‘జిలేబి’ జులై 21న విడుదల

Must Read

నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలని అందించిన మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె. విజ‌య‌భాస్కర్ చాలా విరామం తర్వాత చేస్తున్న యూత్ ఫుల్ ఫన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ ‘జిలేబి’. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే ఆర్ట్స్ బ్యానర్ పై ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజు అశ్రాని చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విజ‌య‌భాస్కర్ త‌న‌యుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటిస్తోంది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జిలేబి హిలేరియస్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ అని టీజర్ భరోసా ఇచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. జులై 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో శ్రీకమల్, శివాని దేన్నో చాటుగా చూడటం ఇంట్రస్టింగా వుంది. పోస్టర్ లో పెద్ద ముక్కు పుడక ధరించిన ఒక అమ్మాయి పెయిటింగ్ కూడా గమనించవచ్చు.

ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్ కాగ, ఎం.ఆర్. వర్మ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

తారాగణం: శ్రీకమల్, శివాని రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి తదితరులు.

సాంకేతిక విభాగం:
దర్శకత్వం : కె. విజ‌య‌భాస్కర్
నిర్మాత: గుంటూరు రామకృష్ణ
బ్యానర్ : ఎస్ఆర్కే ఆర్ట్స్
సమర్పణ : అంజు అశ్రాని
సంగీతం: మణిశర్మ
డీవోపీ: సతీష్ ముత్యాల
ఎడిటర్ : ఎం.ఆర్ వర్మ
పీఆర్వో : వంశీ శేఖర్

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News