‘జనక అయితే గనక’ మంచి సినిమాను చూడ‌బోతున్నార‌నే న‌మ్మ‌కంతో ఉన్నాం దిల్‌రాజు

Must Read

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న తాజా చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత ఈ సినిమాను నిర్మించారు. వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ సుహాస్ హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని సందీర్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేశారు. సెప్టెంబ‌ర్ 7న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది. హీరో సుహాస్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఈ సినిమా నుంచి ‘నా ఫేవ‌రేట్ నా పెళ్లాం’ సాంగ్‌ను లాంచ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో

సంగీత ద‌ర్శ‌కుడు విజ‌య్ బుల్గానిన్ మాట్లాడుతూ ‘‘‘జనక అయితే గనక’ సినిమాలో నాకు అవ‌కాశం ఇచ్చిన మా నిర్మాత‌లు హ‌ర్షిత్‌, హ‌న్షిత మేడ‌మ్‌కు థాంక్స్‌. అలాగే మంచి సంద‌ర్భాన్ని క్రియేట్ చేసి నాతో మంచి సంగీతాన్ని రాబ‌ట్టుకున్న మా డైరెక్ట‌ర్ సందీప్‌గారికి కూడా ఈ సంద‌ర్భంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. నా ఫేవ‌రేట్ హీరోస్‌లో ఒక‌రైన‌ సుహాస్‌గారికి హ్యాపీ బ‌ర్త్ డే. దిల్‌రాజుగారి ఆఫీసులోకి ఎప్పుడెప్పుడు వ‌ద్దామా అని ఎదురు చూశాను. ఇన్నాళ్లకు ఆ క‌ల నేర‌వేరింది.. ఆయ‌న‌కు థాంక్స్‌’’ అన్నారు.

పాట‌ల ర‌చ‌యిత కృష్ణ‌కాంత్ మాట్లాడుతూ ‘‘దిల్‌రాజుగారు మంచి కంటెంట్ సినిమాల‌ను ఎప్పుడూ ప్రోత్స‌హిస్తుంటారు. ఆయ‌న ప్రొడ్యూస్ చేయ‌క‌పోయినా, ఏదో ఒక రూపంలో ఆయ‌న కొత్త త‌ర‌హా సినిమాల‌ను ఎంక‌రేజ్ చేస్తుంటారు. బ‌ల‌గం సినిమాతో కంటెంట్ ఈజ్ కింగ్ అని న‌మ్మి, వారి వార‌సుల‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారు. ‘జనక అయితే గనక’ సినిమాను కూడా ఓ కొత్త కంటెంట్‌తో రూపొందించారు. మున్ముందు సినిమా క‌థేంటో కూడా ద‌ర్శ‌కుడు చెప్పే ప్ర‌య‌త్నం చేస్తారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాని యూనిక్ పాయింట్‌తో ‘జనక అయితే గనక’ సినిమా రూపొందింది. సంద‌ర్భానుసార‌మే ఇందులో పాటలుంటాయి. విజ‌య్ బుల్గానిన్ మంచి సంగీతాన్ని అందించారు. సినిమాను పెద్ద హిట్ చేస్తార‌ని న‌మ్ముతున్నాం’’ అన్నారు.

హీరోయిన్ సంగీర్తన మాట్లాడుతూ ‘‘‘జనక అయితే గనక’లో నా వ‌న్ ఆఫ్ ది ఫేవ‌రేట్ సాంగ్ ఇది. నాపై న‌మ్మ‌కంతో నాకు అవ‌కాశం ఇచ్చిన దిల్ రాజుగారికి, డైరెక్ట‌ర్ సందీప్‌గారికి, హీరో సుహాస్‌, నిర్మాత‌లు హ‌న్షిత‌, హ‌ర్షిత్‌గారికి థాంక్స్‌’’ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు సందీప్ మాట్లాడుతూ ‘‘కొత్త టాలెంట్‌ను న‌మ్మి ఎంక‌రేజ్ చేసేవాళ్ల‌లో రాజుగారిని మించిన‌వాళ్లు లేరు. ఒక బొమ్మ‌రిల్లు, ఒక ఆర్య‌, ఒక బ‌లగం అయినా చేయ‌గ‌ల ఏకైక ప్రొడ్యూస‌ర్ రాజుగారే. నేను దాదాపు ఏడేళ్లుగా ఇదే సంస్థ‌లో ప‌ని చేస్తున్నాను. ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన ఆయ‌న‌కు థాంక్స్‌. అడుగులు వేసేవాళ్లు న‌డ‌వ‌గ‌ల‌రు అని న‌మ్మి అవ‌కాశం ఇచ్చిన నిర్మాత దిల్‌రాజుగారికి మ‌న‌స్ఫూర్తిగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. హ‌ర్షిత్‌గారు ముందు లైన్ విని న‌మ్మి రాజుగారి ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లాం. నా ఫ‌స్ట్ హీరో సుహాస్‌, హీరోయిన్ సంగీర్త‌న‌. స‌క్సెస్‌ఫుల్ టీమ్ నన్ను స‌క్సెస్ చేయ‌టానికి ముందుకు వ‌చ్చినందుకు థాంక్స్‌’’ అన్నారు.

