కశ్మీర్‌ రెండు జాతీయ అవార్డులు రావడం అనందంగావుంది-నిర్మాత అభిషేక్ అగర్వాల్

ది కశ్మీర్‌ ఫైల్స్‌’కు రెండు జాతీయ అవార్డులు రావడం చాలా అనందంగా వుంది. ఇది ప్రజల సినిమా. దేశ ప్రజలే ఈ అవార్డ్  గెలుచుకున్నారు: నిర్మాత అభిషేక్ అగర్వాల్

‘‘69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో మా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’కు రెండు అవార్డులు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రజల సినిమా.

ఈరోజున దేశ ప్రజలే ఈ అవార్డు గెలుచుకున్నారు” అన్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్.  ‘69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో  ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రం రెండు అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం, అలాగే ఉత్తమ సహాయనటిగా పల్లవి జోషి అవార్డులు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో మా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’కు రెండు అవార్డులు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి గారికి, పల్లవి జోషిగారికి, ఈ చిత్రం కోసం పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ది కశ్మీర్‌ ఫైల్స్‌ ఇది ప్రజల సినిమా.

ప్రజలు ఎంతో గొప్పగా ఆదరించారు. ఈరోజున దేశ ప్రజలే ఈ అవార్డు గెలుచుకున్నారు. దేశ ప్రజలకు, కశ్మీర్‌ పండిట్లందరికీ ఈ పురస్కారాల్ని అంకితమిస్తున్నాం” అన్నారు.

అలాగే జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ గారు అవార్డ్ పొందడం చాలా అనందంగా వుంది.  రాజమౌళి గారి ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆరు జాతీయ అవార్డులు రావడం, ఉప్పెన, కొండపొలం పాట కి చంద్రబోస్ గారికి అవార్డులు రావడం   చాలా సంతోషంగా  వుంది” అన్నారు.

‘’కార్తికేయ 2 తర్వాత ప్రస్తుతం మేము నిర్మిస్తున్న  టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నాం. పాన్ ఇండియా ఆడియన్స్ అలరించే కంటెంట్ టైగర్ నాగేశ్వరరావు లో ఉంది. అక్టోబర్ 20న విడుదల చేస్తున్నాం. దానికి కూడా జాతీయ అవార్డ్ రావాలని కోరుకుంటున్నాను. మీ అందరి సహకారం కావాలి’’ అని కోరారు.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago