బావోలి ఆర్ట్ సంగంలో చైర్‌పర్సన్‌గా అల్లు స్నేహారెడ్డి – భారతీయ కళలు, సంస్కృతి, వారసత్వ పరిరక్షణకు తనవంతు కృషి..!

భారతదేశంలో తొలిసారిగా నిర్వహిస్తున్న స్టెప్‌వెల్ ఆర్ట్ బినాలే ‘బావోలి ఆర్ట్ సంగం’లో అల్లు స్నేహారెడ్డి కీలక బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆమె కల్చర్ అండ్ హెరిటేజ్ విభాగం చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.

ఫ్యాషన్, కళలు, సంస్కృతిపై ప్రత్యేక ఆసక్తి కలిగిన అల్లు స్నేహారెడ్డి ఈ కార్యక్రమంలో భాగం కావడం విశేషం. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయ వారసత్వాన్ని మరింత మందికి చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

భారతదేశంలోని చారిత్రక మెట్ల బావుల (స్టెప్‌వెల్స్) విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు, వాటి అద్భుతమైన నిర్మాణ శైలి, చారిత్రక ప్రాధాన్యత, నీరు, కళలు, నాగరికత మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ వేదిక ద్వారా తెలియజేయనున్నారు. ఈ కార్యక్రమంలో అల్లు స్నేహారెడ్డి భాగస్వామ్యం భారతీయ కళా వారసత్వంపై మరింత అవగాహన పెంచడంతో పాటు, మన సంస్కృతి మూలాలను గౌరవించేలా ప్రజలను ప్రోత్సహించనుంది.

బావోలి ఆర్ట్ సంగం 2026 డిసెంబర్ 1 నుంచి 2027 జనవరి 10 వరకు జరగనుంది. ఈ వేడుకలో భారతీయ కళలు, సంస్కృతి, వారసత్వ సంపదను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

TFJA

Recent Posts

బాలల దినోత్సవం సందర్భంగా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ నవంబర్ 14న విడుదల కాబోతోంది, పిల్లల కోసం టికెట్ రేట్లు రూ.250 నుంచి రూ.150 తగ్గింపు – నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి..!

నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మాణంలో జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన తెరకెక్కించిన…

22 minutes ago

నిర్మాత రమేష్ వర్మ ‘కొక్కొరొకో’ గ్లింప్స్ విడుదల.. విజువల్స్‌తో ఆక‌ట్టుకుంటోన్న శీను – పార్వతీల అందమైన ప్రేమకథ.. త్వ‌ర‌లోనే గ్రాండ్ రిలీజ్‌..!

యంగ్ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ.. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆర్‌.వి…

2 days ago

‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది – సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వంశీ నందిపాటి..!

వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు!’. వంశీ నందిపాటి నిర్మాతగా కన్ను…

2 days ago

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…

3 days ago

మళ్లీ విద్యార్థినిగా మారిన మంచు లక్ష్మి! హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారు?

మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…

3 days ago

‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల..!

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…

3 days ago