బనారస్ దర్శకుడు జయతీర్థ ఇంటర్వ్యూ

Must Read

కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘బనారస్‌’ తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిన బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర దర్శకుడు జయతీర్థ విలేఖరుల సమా’వేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

‘బనారస్‌’ సినిమా ఎలా మొదలైయింది ?

నా గత చిత్రం బెల్ బాటమ్ 2019 ఫిబ్రవరి లో విడుదలైయింది. మార్చ్ నెలలో ఎన్‌ కె ప్రొడక్షన్స్ హౌస్  జైద్ ఖాన్ ని లాంచ్ చేయమని నన్ను సంప్రదించింది. జైద్ ఖాన్ కు పొలిటికల్ గా ఒక స్టార్ ఇమేజ్ వుంది. జైద్ నాన్నగారు జమీర్ అహ్మద్ ప్రముఖ రాజకీయ నేత. జైద్ ని లాంచ్ చేయడం అంటే ఒక ఒత్తిడి వుంటుంది. అయితే ఒక దర్శకుడిగా నాకు పూర్తి స్వేచ్ఛకావాలి, ఎలాంటి ఒత్తిళ్ళు వుండకూడదని వారిని కోరాను. నా కోరికని అంగీకరించారు. నాకు పూర్తి స్వేఛ్చని ఇచ్చారు.  ఒక ప్రేమకథని వైవిధ్యంగా ప్రజంట్ చేయాలని భావించాను. నేను చెప్పిన కథ జైద్  కిచాలా నచ్చింది. మూడు నెలలు స్క్రీన్ ప్లే రాశాను. నేను నాటకరంగం నుండి సినిమాల్లోకి వచ్చాను. సినిమాల్లోకి రాకముందు నటనలో శిక్షణ ఇచ్చేవాడిని. ఇది కొత్త వారితో సినిమాలు చేసినప్పుడు ఉపయోగపడింది. ఈ సినిమాలో పాత్రకి తగ్గట్టు జైద్ కి శిక్షణ ఇచ్చాను. అలాగే ఈ సినిమా కోసం కాశీ, బనారస్ పర్యటించిన తర్వాత షూటింగ్ మొదలుపెట్టాను.

‘బనారస్‌’ ట్రైలర్ చూసిన తర్వాత టైం ట్రావెల్ సినిమా అనిపించింది. మరి ఇందులో ఫ్రెష్ ఎలిమెంట్ ఏమిటి ?

‘బనారస్‌’ కేవలం  టైం ట్రావెల్ సినిమా కాదు. ఒక ఒక ప్రేమకథ. రొమాంటిక్ స్టొరీ. అలాగే థ్రిల్లర్. వీటిలో టైం ట్రావెల్, టైం లూప్, పునర్జన్మ ఎలిమెంట్స్ కూడా వుంటాయి. స్క్రీన్ ప్లే చాలా వైవిధ్యంగా వుంటుంది. చాలా మిస్టికల్ డివైన్ అంశాలు వుంటాయి. ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది.

జైద్ ఖాన్ లాంటి కొత్త నటుడితో సినిమా చేయడం ఎలా అనిపించింది ?

బెల్ బాటమ్ చేసినపుడు రిషబ్ శెట్టి కూడా కొత్తే. రిషబ్ శెట్టి మంచి దర్శకుడు. అయితే హీరోగా అదే అతనికి తొలి సినిమా. ఆ పాత్రకి తగ్గట్టు అతన్ని మలచుకున్నా. ఇప్పటి వరకూ ఏడు సినిమాలు చేస్తే నాలుగు సినిమాల్లో కొత్తవారితోనే చేశాను. నేను యాక్టింగ్ టీచర్ కావడం వలన కొత్త వారితో చేయడం సులువు. నా పాత్రలకు తగ్గట్టు మలుచుకోగలను. ఇప్పటివరకూ నేను శిక్షణ ఇచ్చి, లాంచ్ చేసిన నటీనటులు లంతా మంచి స్థాయిలో వున్నారు. జైద్ కూడా తప్పకుండా గొప్ప స్థాయికి వెళ్తారని ఆశిస్తున్నాను. 

