బాలల దినోత్సవం సందర్భంగా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ నవంబర్ 14న విడుదల కాబోతోంది, పిల్లల కోసం టికెట్ రేట్లు రూ.250 నుంచి రూ.150 తగ్గింపు – నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి..!

నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మాణంలో జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన తెరకెక్కించిన చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’. ఈ సినిమాలో మాస్టర్ జయంత్ బొలిశెట్టి, మన శంకర వర ప్రసాద్ ఫేమ్ ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ మూవీని నవంబర్ 14న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో

ట్యూన్స్ & లిరిసిస్ట్ ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రంలో నేను రాసిన పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ మూవీని బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నాం. పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ అందరూ కలిసి తండోపతండాలుగా థియేటర్లు బుక్ చేసుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా మా చిత్రం ఉంటుంది’ అని అన్నారు.

మాస్టర్ జయంత్ బొలిశెట్టి మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమాని చిల్డ్రెన్స్ డే స్పెషల్‌గా రిలీజ్ చేస్తున్నాం. పిల్లల కోసం ఈ మూవీ టికెట్‌ని రూ. 250 నుంచి రూ. 150కి తగ్గించాం. పిల్లలకు, పెద్దలకు, టీచర్లకు మంచి సందేశం ఇచ్చేలా సినిమా ఉంటుంది. మా మూవీ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అని అన్నారు.

నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమాలోని ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. పిల్లల కోసం టికెట్ రేట్లను తగ్గించాం. పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్స్‌ అందరూ ఈ మూవీని చూడాలి. బాలల దినోత్సవం సందర్భంగా మా సినిమా రిలీజ్ అవుతోంది. పిల్లల మార్కులు కాదు మనసులు చూడండి’ అని అన్నారు.

సహ నిర్మాత షఫి మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రాన్ని బాలల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తున్నాం. పిల్లలకు కానుకగా ఈ మూవీని విడుదల చేస్తున్నాం. అందుకే రూ. 250 ఉన్న టికెట్‌ని రూ. 150కే అందిస్తున్నాం. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ఈ క్రమంలో వేరే వాళ్లు కూడా చిల్డ్రెన్స్ డే స్పెషల్‌ అని సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారు. మేం మాత్రం ముందు నుంచే పిల్లల కోసం ఈ మూవీని తీశాం. అందరూ మా సినిమాని నవంబర్ 14న చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రాన్ని బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నాం. ఈ మూవీని వ్యాపారంగా చూడటం లేదు. అందుకే టికెట్ రేట్లను రూ. 150కి తగ్గించాం. పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ అందరూ ఈ సినిమాని చూడాలి. ఇప్పటికే చాలా స్కూల్స్ థియేటర్లను బుక్ చేసుకున్నాయి. ఈ రోజు కావాలనే ఓ సినిమాని చిల్డ్రెన్స్ డే స్పెషల్ అంటూ ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆ విషయంలో మీరు పొరబాటు పడకండి. మా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమా నవంబర్ 14న రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

TFJA

Recent Posts

బావోలి ఆర్ట్ సంగంలో చైర్‌పర్సన్‌గా అల్లు స్నేహారెడ్డి – భారతీయ కళలు, సంస్కృతి, వారసత్వ పరిరక్షణకు తనవంతు కృషి..!

భారతదేశంలో తొలిసారిగా నిర్వహిస్తున్న స్టెప్‌వెల్ ఆర్ట్ బినాలే ‘బావోలి ఆర్ట్ సంగం’లో అల్లు స్నేహారెడ్డి కీలక బాధ్యతలు చేపట్టారు. ఈ…

3 minutes ago

నిర్మాత రమేష్ వర్మ ‘కొక్కొరొకో’ గ్లింప్స్ విడుదల.. విజువల్స్‌తో ఆక‌ట్టుకుంటోన్న శీను – పార్వతీల అందమైన ప్రేమకథ.. త్వ‌ర‌లోనే గ్రాండ్ రిలీజ్‌..!

యంగ్ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ.. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆర్‌.వి…

2 days ago

‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది – సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వంశీ నందిపాటి..!

వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు!’. వంశీ నందిపాటి నిర్మాతగా కన్ను…

2 days ago

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…

3 days ago

మళ్లీ విద్యార్థినిగా మారిన మంచు లక్ష్మి! హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారు?

మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…

3 days ago

‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల..!

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…

3 days ago