లారెన్స్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ‘జిగర్ తండా 2’

Must Read

వెర్సటైల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ రచన, దర్శకత్వంలో స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కార్తికేయన్ సంతానం నిర్మిస్తున్న చిత్రం ‘జిగర్‌తండా 2’ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ తెలియ‌జేశారు. 2014లో ఆయ‌న రూపొందించిన యాక్ష‌న్ కామెడీ జిగ‌ర్ తండా  బేస్డ్‌గా ‘జిగర్‌తండా 2’ రూపొంద‌నుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్న‌ట్లు కార్తీక్ సుబ్బ‌రాజ్ పేర్కొన్నారు.

యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ‘జిగర్ తండా 2’లో రాఘవ లారెన్స్, ఎస్‌.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మిగిలిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. దీన్ని భారీ బ‌డ్జెట్‌తో స్టోన్ బెంచ్ బ్యాన‌ర్‌పై  కార్తికేయ‌న్ సంతానం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రూపొందించ‌నున్నారు.

2014లో కార్తీక్ సుబ్బ‌రాజ్ డైరెక్ట్ చేసిన‌ జిగ‌ర్‌తండా పంథాలో జిగ‌ర్‌తండా 2 కూడా యాక్షన్ గ్యాంగ్‌స్టర్ జోనర్‌లోనే తెర‌కెక్క‌నుంది.

ఇంత‌కు ముందు కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మెర్క్యురీ, సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ పేట్ట స‌హా ప‌లు చిత్రాల‌కు అద్బుత‌మైన విజువ‌ల్స్ అందించిన నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫ‌ర్ తిరు.. జిగ‌ర్‌తండా 2కి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అలాగే జిగ‌ర్‌తండా సినిమాకు అమేజింగ్ మ్యూజిక్ అందించిన సంతోష్ నారాయ‌ణ‌న్ జిగ‌ర్ తండా 2కి సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ష‌ఫీక్ మొహ్మ‌ద్ అలీ, వివేక్ హ‌ర్ష‌న్ ఈ సినిమాకు ఎడిటింగ్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. జిగ‌ర్ తండాకు ఎడిటింగ్ వ‌ర్క్ చేసిన వివేక్ హ‌ర్ష‌న్ జాతీయ అవార్డును గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే.

కార్తీక్ సుబ్బ‌రాజ్ నుంచి ఫ్యాన్స్‌, సినీ అభిమానులు ఎలాంటి సినిమాను కోరుకుంటారో అలాంటి ట్విస్టులు, ట‌ర్నుల‌తో జిగ‌ర్‌తండా 2 ఆడియెన్స్‌ను అల‌రించ‌బోతుంది. జిగ‌ర్‌తండా సినిమాలాగానే జిగ‌ర్‌తండా 2 ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలుస్తుందని యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉంది.

జిగ‌ర్‌తండా 2 ఫ్రాంచైజీని ముందుకు తీసుకెళ్ల‌టానికి టైటిల్ రైట్స్‌ను అడిగిన వెంట‌నే ఇచ్చిన ఫైవ్ స్టార్ క్రియేష‌న్స్ క‌దిరేశ‌న్ అండ్ టీమ్‌కు ఈ సంద‌ర్భంగా స్టోన్ బెంచ్ అధినేత కార్తికేయ‌న్ సంతానం ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.2023లో తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో జిగ‌ర్‌తండా 2ను ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Latest News

Nuvvu Gudhithe lyrical song from Drinker Sai

Dharma and Aishwarya Sharma play the lead roles in Drinker Sai, which carries the tagline Brand of Bad Boys....

More News