రా అండ్ రస్టిక్‌గా ‘జాతర’ ఫస్ట్ లుక్ పోస్టర్

ప్రస్తుతం హీరోలు దర్శకులు అవుతున్నారు.. దర్శకులు హీరోలు అవుతున్నారు.. కొంత మంది మల్టీటాలెంట్ చూపిస్తూ కథను రాసుకుని దర్శకత్వం వహిస్తూ హీరోలుగా నటిస్తున్నారు. అసలే ఇప్పుడు అంతా కూడా కంటెంట్, కాన్సెప్ట్ చిత్రాలంటూ కొత్త కథల వెంట పడుతున్నారు. రొటీన్ కమర్షియల్ చిత్రాల కంటే కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. సతీష్ బాబు ఇప్పుడు అలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘జాతర’ అంటూ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు.

‘జాతర’ చిత్రానికి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగానూ నటించారు సతీష్ బాబు. గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయడంతో ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టేశారు.

ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే సతీష్ బాబు ఈ చిత్రంలో ఎంత రా అండ్ రస్టిక్‌గా కనిపించబోతున్నారో అర్థం అవుతోంది. శత్రువుల్ని వదించేందుకు కత్తి పట్టుకుని ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక అమ్మవారి ఫోటో, జాతరలో పూనకాలు వచ్చినట్టుగా గెటప్, లుక్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ‘దేవుడు ఆడే జగన్నాటకంలో.. ఆ దేవునితో మనిషి ఆడించే పితలాటకం’ అంటూ పోస్టర్ మీద రాసి ఉన్న డైలాగ్ మరింత ఆసక్తిని రేకెత్తించేలా ఉంది.

చిత్తూరు జిల్లాలో జరిగే జాతర నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. పాలేటి గంగమ్మ దేవత బ్యాక్ డ్రాప్‌గా కథను అల్లుకున్నారు. ఈ చిత్రంలో దీయా రాజ్ కథానాయికగా నటిస్తుండగా.. ఆర్.కె. పిన్నపాల, గోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా, సాయి విక్రాంత్ సహాయక పాత్రల్లో నటించారు. కె.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, శ్రీజిత్ ఎడవణ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారు.

తారాగణం: సతీష్ బాబు, దీయా రాజ్, ఆర్.కె. పిన్నపాల, గోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా, సాయి విక్రాంత్

సాంకేతిక బృందం:
సమర్పణ : గల్లా మంజునాథ్
నిర్మాతలు : రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి
బ్యానర్లు : రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ, మూవీటెక్ LLC
రచన, దర్శకత్వం : సతీష్ బాబు
కెమెరామెన్ : కె.వి. ప్రసాద్
సంగీతం : శ్రీజిత్ ఎడవణ
పీఆర్వో : సాయి సతీష్

Tfja Team

Recent Posts

నిర్మాత రమేష్ వర్మ ‘కొక్కొరొకో’ గ్లింప్స్ విడుదల.. విజువల్స్‌తో ఆక‌ట్టుకుంటోన్న శీను – పార్వతీల అందమైన ప్రేమకథ.. త్వ‌ర‌లోనే గ్రాండ్ రిలీజ్‌..!

యంగ్ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ.. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆర్‌.వి…

5 hours ago

‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది – సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వంశీ నందిపాటి..!

వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు!’. వంశీ నందిపాటి నిర్మాతగా కన్ను…

5 hours ago

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…

1 day ago

మళ్లీ విద్యార్థినిగా మారిన మంచు లక్ష్మి! హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారు?

మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…

1 day ago

‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల..!

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…

1 day ago

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి నుంచి రాబోతోన్న ప్రొడక్షన్ నెం. 2.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..!

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…

1 day ago