నిర్మాత హ‌ర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మ‌నం బ‌య‌ట‌ వ‌ర్క్ చేస్తుంటే, ఇంట్లో అన్నీ ప‌నులు చేస్తూ చాలా వ‌ర‌కు విష‌యాల‌ను హ్యాండిల్ చేస్తూ బ్యాక్ బోన్‌లా ఉండే వ్య‌క్తి భార్య‌. అలాంటి వారిని అప్రిషియేట్ చేస్తూ వ‌చ్చే సంద‌ర్భంలో ఇలాంటి పాట ఉండాల‌ని మా డైరెక్ట‌ర్‌గారు ఈ పాట‌ను రాయించారు. 20 ఏళ్లుగా నేను పాట‌లు వింటున్నాను. ఇలాంటి పాట‌, సిట్యువేష‌న్ నాకు తెలిసి రాలేదు. యూనిక్‌ సిట్యువేష‌న్. భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రూ క‌లిసి పాట‌ను వినొచ్చు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి మ‌న‌షుల మ‌న‌సుల‌ను అద్భుతంగా ఆవిష్క‌రిస్తూ రైట‌ర్ కృష్ణ‌కాంత్ మంచి పాట‌ను రాశారు. బేబితో చాలా పెద్ద హిట్ కొట్టిన విజ‌య్, ఈ సినిమాకు చాలా మంచి సంగీతాన్ని అందించారు. యూనిక్ పాయింట్‌తో రాబోతున్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది’’ అన్నారు.

