హీరో శివాజీ చేతుల మీదుగా ‘హైడ్ న్ సిక్మో’ షన్ పోస్టర్ ఆవిష్కరణ

సహస్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిశాంత్, ఎంఎన్ఓపీ సమర్పణలో.. నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి, దర్శకుడు బసిరెడ్డి రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం హైడ్ న్ సిక్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. హీరో నటుడు శివాజీ చేతుల మీదుగా ఈ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మూవీ కాస్ట్ అండ్ క్రూ తో పాటు ముఖ్య అతిధులు పాల్గొని మాట్లాడారు..

నటుడు హీరో శివాజీ మాట్లాడుతూ.. ముందుగా హైడ్ న్ సిక్ టీం అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా డైరెక్టర్ బసిరెడ్డి రానా #90 సినిమా చేస్తున్నప్పటి నుంచి తెలుసని, మంచి వ్యక్తిత్వంతో పాటు, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన వర్క్ చాలా డైనమిక్ గా ఉంటుందని అన్నారు. డైరెక్టర్ ఆదిత్య హాసన్ తెరకెక్కించిన #90 చిత్రంలో తాను కరాటే మాస్టర్ గా ఒక చిన్న రోల్ చేశాడని, ఆరోజే సెట్ లో తన వర్క్ స్టైల్ చూశానని శివాజీ చెప్పారు. హైడ్ న్ సిక్ చిత్రంతో తెలుగు పరిశ్రమలు మరో ఫెంటాస్టిక్ డైరెక్టర్ పరిచయం అవుతున్నాడని బలంగా నమ్మున్ననని అన్నారు. ప్రొడ్యూసర్ కేవలం స్క్రిప్టును, డైరెక్టర్ బసిరెడ్డి రానాను నమ్మి డబ్బులు పెట్టారు అంటే.. మనం అర్థం చేసుకోవచ్చు డైరెక్టర్ డైనమిక్ ఏంటని అని యాక్టర్ శివాజీ వెల్లడించారు. నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి కి మంచి విజయం చేకూరుతుందని తెలిపారు. అలాగే హీరో హీరోయిన్లు ఇద్దరికీ అభినందనలు చెప్పారు. ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ఈమధ్య ఎక్కువగా వస్తుంది అని, ఇది చాలా మంచి పరిణామం అని పేర్కొన్నారు. ఒకప్పటిలా కాదు ఇప్పుడు అవకాశం అందుకోవడం చాలా సులభతరం అయిందని.. మంచి కంటెంట్ ఉంటే చాలు ఇండస్ట్రీలో నిలబడొచ్చని నటుడు శివాజీ పేర్కొన్నారు.

మల్లి అంకం మాట్లాడుతూ.. ఈ చిత్రం డైరెక్టర్ బసిరెడ్డి రానా తాను ఒక చిత్రానికి కలిసి పని చేసినట్లు.. ఆయన టాలెంట్ ఏంటో తనకి తెలుసు అని చెప్పారు. కచ్చితంగా హైడ్ న్ సిక్ చిత్రం ప్రేక్షకులను ఆదరిస్తుందని, ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికీ మంచి పేరు తీసుకొస్తుందని పేర్కొన్నారు.

డైరెక్టర్ ఆదిత్య హాసన్ మాట్లాడుతూ.. బసిరెడ్డి రానా తనకు చాలా కాలంగా మంచి స్నేహితుడని, ఈ సినిమా గురించి చాలాసార్లు తనతో డిస్కస్ చేసినట్లు కథ అద్భుతంగా ఉందని చెప్పారు. సినిమా కూడా చాలా వరకు చూశానని చాలా అద్భుతంగా వచ్చిందని, ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని పేర్కొన్నారు. సినిమాపై కమాండ్ తో పాటు చాలా కాన్ఫిడెన్స్ ఉన్న దర్శకుడు బసిరెడ్డి రానా అని ఆదిత్య హాసన్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటించిన హీరో విశ్వంత్ కు శుభాకాంక్షలు తెలిపారు. కేరింత మూవీ నుంచి తన యాక్టింగ్ అంటే ఇష్టం అని చెప్పారు.

డైరెక్టర్ నవీన్ మేడారం మాట్లాడుతూ.. బసిరెడ్డి రానా తన దగ్గర అసోసియేట్ గా పని చేశాడని, అతను ఒక్కడు ఉంటే చాలు సెట్ అంతా చాలా హుషారుగా ఉంటుందని చెప్పారు. ఒకరోజు ఫోన్ చేసి సినిమా ఓకే అయిందని కథ చెప్పాడు. అది వింటే చాలా అద్భుతంగా ఉందని, చాలా యూనిక్ వేలో ఉందని, కథ చెప్పిన దానికంటే అద్భుతంగా తెరకెక్కించగలడని ఆయన నమ్మినట్లు.. అదే నిజమైందని నవీన్ మేడారం తెలిపారు. అలాగే హీరో విశ్వంత్ తనకు చాలా కాలంగా తెలుసు అని అద్భుతమైన నటుడని పేర్కొన్నారు. ఇక నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి యుఎస్ లో ఉంటాడని ఆయనకు సినిమా తీయడం అంటే ఎప్పటినుంచో ప్యాషన్ అని అందుకే ఈ సినిమాను తెరకెక్కించాడని నవీన్ మేడారం పేర్కొన్నారు.