‘బనారస్‌’ షూటింగ్ ఎదుర్కున్న సవాళ్లు ఏంటి ?

90 శాతం షూటింగ్ బనారస్‌ లోనే చేశాం. 2019 సెప్టెంబర్ లో షూటింగ్ వెళ్లినపుడు వరదలు వచ్చాయి. తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరిలో షూటింగ్ చేశాం. అయితే 2,3 డిగ్రీల ఉష్ట్నోగత వద్ద షూట్ చేయడం ఒక సవాల్.  అయితే స్థానికులు చాలా సహకరించారు.  లాక్ డౌన్ కి ముందే రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. లాక్ డౌన్ ఎత్తిన తర్వాత పాటలు షూట్ చేశాం. సెన్సార్ పూర్తయిన తర్వాత మా నిర్మాతలు సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. నిజానికి బనారస్ యూనివర్సల్ అప్పీల్ వున్న కంటెంట్. భారీ నిర్మాణ , సాంకేతిక విలువలతో తెరకెక్కించారు. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయడంతో మరికొన్ని మార్పులు చేశాం. ఫైనల్ ప్రాజెక్ట్ అద్భుతంగా వచ్చింది. ట్రైలర్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది.

వైజాగ్, హైదరాబాద్ వెళ్ళినపుడు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కదా ?

అవును.. తెలుగు ప్రేక్షకుల గొప్పదనం ఇది. కంటెంట్ నచ్చితే భాషలకు అతీతంగా ఆదరిస్తారు. బనారస్ ట్రైలర్ పాటలు వారికి నచ్చాయి. నా బెల్ బాటమ్ సినిమాని కూడా ఓటీటీలో పెద్ద హిట్ చేశారు. ఇప్పుడు జైద్ లాంచింగ్ కి ముందే గొప్ప ప్రేమని పంచారు. సినిమా చూసిన తర్వాత మరింతగా ప్రేమిస్తారు. సినిమాని చూసిన తర్వాత మంచి పాజిటివ్ కంటెంట్ ని చుశామనే ఆనందం ప్రేక్షకుల్లో కలుగుతుందనే నమ్మకం వుంది.

కెజియఫ్, కాంతార.. చిత్రాలతో కన్నడ పరిశ్రమ దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకోవడం ఎలా అనిపిస్తుంది ?

చాలా ఆనందంగా వుంది. కెజియఫ్, కాంతార, 777 చార్లీ, విక్రాంత్ రోణ చిత్రాలు దేశవ్యాప్తంగా మంచి పేరుతెచ్చుకున్నాయి. కన్నడ నుండి వచ్చే సినిమాలని ప్రేక్షకులు ఇప్పుడు నోటీస్ చేస్తున్నారు.  ‘బనారస్’ కూడా మంచి కంటెంట్ వున్న చిత్రం. ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అనే ఎక్సయిమెంట్ వుంది.

అజినీష్ లోక్ నాథ్ మ్యూజిక్ గురించి ?

మేమిద్దరం కలసి బెల్ బాటమ్ చేశాం. బనారస్ లో కూడా సంగీతానికి చాలా ప్రాధాన్యత వుంది. ఇందులో హీరోయిన్ సింగర్. వెస్ట్రన్, క్లాసిక్, ఫ్లోక్, డివైన్ ఇలా అన్నీ కోణాలు వున్న సంగీతం ఇందులో వుంది. మరో విశేషం ఏమిటంటే.. బెల్ బాటమ్ కి పని చేసిన టెక్నికల్ టీం కాంతారకి పని చేసింది. కాంతార టీం బనారస్ కి పని చేసింది. క్యాలిటీ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా వున్నాం.

కొత్తగా చేయబోతున్న సినిమాలు ?

బనారస్ తర్వాత ‘కైవ’అనే  సినిమా చేస్తున్నాను. ఇప్పటికే షూటింగ్ మొదలైయింది. జనవరిలో బెల్ బాటమ్ 2 వుంటుంది.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News