జూన్ 7 నుంచి ఇండియన్ ఐడ‌ల్ సీజ‌న్ 3 ప్రారంభం

Must Read

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు, ప్రేమికుల నుంచి ప్రశంసలు పొందిన సింగింగ్ రియాలిటీ షో ‘ఆహా తెలుగు ఇండియన్ ఐడల్’. ఇప్పటికే రెండు సీజన్స్‌తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ రియాలిటీ షో మూడో సీజన్‌తో మ‌న ముందుకు రానుంది. జూన్ 7 నుంచి ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 3 ఆహాలో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది.  ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 3 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో…

హోస్ట్ శ్రీరామ్ చంద్ర మాట్లాడుతూ ‘‘ఇండియన్ ఐడ‌ల్ 3 సీజ‌న్‌లో మ‌ళ్లీ రావ‌టం చాలా చాలా సంతోషంగా ఉంది. 2010 నుంచి ఇప్ప‌టి దాకా ఈ ప్రోగ్రామ్‌తో చాలా ఎమోష‌న్స్ ఎటాచ్ అయ్యున్నాయి. ఈ సీజ‌న్‌కు సంబంధించిన‌ ఆడిష‌న్స్ జ‌రిగినప్పుడు చాలా మంది కేవ‌లం సింగ‌ర్స్ మాత్ర‌మే కాదు.. చాలా మంది సంగీత కళ‌కారులు ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 3 గొప్ప టాలెంట్‌ను తీసుకురాబోతున్నారు. తొలి రెండు సీజ‌న్స్‌ను మించిన టాలెంటెడ్ ప‌ర్స‌న్స్ వ‌చ్చారు. మూడు నాలుగు నెల‌ల పాటు ఈ మ్యూజిక‌ల్ జ‌ర్నీ కొన‌సాగ‌నుంది. ఆహా నాకు కుటుంబంలాంటిది. మంచి అనుబంధం ఉంది. ఇండియ‌న్ ఐడ‌ల్ జ‌ర్నీతో పాటు న‌టుడిగానూ ఆహాలో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాను. ఇలాంటి గొప్ప మాధ్య‌మంలో ఇంకా కొత్త టాలెంట్ ప‌రిచ‌యం అవుతుంది. అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు.

సింగ‌ర్ గీతా మాధురి మాట్లాడుతూ ‘‘ఆహా తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 2 చేసిన త‌ర్వాత సీజ‌న్ 3కి కాల్ వ‌స్తుంద‌ని నేను అనుకోలేదు. అయితే నాకు ఆహా నుంచి కాల్ వ‌చ్చింది. సీజ‌న్ 3కి చక్క‌గా ఆడిష‌న్స్ ముగిశాయి. మంచి కంటెస్టెంట్స్ వ‌చ్చారు. గ‌త సీజ‌న్స్‌లాగా ఈ సీజ‌న్‌లోనూ చాలా మంచి ఆణిముత్యాలు దొరికారు. వాళ్లు ఈ వేదిక ఎలా ఉప‌యోగించుకుని ప్ర‌తిభ‌ను చాటుకుంటారో చూడాలి. ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 3 చాలా చాలా బావుంటుంది’’ అన్నారు.

ఆహా నుంచి రాకేష్ మాట్లాడుతూ ‘‘తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ రెండు సీజ‌న్స్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు మూడో సీజ‌న్ రానుంది. మేం ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వ‌చ్చింది. దీనికి ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయిలో గుర్తింపు తేవాల‌నే ఉద్దేశంతో యు.ఎస్‌లో ఆడిష‌న్స్ చేశాం. మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సీజ‌న్ గొప్ప‌గా ఉంటుంద‌ని భావిస్తున్నాను’’ అన్నారు.

సింగ‌ర్ కార్తీక్ మాట్లాడుతూ ‘‘ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 3లో యంగ్ టాలెంటెడ్ సింగ‌ర్స్ మాత్ర‌మే కాదు, ఏదో సాధించాల‌నే త‌ప‌న ఉన్న‌వాళ్లు వ‌చ్చారు. సింగ‌ర్స్ మాత్ర‌మే కాదు, మ్యూజిషియ‌న్స్ కూడా వ‌చ్చారు. సీజ‌న్ 3 చాలా మందిని ఇన్‌స్పైర్ చేస్తుంది’’ అన్నారు.

ప్రీమాంట‌ల్ ఇండియా ఆరాధ‌న మాట్లాడుతూ ‘‘తమన్, కార్తీక్, గీతామాధురి, శ్రీరామచంద్ర చాలా మందికి స్ఫూర్తినిస్తూ ఎంకరేజ్ చేస్తూ అందరినీ ముందుకు నడిపిస్తున్నారు. సీజన్ 3లో మన తెలుగు రాష్ట్రాలతో పాటు యు.ఎస్ వ‌ర‌కు వెళ్లాం. గొప్ప టాలెంట్‌ను ప‌రిచ‌యం చేయ‌బోతున్నాం. ప్రేక్ష‌కులు స‌పోర్ట్‌ను కొన‌సాగించాల‌ని కోరుకుంటున్నాం’’ అన్నారు.

ఆహా సీఇఓ ర‌వికాంత్ మాట్లాడుతూ ‘‘ఇండియ‌న్ ఐడ‌ల్ ఎంతో మంది గొప్ప సింగ‌ర్స్‌ను అందించింది. త‌మ‌న్‌, కార్తీక్‌, గీతామాధురి, శ్రీరామచంద్ర వంటి వారు రాక్‌స్టార్స్ మెప్పిస్తున్నారు. ఈ సీజన్ 3లో కేవ‌లం సింగింగ్ టాలెంట్‌తో పాటు కొత్త కొత్త మ్యూజిక‌ల్ టాలెంట్స్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుక‌బోతున్నారు’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ మాట్లాడుతూ ‘‘గత రెండు సీజన్స్ కంటే ఇండియన్ ఐడల్ సీజన్ 3లో వరల్డ్ వైడ్ మ్యూజిక్ కంటెస్టెంట్స్ వచ్చారు. అందరిలో నుంచి 12 మంది టాప్ సింగర్స్‌ను ఎంపిక చేశాం. న‌న్ను న‌మ్మి ఇండియ‌న్ ఐడ‌ల్ లో జ‌డ్జిగా పెట్టిన అర‌వింద్‌గారికి, ఎంక‌రేజ్ చేసిన త్రివిక్ర‌మ్‌గారికి ఈ సంద‌ర్భంగా థాంక్స్ చెబుతున్నాను. ప్రీమాంట‌ల్ టీమ్‌కి థాంక్స్‌. నా మ్యూజిషియ‌న్ టీమ్ ఫెంటాస్టిక్ స‌పోర్ట్ ఇచ్చారు. సీజ‌న్ 3 నుంచి గొప్ప టాలెంట్ మ‌న ముందుకు రాబోతుంది. ఇది మాకు ఓ ఎక్స్‌పీరియెన్స్ అనే చెప్పాలి. అంద‌రికీ థాంక్స్‌. జూన్ 7 నుంచి ఆహాలో ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 3 ప్రారంభం కానుంది’’ అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో ఆహా నుంచి రాజ‌శేఖ‌ర్‌, శ్రీదేవి త‌దిత‌రులు  పాల్గొన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News