హైడ్ న్ సెక్స్ దర్శకుడు బసిరెడ్డి రానా మాట్లాడుతూ.. ఈ చిత్రం మోషన్ పోస్టర్ లాంచింగ్ కి వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా నటుడు హీరో శివాజీ ఆయన చేతల మీదుగా మోషన్ పోస్టర్ లాంచ్ చేసినందుకు థాంక్స్ చెప్పారు. హాస్టగ్ 90 చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. అలాగే డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఎంతో మంచివాడని ప్రతి విషయంలో తోడుగా ఉన్నాడని తెలిపారు. అలాగే ఆ ఒక్కటి అడక్కు సినిమా దర్శకుడు మల్లి అంకం కు ధన్యవాదాలు చెప్పారు. ఈ చిత్రం నుంచి ఎలాంటి కంటెంట్ వచ్చిన అది కచ్చితంగా బ్లాస్ట్ అయ్యేలా ఉండాలనే ఉద్దేశంతో ప్రతిదీ చక్కగా ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి చాలా ప్యాష నెట్ ప్రొడ్యూసర్ అని ఎన్ని కష్టాలు వచ్చినా సినిమా ఆపేదే లేదని భరోసానిచ్చినట్లు పేర్కొన్నారు. ఆ ధైర్యంతోనే ఈ సినిమాను తెరకెక్కించినట్లు డైరెక్టర్ రానా చెప్పారు. ఆయన పరిశ్రమలో మంచి సినిమాలు తీయాలని ఉద్దేశంతోటే సహస్ర ఎంటర్టైన్మెంట్ స్థాపించినట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని చూసిన డైరెక్టర్ నవీన్ మేడారం ఒక క్రైమ్ థ్రిల్లర్ ని ఇలా కూడా చెప్పొచ్చా అని.. ఎక్సైట్మెంట్ తో ఆయన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నట్లు చెప్పారు. ఏ కష్టం వచ్చినా ఏ రాత్రి అయినా డోర్ కొడితే వెంటనే తీసే గొప్ప వ్యక్తి నవీన్ మేడారం అని తెలిపారు. కచ్చితంగా సినిమా అందరిని రంజింప చేస్తుందని ప్రామీస్ చేశారు. చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

హీరోయిన్ శిల్ప మంజునాథ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తాను ఒక పోలీస్ క్యారెక్టర్ లో నటించినట్లు చెప్పారు అది చాలా స్ట్రాంగ్ రోలని డైరెక్టర్ ఆ పాత్రను నా రేట్ చేసినప్పుడే అర్థం అయిందని అన్నారు. తాజాగా చిత్రాన్ని చూసినప్పుడు తాను ఏదైతే చెప్పారో దాన్నే ప్రజెంట్ చేశారని ప్రేక్షకులకు తన పాత్ర గుర్తుండి పోతుందని తెలిపారు. నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి కమిట్మెంట్ అండ్ కరేజ్ ఉన్న ప్రొడ్యూసర్ అని ఆయన నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని కోరారు.

హీరో విశ్వంత్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని, ఆయన సినిమాలకు కటౌట్లు కట్టిన రోజు నుంచి ఆయన బర్త్ డే రోజు తన సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ చేయడం అనేది చాలా అద్భుతమైన సంఘటన అని పేర్కొన్నారు. సినిమా ఖచ్చితంగా అందరిని ఆకర్షిస్తుందని తెలిపారు. ఇక ఈ చిత్రం మొదలవడానికి ముఖ్య కారణం ప్రొడ్యూసర్ నరేంద్ర బుచ్చిరెడ్డిగారి అని.. ఈ మధ్యకాలంలో సినిమాలను ఓకే చేయడం చాలా కష్టంగా మారిందని,హ అలాంటి సమయంలో కేవలం కథను నమ్మి ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రావడం గొప్ప విషయమని చెప్పారు. తర్వాత డైరెక్టర్ బసిరెడ్డి రానా డైనమిక్ పర్సన్ అని, అలాగే గొప్ప విజన్ ఉన్న వ్యక్తి అని చెప్పారు. ఏదైతే ఊహిస్తారో దాన్ని తెరమీద తీసుకురావడంలో బసిరెడ్డి రానా విజయం సాధించాడని తెలిపారు. ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్న నవీన్ మేడారం మొదటి కాపీని చూసి అద్భుతంగా ఉంది అని తనకు ఫోన్ చేయడంతో రిలాక్స్ అయినట్లు విశ్వంత్ పేర్కొన్నారు. కేరింత మనమంతా లాంటి చిత్రాలకు ఇదే రకమైన రెస్పాన్స్ వచ్చిందని, ఇప్పుడు ఈ చిత్రానికి వచ్చిందని ఇది కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని తెలిపారు. ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు.

చిత్రం : హైడ్ న్ సిక్
నటీనటులు: విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్దేవ్, శ్రీధర్ తదితరులు
దర్శకత్వం: బసిరెడ్డి రానా
నిర్మాత: నరేంద్ర బుచ్చిరెడ్డిగారి
బ్యానర్: సహస్ర ఎంటర్ టైన్మెంట్స్
సంగీత దర్శకుడు: లిజో కె జోష్
సినిమాటోగ్రాఫర్: చిన్న రామ్
ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
లిరిసిస్ట్ : సుద్దాల అశోక్ తేజ
ఆర్ట్ : నిఖిల్ హస్సన్
పీఆర్ఓ: హరీష్, దినేష్

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

19 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago