సడన్ గా సినిమా థియేటర్లు బండ్ చేయాలనుకోవడం కరెక్ట్ కాదు.

Must Read

“తెలంగాణా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఉన్నట్లుండి శుక్రవారం నుంచి సినిమా ధియేటర్స్ ను తాత్కాలికంగా మూసివేసేందుకు నిర్ణయించడం షాక్ కు గురిచేసింది” అని సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ,
థియేటర్లలో ఆక్యపెన్సీ తగినంత లేని కారణంగా థియేటర్స్ ను బంద్ చేస్తున్నట్లు ఆ అసోసియేషన్ వారు చెబుతున్నారు. జూన్ 27వ తేదీ కల్కీ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వరకు చిన్న సినిమాల రిలీజ్ లే ఉన్నాయి.
ఎన్నికల హడావుడి అనేది దేశమంతా ఉంది. నేను అడిగేది ఒక్కటే…మీరేలా ఒక్కరే నిర్ణయం తీసుకుంటారు.
నోటీస్ పీరియడ్ అనేది ఉంటుంది కదా! .అలాగే ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి వంటి వాటితో చర్చించి, నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఉన్నట్లుండి, ఎల్లుండి (శుక్రవారం) నుంచి ధియేటర్స్ మూస్తే ఇబ్బందికరం..
మీ వల్ల నిర్మాతలకు ,మల్టీప్లెక్స్ లకు కూడా ఇబ్బందే..నిర్మాతలు కంటెంట్ సిద్ధం చేసుకున్నాక ఇలాంటి చర్యలు నష్టం.కలిగిస్తాయి. ప్రేక్షకులు దీనివల్ల ఓటిటిలకు ఇంకా అలవాటుపడతారు. మరలా ధియేటర్స్ ఓపెన్ చేసినా ఆడియన్స్ వస్తారా.? ఒక్కసారి ఆలోచించాలి. ఒకపని చెద్దాం కల్కీ కి, పుష్ప 2, , ఓజి , దేవర వంటి పెద్ద సినిమాలకు మాత్రమే ధియేటర్స్ ఓపెన్ చేసి, చిన్న సినిమాలు మనకు అవసరం లేదు అని చెప్పడమేనా మీ ఉద్దేశ్యం?
పది రోజులు థియేటర్లు బంద్ అనడంలో మీ ఆంతర్యం ఏమిటో> అర్ధం కావడం లేదు. నేను ఒక ఎగ్జిబిటర్ ఉన్నాను. థియేటర్ వారి భాధలు ఏమిటో నాకు కూడా తెలుసు. కానీ మనం తీసుకునే నిర్ణయం అందరూ మెచ్చదగినదిగా ఉండాలి అని నా అభిప్రాయం. ఇప్పటికైనా వెంటనే అత్యవసర జాయింట్ కమిటి మీటింగ్ ఏర్పాటు చేసి, దీనిపై అందరికీ ఆమోదయోగ్యమైన మంచి నిర్ణయం తీసుకోవాలి” అని స్పష్టం చేశారు.

ఏపీలో మంత్రులంతా ఓడిపోవడం ఖాయం: నట్టి కుమార్

“ఏపీలో ఎన్నికలు ముగిసాయి. గెలుపు, ఓటములు అనేవి అంచనాలే..అయినప్పటికీ మంత్రులంతా ఓడిపోవడం” అని సీనియర్ నిర్మాత నట్టి కుమార్ అన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, “ఈ ఎన్నికలలో ఇచ్ఛాపురం నుంచి పిఠాపురం వరకు తిరిగి, స్వయంగా గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుని మరీ చెబుతున్నాను . కూటమి అభ్యర్థులు ఉత్తరాంధ్ర లో భారీ మెజారిటీతో గెలవబోతున్నారు.
70 లక్షల ప్రజలు జన్మభూమి మీద అభిమానం తో ఎవరికి వారే దేశవిదేశాల నుంచి వచ్చి , ఓటు హక్కు వినియోగించుకున్నారు..ఇంతకుముందెప్పుడు ఈ స్థాయిలో రావడం చూడలేదు. అధికార వైసీపీ పక్షం పైన వ్యతిరేకంతోనే వారు భారీగా వచ్చారు. అధికార పార్టీ మంత్రులు, క్యాబినేట్ మొత్తం ఓటమి చవి చూడనుంది
అందుకే భయంతో అధికార పక్షం వారు ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు.
కొందరు అధికారులు తొత్తులుగా మారి ఈ చర్యలకు సపోర్ట్ చేస్తున్నారు. వారిందరికకీ శాశ్వతంగా రెస్ట్ వస్తుంది.
పిఠాపురం లో పవన్ గెలుపుకు 99 శాతం సపోర్ట్ ఉంది. ఎవరో ఒక కుటుంబ సభ్యుడు సపోర్ట్ చేయపోనంత మాత్రానా ఏమి పవన్ కల్యాణ్ కు వచ్చే నష్టమేదీ లేదు. అది అతని విజ్ఞతకే వదిలేస్తున్నాం. మెగాస్టార్ ఓ మహా వృక్షం.. ఆయన వల్లే మెగా హీరోలు ఎదిగారు.ఎవరిష్టం వారిది.. అల్లు అర్జున్ కూడా అలానే సపోర్ట్ చెసుకున్నారు. అయితే
సినిమాను సినిమాలానే చూడండి..కాబట్టి అల్లు అర్జున్ ని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు.
అర్జున్ అలా వేరొకరికి సపోర్ట్ గా వెళ్లటం నాకు నచ్చకపోవటమనేది నా వ్యక్తిగత అభిప్రాయం..
బన్నీ కూడా ఆలోచించాలి.. మీ ఫోటోను వారి పార్టీ కి అనుగుణంగా సోషల్ మీడియాలో తిప్పుకున్నారు.
రెచ్చగొట్టే విధంగా వైసిపి వారు దాడులు చెస్తున్నారు ..అవన్ని తాత్కాలికం..కానీ అభివృద్ధి కావాలని ఓట్లెసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు..కూటమి సారధ్యంలో కొత్త ప్రభుత్వం వచ్చాక.. సినిమా పరిశ్రమ అభివృద్ధి కి కృషి చెస్తుంది ,యువకులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది” అని అన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News