ఆకట్టుకుంటున్న “ఎపిక్” మూవీ ఆనంద్ దేవరకొండ బర్త్ డే ప్రోమో

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా “ఎపిక్”. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. వెంకట్ ఉప్పుటూరి, వి.ఎం.ఆర్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి బర్త్ డే ప్రోమో రిలీజ్ చేశారు.

లండన్ లో స్నేహితుల సమక్షంలో హీరో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం, ఇండియా నుంచి పేరెంట్స్ ఆనంద్ కు ఫోన్ చేసి విష్ చేయడం, తండ్రి చెప్పీ చెప్పనట్లుగా కొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ఈ ప్రోమోలో చూపించారు. ఈ ప్రోమోకు బీజీఎంగా అమృతం సీరియల్ టైటిల్ సాంగ్ పెట్టడం కొత్త ఫీల్ కలిగించింది. కల్ట్ బ్లాక్‌బస్టర్ “బేబీ” తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న చిత్రమిది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ‘సంచారమే..’ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. క్రేజీ కాంబోలో వస్తున్న “ఎపిక్” మూవీ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది.

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

5 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

5 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

6 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago