పుష్ప 2: ది రూల్’ నుంచి కపుల్ సాంగ్.. ‘సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామీ’ విడుదల

Must Read

ఐ ఫీస్ట్.. ‘పుష్ప 2: ది రూల్’ నుంచి కపుల్ సాంగ్.. ‘సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామీ’ విడుదల

‘పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదే లే’ అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గడ్డం కింద చెయ్యి పెట్టి అడ్డంగా తిప్పితే.. వరల్డే షేకయింది.
‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’ అంటే స్టార్స్ అందరూ ఫైర్ లెక్క ఫీలయ్యారు..
ఇలా ఒక్కటేమిటి పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్, ఆ పుష్పరాజ్‌ని క్రియేట్ చేసిన క్రియేటర్‌గా సుకుమార్ ఒక హిస్టరీనే క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ ‘పుష్ప’కు కంటిన్యూగా రాబోతోన్న ‘పుష్ప 2: ది రూల్’పై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయంటే.. ‘పుష్ప’ ఎలా ప్రేక్షక హృదయాలను దోచుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న ‘పుష్ప 2: ది రూల్’ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇప్పటికే విడుదలైన ‘గ్లింప్స్, టీజర్, పుష్ప పుష్ప సాంగ్’ యూట్యూబ్‌లో ఆల్ టైమ్ రికార్డులను నెలకొల్పగా.. ఇప్పుడు మరో ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ‘పుష్ప 2: ది రూల్’ నుంచి కపుల్ సాంగ్ ‘సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామీ’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ వదిలారు. ఈ పాటకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన చిన్న ప్రోమో ఎలా వైరల్ అయిందో తెలిసిందే. మేకింగ్ విజువల్స్‌తో వచ్చిన ఈ కపుల్ సాంగ్.. ‘నా సామి’ పాటను బీట్ చేసేలా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. అంతకుమించి అనేలా ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందించారు.

‘‘వీడు మొరటోడు
అని వాళ్లు వీళ్లు.. ఎన్నెన్ని అన్న
పసిపిల్లవాడు నా వాడు..

వీడు మొండోడు
అని ఊరు వాడ అనుకున్నగానీ
మహరాజు నాకు నా వాడు..

ఓ.. మాట పెలుసైనా.. మనసులా వెన్న
రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నా.. కన్నా..

సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామీ..
మెత్తానీ పత్తిపువ్వులామరి సంటోడే నా సామీ

ఓ.. ఎర్రబడ్డ కళ్లలోన కోపమే మీకు తెలుసు..
కళ్లలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు..
కోరమీసం రువ్వుతున్న రోషమే మీకు తెలుసు..
మీసమెనుక ముసురుకున్న మూసి నవ్వు నాకు తెలుసు
అడవిలో పులిలా సరసర సరసర చెలరేగడమే మీకు తెలుసు
అలసిన రాతిరి ఒడిలో చేరి తలవాల్చడమే శ్రీ.. వల్లికి తెలుసు

సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామీ..
మెత్తానీ పత్తిపువ్వులామరి సంటోడే నా సామీ

ఓ.. గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చివేసే నవాబు..
నన్ను మాత్రం చిన్ని చిన్న ముద్దులడిగే గరీబు..
పెద్ద పెద్ద పనులు ఇట్టే చక్కబెట్టే మగాడు..
వాడి చొక్కా ఎక్కడుందో.. వెతకమంటాడు చూడు..
బయిటికి వెళ్లి ఎందరెందరినో ఎదురించేటి దొరగారు
నేనే తనకి ఎదురెళ్లకుండా బయటికి వెళ్లరు శ్రీ..వా..రు

సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామే..
ఇట్టాంటి మంచి మొగుడుంటే ఏ పిల్లైనా మహరా..ణే’’ వంటి అద్భుతమైన సాహిత్యంతో వచ్చిన ఈ పాటను 5 భాషల్లోనూ ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ పాడటం మరో విశేషం. ఈ పాట మేకింగ్ విజువల్స్ చూస్తుంటే.. ఐ ఫీస్ట్ అన్నట్లుగా ఉంది. అల్లు అర్జున్, రష్మికా మందన్నా మరోసారి తమ డ్యాన్స్‌తో దుమ్మురేపారనేది అర్థమవుతోంది. ఈ పాటతో ‘పుష్ప 2: ది రూల్’పై క్రేజ్ డబులైంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ‘పుష్ప ది రైజ్’ చిత్రంలో త‌న న‌ట‌న‌తో
మొట్ట‌మొద‌టిసారిగా తెలుగు క‌థానాయ‌కుడు జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు తీసుకోవ‌డం, అలాగే మొట్టమొదటిసారిగా దుబాయ్ మ్యాడ‌మ్ టుసార్ట్స్‌లో ద‌క్షిణ భార‌తదేశ న‌టుడి స్టాట్యూని, గ్యాల‌రీ‌ని ఏర్పాటు చేయ‌టం తెలుగు వారంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం. ఇలాంటి ప్ర‌త్యేక‌త‌లు ‘పుష్ప’ చిత్రంతోనే సంత‌రించుకున్నాయి. ఇక త్వ‌ర‌లో
‘పుష్ఫ 2: ది రూల్’తో మ‌రోసారి ప్ర‌పంచంలోని సినిమా అభిమానులంతా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌ట‌విశ్వ‌రూపాన్ని చూడ‌బోతున్నారు. 90 సంవ‌త్ప‌రాల తెలుగు సినిమా చ‌రిత్రలో మొద‌టిసారి తెలుగు న‌టుడి న‌ట‌న చూసేందుకు ప్ర‌పంచ దేశాల‌న్నీ ఎదురుచూస్తున్నాయంటే.. ‘పుష్ప’ ఇంపాక్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
సినిమాటోగ్రాఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: S. రామకృష్ణ – మోనిక నిగొత్రే
లిరిసిస్ట్: చంద్రబోస్
సీఈఓ: చెర్రీ
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News