‘సర్కిల్’ డైరెక్టర్ నీలకంఠ ఇంటర్వ్యూ

Must Read

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ రూపొందించిన కొత్త సినిమా “సర్కిల్”. సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా, రిచా పనై , నైనా కీలక పాత్రల్లో నటించారు. ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎమ్‌వీ శరత్ చంద్ర, టి.సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించారు. సరికొత్త థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 7న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు నీలకంఠ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివే..

“మాయ సినిమా తరువాత తొమ్మిదేళ్ల గ్యాప్ అనంతరం తెలుగులో సినిమా తీస్తున్నా.. తెలుగులో మళ్లీ సినిమా తీయడం చాలా సంతోషంగా ఉంది. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కించాం. ఫేట్ (విధి) అనే కాన్సెప్ట్ ఓ వందమందిని ఓ సర్కిల్‌లోకి తీసుకొచ్చి.. ఎట్లా వారి జీవితాలను అల్లకల్లోలం చేసిందని మెయిన్ థీమ్‌గా తీసుకున్నాం. ఇది రొమాంటిక్, క్రైమ్ థ్రిల్లర్ కాదు. ఇన్వెస్టిగేషనల్ టైప్‌లో కాకుండా.. ఎమోషనల్ థ్రిల్లర్‌గా రన్ చేశాం.

సాయి రోనక్ ఫొటో గ్రాఫర్‌గా కనిపిస్తాడు. అన్‌హ్యూమన్ సర్కిల్‌లోకి అతన్ని ఎలా లాగబడ్డాడు..? అక్కడి నుంచి కథ రివీల్ అవుతుంది. రొమాంటిక్ యాంగిల్ కూడా జత చేశాం. ముగ్గురు హీరోయిన్లు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. నా గత సినిమాల్లో మాదిరే హీరోయిన్స్‌కు ఈ మూవీలో కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. ముగ్గురు హీరోయిన్లు మూడు డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారు. సినిమాలో వాళ్ల లైఫ్‌ను వాళ్లే డిసైడ్ చేసుకుని ముందుకు సాగుతారు.

బాబా భాస్కర్ గారి క్యారెక్టర్‌ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఆయన అందరికీ ఓ కొరియోగ్రాఫర్‌గానే తెలుసు. ఫస్ట్ టైమ్ ఓ కీలక పాత్రలో నటించాడు. తనదైన శైలిలో కామెడీని టచ్ చేస్తూనే విలన్‌గా మెప్పించాడు. ఈ పాత్రకు ఆయన కరెక్ట్‌గా సెట్ అయ్యారు. హీరోనా.. విలన్ అని చూడలేదు. బాబా భాస్కర్‌ను చూడగానే క్యారెక్టర్‌కు సెట్ అవువతాడని అనిపించింది. ఆయన కూడా డౌట్ పడ్డాడు. బాబా భాస్కర్ క్యారెక్టర్‌ను మాత్రం అన్‌ఎక్స్‌పెక్టెట్‌గా ఉంటుంది.

నా సినిమాలు అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్‌గా ఉంటాయి. నా మూవీస్ అన్ని క్రిటికల్‌గా రన్ అయ్యాయి. నేను స్టార్ హీరోలతో చేయాలని కాదు.. కాన్సెప్ట్‌ మీదే ఎక్కువగా వర్క్ చేశా. త్వరలో కుదిరితే స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేస్తా. మాయ సినిమా తరువాత రెండు ప్రాజెక్ట్‌లకు సైన్ చేశా. అయితే అనుకోని కారణాలతో అవి ఆగిపోయాయి. మాయ మూవీని హిందీలో తీయాలని మహేష్ భట్ గారు అడిగారు. లాస్ట్ మినిట్‌లో అది ఆగిపోయింది. మరో రెండు సినిమాలు దగ్గరకు వచ్చి ఆగిపోయాయి. ఆ తరువాత ఓ మలయాళం సినిమా తీశా. అందుకే గ్యాప్ వచ్చింది.

నా మైండ్‌లో వచ్చిన ఆలోచనల ఆధారంగానే కథలను రూపొందిస్తా. ఒరిజనల్‌గా చేయడమే నాకిష్టం. సర్కిల్ సినిమా రియల్‌ లైఫ్‌కు సంబంధించిన కథ కాదు. ఊహించిన రాసిన కథే ఇది. ఫేట్ ఎలా గేమ్ ఆడిందని ఓ ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించాం. ముగ్గురు హీరోయిన్లతో లవ్ ట్రాక్ కంటే.. లైఫ్ ట్రాక్ తెరపై చూపించాం. మూడు డిఫరెంట్ క్యారెక్టర్లు లైఫ్‌లో ఎలా ట్రావెల్ చేశాయని చూపించాం.

వెంకటేష్ గారితో స్వామి వివేకానంద సిరీస్‌ ప్లాన్ చేశాం. అయితే అది టేకాఫ్ కాలేదు. ఆ తరువాత వెంకటేష్‌ గారితో ఈనాడుకు కలిసి పనిచేశా. వివేకానంద సిరీస్‌ చేయాలని వెంకటేష్ గారు చాలా ఆసక్తిగా ఉండేవారు. అప్పుడ టీవీ సిరీస్‌కు తీయాలని ప్లాన్ చేశాం. కానీ ఆ ప్రాజెక్ట్ టేకాఫ్ కాలేదు. నాకు అవార్డు గురించి ఆలోచన లేదు. సినిమా మంచి సక్సెస్ అయి.. ఆడియన్స్ మెచ్చుకుంటే అదే నాకు పెద్ద అవార్డు. మనం సినిమా తీసి థియేటర్‌కు వెళితే.. అక్కడ జనాలు ఇచ్చే అభినందలు చెప్పలేని ఆనందాన్ని ఇస్తాయి.

ఈ సినిమాలో కాన్సెప్ట్‌తోపాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను కూడా చూపించాం. ఆడియన్స్ చూసే విధానంలో మార్పు వచ్చింది. కొత్తగా తీసిన సినిమాలను తప్పకుండా ఆదరిస్తున్నారు. మా సినిమాను కూడా కచ్చితంగా రిసీవ్ చేసుకుంటారని నమ్మకం ఉంది. ఈ సినిమా తరువాత వెబ్‌సిరీస్ చేయాలని ఆసక్తి ఉంది. రెండు కాన్సెప్ట్‌లు రెడీగా ఉన్నాయి.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News