ఒకే  ఫ్రేమ్‌లో నేచురల్ స్టార్ నాని, సల్మాన్ ఖాన్

Must Read

నేచురల్ స్టార్ నాని తన చిత్రం ‘హాయ్ నాన్న’ని టీమ్‌తో కలిసి జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. శౌర్యువ్ దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈరోజు, ఇండియా Vs ఆస్ట్రేలియా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ షోలో స్టార్ స్పోర్ట్స్ తెలుగులో కనిపించారు నాని. స్టార్ స్పోర్ట్స్ హిందీ ఛానెల్‌లో కనిపించిన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను కలిశారు. ఇద్దరు స్టార్‌లను ఒకే  ఫ్రేమ్‌లో చూడటం అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది.

ఇటివలే, హాయ్ నాన్న టీమ్ షేర్ చేసిన ఫోటో, వీడియోలో రాజకీయ నాయకుడిగా కనిపించారు నాని. ‘హాయ్ నాన్న’ ప్రచారంలో భాగంగా తన పొలిటికల్ పార్టీ మేనిఫెస్టోను ఆయన అనౌన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందరూ ఈ ఆలోచనను మెచ్చుకున్నారు.

 నాని అండ్ హాయ్ నాన్న టీమ్ సినిమాని వినూత్నంగా అద్భుతంగా ప్రమోట్ చేస్తోంది.

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News