శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై డిఫరెంట్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ ప్రొడ్యూసర్.. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్. ఈ ఏడాది ‘విరూపాక్ష’ వంటి మిస్టికల్ థ్రిల్లర్‌తో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇప్పుడు జూన్ 23న మరో హారర్ థ్రిల్లర్ ‘అశ్విన్స్’ అనే చిత్రాన్ని అందిస్తున్నారు. వెర్సటైల్ యాక్టర్ వసంత్ రవి హీరోగా రూపొందుతోన్న సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘అశ్విన్స్’. తరుణ్ తేజ దర్శకత్వం వహించారు. విమలా రామన్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా రిలీజ్ ప్రెస్ మీట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో…
దర్శకుడు తరుణ్ తేజ మాట్లాడుతూ ‘‘‘అశ్విన్స్’ సినిమా విషయంలో ముందుగా థాంక్స్ చెప్పుకోవాల్సింది ఎస్.వి.సి.సి అధినేత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌గారికే. ఈ సినిమా కాన్సెప్ట్‌తో ముందుగా ఓ షార్ట్ ఫిల్మ్‌ను లాక్ డౌన్ టైమ్‌లో చేశాను. నాకున్న వనరులను ఉపయోగించుకుని చేశాను. ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన బాపినీడుగారు నాకు ఫోన్ చేశారు. అదే కాన్సెప్ట్‌ను ఫీచర్ ఫిల్మ్‌లాగా చేద్దామని ఆయన అన్నారు. ఆయనలా చెప్పగానే వార్నర్ బ్రదర్స్ నుంచి అవకాశం వచ్చినట్లు అనిపించింది. వంద శాతం ప్రసాద్‌గారు, బాపినీడుగారి గైడెన్స్, సహకారంతో అశ్విన్స్ సినిమాను అనుకున్నట్లుగా, అనుకున్న సమయంలో పూర్తి చేశాను. దీన్ని నెరేట్ చేసేటప్పుడే హారర్ జోనర్‌లో ఆడియెన్స్‌కి ఓ కొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలనుకుంటున్నానని బాపినీడుగారికి చెప్పాను. ఆయన కూడా నాపై నమ్మకంతో నన్నెంతో ఎంకరేజ్ చేశారు. రేపు థియేటర్‌లో ‘అశ్విన్స్’ సినిమా చూసే ప్రేక్షకులు ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఫీల్ అవుతారని భావిస్తున్నాను. ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చిదంటే విమలా రామన్‌గారే కారణం. ఆమె నా షార్ట్ ఫిల్మ్ చూసి సహ నిర్మాత ప్రవీణ్ డేనియల్‌కు పంపించారు. అక్కడి నుంచి ఎస్.వి.సి.సి బ్యానర్‌కి ఆ షార్ట్ ఫిల్మ్ వచ్చి చేరింది. తర్వాత అది సినిమాగా మారింది. అందుకు ఆమెకు నా స్పెషల్ థాంక్స్. ఈ సినిమాలో విమలా రామన్‌గారి పాత్ర అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకులు ఆమె రోల్‌ను తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అలాగే హీరో వసంత్ రవిగారి క్యారెక్టర్ రాసేటప్పుడు చాలా షేడ్స్ ఉన్నాయి. మన పక్కింటి కుర్రాడిలా ఉంటూనే ఇన్‌టెన్స్ పెర్ఫామర్ కావాలని అనిపించింది. తనకు కథ చెప్పగానే కనెక్ట్ అయిపోయాడు. తను తప్ప మరెవరూ చేయలేరనే రేంజ్‌లో వసంత్ రవి పాత్రలో ఒదిగిపోయారు. టెక్నికల్‌గా సౌండ్ మూవీ అశ్విన్స్. అన్ని టెక్నికల్ అంశాల నుంచి ఈ కథను చెప్పటానికి ప్రయత్నించాను. మంచి టీమ్ సపోర్ట్‌తో ‘అశ్విన్స్’ సినిమా చూశాం. తప్పకుండా ఇది థియేటర్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన మూవీ ఇది’’ అన్నారు.
