ధనుష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’.. ఫిబ్రవరి 21న రిలీజ్

సినీ ఇండ‌స్ట్రీలో విల‌క్ష‌ణ క‌థానాయ‌కుడిగా ధ‌నుష్‌కి ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. హీరోగానే కాకుండా నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగానూ ఆయ‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటుంటారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’. పా పాండి, రాయ‌న్ చిత్రాల త‌ర్వాత ధ‌నుష్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సినిమా ఇది.

ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్‌.కె.ప్రొడ‌క్ష‌న్స్‌తో క‌లిసి ధ‌నుష్ సొంత నిర్మాణ సంస్థ వండ‌ర్‌బార్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. 2018లో విడుద‌లైన మారి2 త‌ర్వాత ధ‌నుష్ నిర్మిస్తోన్న సినిమా ఇది. రొమాంటిక్ కామెడీ క‌థ‌ను ధ‌నుష్ రాయ‌టం విశేషం. త‌మిళంతో పాటు తెలుగులో ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 21న విడుద‌ల‌వుతుంది.

ఈ సినిమా తెలుగు వెర్ష‌న్‌ను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్‌పి విడుద‌ల చేస్తోంది. ధ‌నుష్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రాయ‌న్ సినిమాను కూడా ఇదే బ్యాన‌ర్ తెలుగులో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప‌వీష్‌, అనిఖ సురేంద్ర‌న్‌, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌, మాథ్యూ థామ‌స్‌, వెంక‌టేష్ మీన‌న్‌, ర‌బియా ఖ‌తూన్‌, ర‌మ్యా రంగ‌నాథ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాకు సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జి.వి.ప్ర‌కాష్ కుమార్ సంగీతాన్ని అందించగా లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రాఫ‌ర్‌గా, జి.కె.ప్ర‌స‌న్న ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేశారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

8 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

9 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago