్ బయోపిక్ .,ఇంకొకటి మీటూ మాయా పేటిక ఇందులో ఐదు స్టోరీస్ ఉంటాయి.ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ రోల్ ఉంటుంది. ఇందులో నా పాత్ర బాగుంటుంది. తమిళ్ లో గోల్ మాల్ సినిమా చేస్తున్నాను ఇది “దే దనాదన్” కి రీమేక్ ఇందులో జీవా నటిస్తున్నాడు. ఇంకొక సినిమా కథ చర్చల్లో ఉంది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న “జిన్నా” చిత్రం రెగ్యులర్ రొటీన్ లా మాత్రం ఉండదు చూసిన ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని ముగించారు.

నటీ నటులు
విష్ణు మంచు సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌ తదితరులు

సాంకేతిక నిపుణులు
నిర్మాతలు : అవా ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
దర్శకత్వం ::ఈషన్ సూర్య హెల్మ్
సినిమాటోగ్రఫి : ఛోటా కె. నాయుడు
కథ, స్క్రీన్ ప్లే : కోన వెంకట్
మ్యూజిక్ : అనూప్ రూబెన్స్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News