నటి విమలా రామన్ మాట్లాడుతూ ‘‘తరుణ్ కల ‘అశ్విన్స్’ సినిమా. దాన్ని పూర్తి చేసిన బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌గారికి, బాపినీడుగారికి స్పెషల్ థాంక్స్. తరుణ్ కొత్తగా ఏదో చేయాలని భావించి ‘అశ్విన్స్’ మూవీ చేశారు. వసంత్ రవి డేడికేటివ్, ప్యాషనేట్, హార్డ్ వర్కింగ్ యాక్టర్. మైనస్ 3 డిగ్రీల చలిలోనూ అందరూ కష్టపడి సినిమా చేశాం. హారర్ సినిమాకు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్.. మన మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ సిద్ధార్థ్‌గారు నెక్ట్స్ రేంజ్ మ్యూజిక్‌ను అందించారు. ఎడ్విన్‌గారి విజువల్స్ బ్యూటీఫుల్‌గా ఉన్నాయి. ఇలా అందరూ అద్భుతంగా వర్క్ చేశారు’’ అన్నారు.
వసంత్ రవి మాట్లాడుతూ ‘‘‘అశ్విన్స్’ నాకెంతో స్పెషల్ మూవీ. తమిళంలో నేను తరమణి, రాకీ సినిమాలు చేశాను. ఇక ‘అశ్విన్స్’ మూవీ విషయానికి వస్తే ఇందులో సౌండ్ డిజైనింగ్ ప్రత్యేకంగా ఉంటుంది. సినిమా చూసే ఆడియెన్స్‌కి ఓ వైబ్రేషన్ ఉంటుంది. విజువల్స్, మ్యూజిక్ అనే కాకుండా తరుణ్ తేజ ఈ సినిమాలో ఓ మంచి మెసేజ్ ఇచ్చారు. అందరూ స్ట్రాంగ్ మైండ్‌తో ఉండాలని చెప్పారు. ఆ మెసేజ్ ఇప్పటి యూత్‌కి ఎంతో అవసరం. తెలుగు సినిమాలను చాలా ఇష్టపడి చూస్తాను. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు ఇలా ‘అశ్విన్స్’ సినిమాతో రావటం ఎంతో ఆనందంగా ఉంది.
ఎస్.వి.సి.సి అధినేతి బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘హారర్ జోనర్‌లో తరుణ్ తేజ్‌తో కలిసి మా అబ్బాయి బాపినీడు ‘అశ్విన్స్’ సినిమాను చేశాడు. విమలా రామన్‌తో మా బ్యానర్‌కు మంచి అనుబంధం ఏర్పడింది. వసంత్ రవి చాలా బాగా చేశాడు. విజువల్స్, సౌండింగ్ వండర్‌ఫుల్‌గా ఉన్నాయి. జూన్ 23న రిలీజ్ అవుతున్న ‘అశ్విన్స్’ చిత్రాన్ని థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయాలి. ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది’’ అన్నారు.
నటీనటులు:
వసంత్ రవి, విమలా రామన్, మురళీధరన్, సారస్ మీనన్, ఉదయ దీప్, సిమ్రాన్ పరీక్
సాంకేతిక నిపుణులు:
సమర్పణ: బాపినీడు.బి
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (ఎస్.వి.సి.సి)
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
సహ నిర్మాత: ప్రవీణ్ డేనియల్
దర్శకత్వం: తరుణ్ తేజ
సంగీతం: విజయ్ సిద్ధార్థ్
సినిమాటోగ్రఫీ: ఎడ్విన్ సాకే
ఎడిటర్: వెంకట్ రాజీన్
పి.ఆర్.ఒ: వంశీ కాకా