మైత్రేయ మోషన్ పిక్చర్స్యు పతాకంపై యు.బాలరెడ్డి (ఇన్ఫోసిటీ బిల్డర్స్) నిర్మాతగా యువ నటుడు జస్వంత్ పడాల (జెస్సీ), నక్షత్ర త్రినయని ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు సాందీప్ మైత్రేయ ఎన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ERROR500”. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ చిత్రం టీజర్ ని లాంచ్ చేశారు.ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..మైత్రేయ మోషన్ పిక్చర్స్యు నిర్మిస్తున్న ‘ERROR500” చిత్రం టీజర్ ని లాంచ్ చేయడం ఆనందంగా వుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో యువత రావాల్సిన అవసరం వుంది. యువతని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ERROR500 యూనిట్ చాలా ప్యాషన్ ఈ సినిమా చేశారు. ఈ సినిమా యూనిట్ అందరికీ అభినందనలు. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి” అని కోరారు.
జస్వంత్ మాట్లాడుతూ.. మా టీజర్ ని లాంచ్ చేసిన మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కృతజ్ఞతలు. వారి ప్రోత్సాహం మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. మా డెబ్యు మూవీకి ఆయన టీజర్ లాంచ్ చేయడం గొప్ప ఆశీర్వదంగా అనిపించింది. ‘ERROR500’ అందరికీ కనెక్ట్ అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. నన్ను హీరోగా పరిచయం చేసిన త్రేయ మోషన్ పిక్చర్స్యు కి కృతజ్ఞతలు. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే ప్రేక్షకులు ముందుకు వస్తోంది” అన్నారుదర్శకుడు సాందీప్ మాట్లాడుతూ.. ‘ERROR500” దర్శకుడిగా నా తొలి చిత్రం. మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు టీజర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. ERROR500’ మంచి ఎంటర్ టైనర్. బిగ్ బాస్ ఫేం జస్వంత్ ని మేము లాంచ్ చేయడం ఆనందంగా వుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది” అన్నారు.ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శశాంక్ శ్రీరామ్ & ప్రశాంత్ మన్నె సినిమాటోగ్రఫీ, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
నటీనటులు : జస్వంత్ పడాల (జెస్సీ), నక్షత్ర త్రినయని, త్రినాధ్ వర్మ, రాజీవ్ కనకాల, సంజయ్ స్వరూప్ , రోహిణి హట్టంగడి, మొహమ్మద్ సమద్ , ప్రమోదిని, నామిన తారా, బేబీ సియా, స్వాతి, బబ్లూ మాయ తదితరులు
టెక్నికల్ టీమ్ :
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – సాందీప్ మైత్రేయ ఎన్
నిర్మాత : యు. బాలరెడ్డి (ఇన్ఫోసిటీ బిల్డర్స్)
ప్రొడక్షన్ హౌస్ – మైత్రేయ మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్
సినిమాటోగ్రఫీ – శశాంక్ శ్రీరామ్ & ప్రశాంత్ మన్నె
కాస్టింగ్ డైరెక్టర్ – సాందీప్ మైత్రేయ ఎన్
సంగీతం – ఫణి కళ్యాణ్
ఎడిటర్ – గ్యారీ బిహెచ్
డైలాగ్స్ – రాకేందు మౌళి & సాందీప్ మైత్రేయ ఎన్
యాక్షన్ – రబిన్ సుబ్బు
కొరియోగ్రఫీ – సాందీప్ మైత్రేయ ఎన్
కాస్ట్యూమ్ డిజైనర్ – అనూష మైత్రేయ
ఆర్ట్ డైరెక్టర్ – నాని & రత్నవాస్
పీఆర్వో: తేజస్వి సజ్జా