వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. ఈ సినిమా దసరా సందర్భంగా ‘జనక అయితే గనక’ అక్టోబర్ 12న విడుదల కానుంది. ఇప్పటి వరకు చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్‌లు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. రీసెంట్‌గా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. గురువారం నాడు ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో..
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ఇప్పటికే మా సినిమాను చాలా మందికి షో వేశాం. ఆ రియాక్షన్సే ఇప్పుడు మీడియాకు చూపించాను. త్వరలోనే మీడియాకి కూడా షో వేస్తాను. మీడియా ముందుగా షో వేయాలంటే కాస్త భయంగానే ఉంటుంది. కానీ మంచి సినిమాను తీశాం కాబట్టి.. మీడియాకు ముందుగానే షో వేస్తాను. సినిమా హిట్ అయితే అందరికీ సంతోషంగా ఉంటుంది. అక్టోబర్ 6న విజయవాడలో పబ్లిక్ షో వేస్తున్నాం. 8వ తేదీని తిరుపతిలో షో వేస్తున్నాం. హ్యాపీ డేస్, శతమానం భవతి చిత్రాలు ఓవర్సీస్‌లో ముందుగా రిలీజ్ చేశాను. ఆ సెంటిమెంట్‌తోనే ఇప్పుడు కూడా ఈ మూవీని ముందుగా అంటే అక్టోబర్ 10న ఓవర్సీస్‌లో రిలీజ్ చేస్తున్నాను. 11న ఇక్కడ ప్రీమియర్లు వేసి.. 12న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నాం. నాన్ థియేట్రికల్ బిజినెస్ పూర్తయింది. డిజిటల్, హిందీ డబ్బింగ్, ఓటీటీ ఇలా అన్నీ కూడా పూర్తయ్యాయి. మా సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగుతుంది. అందరినీ అలరించేలా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు.
హీరో సుహాస్ మాట్లాడుతూ.. ‘మా చిత్రం అక్టోబర్ 12న రాబోతోంది. అందరూ చూడండి. ఏ ఒక్కర్నీ కూడా నిరాశ పర్చదు. ఇప్పటి వరకు సినిమా చూసిన వాళ్లంతా కూడా బాగుందని చెబుతున్నారు. ఆడియెన్స్ ఎలాంటి రియాక్షన్స్ ఇస్తారా? అని అక్టోబర్ 12 కోసం వెయిట్ చేస్తున్నాను. ఓవర్సీస్‌లో మా చిత్రం అక్టోబర్ 10న విడుదల కాబోతోంది’ అని అన్నారు.
హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సందీప్ రెడ్డి ఈ కథను కరోనా టైంలో చెప్పాడు. ఇలాంటి పాయింట్‌తో అంటే దిల్ రాజు గారు ఒప్పుకుంటారా? లేదా? అని సందీప్ అనుకున్నారు. కానీ దిల్ రాజు గారెకి ఓ ఐదు నిమిషాలు చెప్పడం, ఆ పాయింట్ నచ్చడంతో ముందుకు జరిగింది. ఈ చిత్రం మాకు చాలా స్పెషల్. సందీప్‌తో ఆరేళ్లుగా ప్రయాణం చేస్తూ వస్తున్నాను. ఐడియాలజీని నమ్మి ముందుకు వెళ్లండని సాయి దుర్గ తేజ్ చెబుతుంటారు. మా సినిమా అంతా కూడా ఐడియాలజీల మీదే ప్రయాణం ఉంటుంది. ఫాదర్, గ్రాండ్ మదర్, వైఫ్, హజ్బెండ్ ఇలా అందరి కోణంలోనూ ఈ చిత్రం ఉంటుంది. రైటర్ పద్మభూషణ్ తరువాత ఈ చిత్రానికి దిల్ రాజు గారే సుహాస్ పేరు చెప్పారు. ఈ మూవీతో డిస్ట్రిబ్యూటర్ కూడా కాబోతోన్నాడు. ఆయనకు ఆల్ ది బెస్ట్. సంకీర్తన బాగా నటించిందని సినిమా చూసిన వాళ్లంతా చెబుతున్నారు. ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల మాట్లాడుతూ.. ‘దిల్ రాజు, హర్షిత్ గారికి, సుహాస్ గారికి థాంక్స్. మా టీజర్‌ను లాంచ్ చేసిన ప్రభాస్ గారికి థాంక్స్. నా ఫేవరేట్ నా పెళ్లాం పాట బాగా వైరల్ అయింది. సుమ, రాజీవ్ కనకాల, ఆట సందీప్ రీల్స్ చేశాక మరింత వైరల్ అయింది. సినిమా కూడా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
హీరోయిన్ సంగీర్తన మాట్లాడుతూ.. ‘మా చిత్రం అక్టోబర్ 12న రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి. మా టీజర్, ట్రైలర్‌లకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం కూడా అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ…
Attitude Star Chandra Hass is coming up with a rustic love and action entertainer Barabar…
Santhosh Kalwacherla and Krisheka Patel play the lead roles in "Artiste", which is produced by…
సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న సినిమా “ఆర్టిస్ట్”. ఈ సినిమాను ఎస్ జేకే ఎంటర్ టైన్ మెంట్…
Megastar Chiranjeevi, a towering figure in Telugu cinema and an inspiration to countless aspirants, recently…
తెలుగు సినిమాపై, ఆ మాటకొస్తే భారతీయ సినిమాపై తనదైన ముద్ర వేసిన హీరో మెగాస్టార్ చిరంజీవి. చిత్రసీమలోకి రావడానికి ఎంతో…