హీరో సుహాస్ మాట్లాడుతూ ‘‘ముందు ఈ స్టోరీని నాకు వినిపించిన హ‌ర్షిత‌న్న‌, హ‌న్షితగారికి థాంక్స్‌. చాలా మంచి స్టోరీ. మా అంద‌రికీ స‌పోర్ట్‌గా నిలుస్తూ వ‌చ్చిన దిల్‌రాజుగారికి పెద్ద థాంక్స్‌. మా డైరెక్ట‌ర్ సందీప్‌గారు జీవితంలో మ‌ర‌చిపోలేని సినిమానిచ్చారు. మా హీరోయిన్ సంగీర్త‌న సినిమా త‌ర్వాత అంద‌రికీ న‌చ్చేస్తుంది మంచి సంగీతాన్నిచ్చిన విజ‌య్ బుల్గానిన్‌, రాసిన కెకెగారు స‌హా అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘సుహాస్‌కు ముందుగా హ్యాపీ బ‌ర్త్ డే. తండ్రికి ఉండే క‌ష్టాల‌ను అంద‌రం చూసే ఉంటాం. ప్ర‌తీ ఇంట్లో ఉండేదే. హ్యాపీగా ఉండే క‌ష్టాలు. జ‌న‌క అయితే గ‌న‌క కాన్సెప్ట్ గురించి సందీప్‌ చెప్పిన‌ప్పుడు సినిమా చేద్దామ‌ని అన్నాను. త‌ర్వాత త‌ను ప్ర‌శాంత్ వ‌ర్మ‌, ప్ర‌శాంత్ నీల్ ద‌గ్గ‌ర రైట‌ర్‌గా జాయిన్ అయ్యాడు. వ‌ర్క్ చేశాడు. ప్ర‌శాంత్ కూడా కాన్సెప్ట్ విని బాగుంద‌న‌టంతో స్క్రిప్ట్ రెడీ చేశాం. సుహాస్ కంటే ముందు చాలా మంది ఈ క‌థ‌ను విన్నారు. అంద‌రూ ఎగ్జ‌యిట్ అయ్యారు. కానీ అమ్మో! మేం చేస్తే ఎలా ఉంటుందో అని అన్నారు. బ‌ల‌గం రిలీజ్ త‌ర్వాత నేనే ఓ రోజు సందీప్‌, హ‌ర్షిత్‌ల‌ను పిలిచాను. సుహాస్‌తో చేస్తే బావుంటుంద‌ని చెప్పాను. త‌నైతే కథ‌తో రీచ్ అవుతాడ‌నిపించిందన్నాను. వెంట‌నే వాళ్లు కూడా బావుంటుంద‌న్నారు. మంచి కాన్సెప్ట్‌తో సినిమాలు వ‌చ్చి ఆడుతున్న‌ప్పుడు మాకొక కిక్ వ‌స్తుంది. అలాంటి స్క్రిప్టే ఇది. మిడిల్ క్లాస్ అబ్బాయి.. త‌నకొచ్చే జీతంతో హ్యాపీగా ఉంటాడు. పెళ్లి చేసుకున్న త‌ర్వాత పిల్ల‌లు వ‌ద్ద‌నుకుంటాడు. ఎందుకు పిల్ల‌లు వ‌ద్ద‌నుకుంటున్నావ‌ని ఎవ‌రైనా అడిగితే అంద‌రికీ లెక్కలు చెప్పి నోరు మూయిస్తుంటాడు. ఈరోజుల్లో ఉన్న జ‌న‌రేష‌న్‌లో డ‌బ్బులు అవ‌స‌ర‌మే, ఎమోష‌న్స్ కూడా అవ‌స‌ర‌మే. డైరెక్ట‌ర్ సందీప్ త‌న రియ‌ల్ లైఫ్‌లో చూసిన ఇన్సిడెన్స్‌ను బేస్ చేసుకుని క‌థ‌ను త‌యారు చేశాడు. దీన్ని హ్యుమ‌ర‌స్‌గా, మంచి కాన్సెప్ట్‌తో సినిమా చేశారు. సినిమా చూశాను. చాలా రోజుల త‌ర్వాత ఓ మంచి సినిమాను మీరు చూడ‌బోతున్నార‌నే న‌మ్మ‌కంతో ఉన్నాం. సెప్టెంబ‌ర్ 7న సినిమాను రిలీజ్ చేయ‌బోతు్నాం. క‌మిటీ కుర్రోళ్ళు, ఆయ్ సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఎలాగైతే ఫ్రెష్‌గా ఫీల‌య్యారో జ‌న‌క అయితే గ‌న‌క సినిమాను అలాగే ఫీల్ అవుతారు. కావాల్సినంత హ్యుమ‌ర్ ఉంటుంది. నాన్ స్టాప్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ ఇది. సుహాస్‌, సంగీర్త‌న జంట ఆన్ స్క్రీన్ చ‌క్క‌గా ఉంటుంది. మిడిల్‌క్లాస్ అబ్బాయిగా సుహాస్ చ‌క్క‌గా న‌టించాడు. ల‌వ్ అంటే చాలా పాట‌లను మనం చూశాం. భార్య ప్రేమ గురించి గొప్ప‌గా చెప్ప‌టానికి సందీప్‌కు అవ‌కాశం ద‌క్కింది. దాన్నే ఈసినిమాలో పాట‌గా రూపొందించారు. ప్ర‌తీ భ‌ర్త త‌న భార్య‌కు డేడికేట్ చేయాల్సిన పాటే ‘నా ఫేవరేట్ నా పెళ్లాం’. సెప్టెంబ‌ర్ 7న‌ ‘జనక అయితే గనక’ సినిమాతో మీ అందరి ముందుకొస్తాం’’ అన్నారు.

నటీనటులు – సుహాస్, సంగీర్తన, రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ తదితరులు

సాంకేతిక బృందం:
బ్యానర్ : దిల్ రాజు ప్రొడక్షన్స్, సమర్పణ: శిరీష్, నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, రచన- దర్శకత్వం: సందీప్ బండ్ల, సంగీతం: విజయ్ బుల్గానిన్, డీఓపీ : సాయి శ్రీరామ్, ఎడిటర్ : కోదాటి పవన్ కళ్యాణ్, ప్రొడక్షన్ డిజైనర్ : అరసవిల్లి రామ్ కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్ : భరత్ గాంధీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అకుల్, PRO : వంశీ కాకా.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News