గ్లోబ‌ల్ రేంజ్‌లో పుష్ప చిత్రంతో ఇంపాక్ట్ చూపించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘పుష్ప’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన అద్భుతమైన నటన, డిఫరెంట్ స్టైల్, పవర్‌ఫుల్ ఎనర్జీ ఈ చిత్రాన్ని భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఐకానిక్ మూవీగా నిలిపింది. ఈ సినిమా కోసం రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రాచుర్యం పొందింది. ఐకాన్ స్టార్ తనదైన స్టైల్, డాన్స్, ఛ‌ర్మిష్మాతో ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించి అభిమానుల గుండెల్లో ఆరాధ్య హీరో అయ్యారు.

సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’, మూవీలోని పాటలు ప్రపంచవ్యాప్తంగా ఇంకా ట్రెండ్ అవుతున్నాయి. ప్రేక్షకాదరణను పొందుతున్నాయి. ‘ఊ అంటావా..’ అనే పాట సెన్సేషన్ తర్వాత, సినిమాలోని ఇంట్రో సాంగ్ ‘దాక్కో దాక్కో మేక’కూడా అంతర్జాతీయ ప్రేక్షకులను అబ్బురపరిచింది. పాపులర్ అమెరికన్ టీవీ షో ‘అమెరికాస్ గాట్ టాలెంట్‌’లో బీ యూనిక్ క్రూ టీమ్ చేసిన అసాధారణ ప్రదర్శనతో పుష్ప చిత్రానికి విదేశాల్లోనూ సరికొత్తగా ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ పాపులర్ డాన్స్ షోలో భారతీయ సంగీతంలోని శక్తిని, ఉత్సాహాన్ని ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా ప్రపంచం చూసింది.

పాపులర్ డాన్స్ షో అమెరికా గాట్ టాలెంట్ లో భారతదేశానికి చెందిన డాన్స్ గ్రూప్ బీ యూనిక్ క్రూ.. పుష్ప చిత్రంలోని హిట్ సాంగ్ ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్‌కు స్టేజ్‌పై అత్యద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ఈ పాట ఒక సెన్సేషనల్ చార్ట్‌బస్టర్‌గా నిలవటమే కాదు..అల్లు అర్జున్ తన ఎనర్జీ, సిగ్నేచర్ స్వాగ్‌తో దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. అదే ఎనర్జీ, స్టైల్‌తో స్ఫూర్తి పొందిన యువ డాన్సర్ల బృందం అతిథులను, ప్రేక్షకులను అబ్బురపరిచే ప్రదర్శనతో మెప్పించింది. పాటలోని అద్భుతమైన డాన్స్ మూమెంట్స్ ఆడియెన్స్‌ను ఆశ్చర్యపరిచి మంత్రముగ్ధుల్ని చేశాయి.

ఈ అద్భుతమైన ప్రదర్శన, పుష్ప సినిమాలోని ఐకానిక్ స్టైల్‌కు.. అల్లు అర్జున్ అందించిన డైనమిక్ ప్రెజెన్స్‌కు ఘనమైన ట్రిబ్యూట్‌గా నిలిచింది. ఈ డాన్స్ పెర్ఫామెన్స్ చూసిన ప్రేక్షకులు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో డాన్సర్స్‌ను అభినందించారు. అల్లు అర్జున్ పుష్ప సినిమా సంగీతం ఎంత ఆకట్టుకుందో, ఎంత ప్రభావాన్ని చూపించిందనే విషయాన్ని ఈ పాట మరోసారి రుజువు చేసింది. ఇప్పటికీ ఈ పాట గ్లోబల్ ప్లేలిస్టుల్లో దూసుకెళ్తోంది. తెలుగు ప్రేక్షకులు, అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రేక్షకులూ ఈ అద్భుతమైన వీడియో క్లిప్‌ను ఆన్‌లైన్‌లో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. బీ యూనిక్ క్రూ సభ్యుల ప్రతిభను ప్రశంసిస్తూ.. గ్లోబల్ స్టేజ్‌పై అల్లు అర్జున్ చూపించిన ఇంపాక్ట్‌ను ఘనంగా ఆహ్వానిస్తున్నారు.

అల్లు అర్జున్ అభిమానులు తమ అభిమాన ఐకానిక్ స్టార్ హీరో పాట గ్లోబల్ స్థాయిలో ప్రాచుర్యం పొందినందుకు గర్వంతో, ఉత్సాహంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్, సినిమా టీమ్ ఈ ప్రదర్శనను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ఒక గ్లోబల్ ఫినామెనాన్. ఏజీటీ సీజన్ 20 స్టేజ్‌పై బీ యూనిక్ క్రూ పుష్ప పాటకు ప్రదర్శన ఇచ్చారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. జడ్జిలు సైతం దీన్ని ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఆఫ్ ది సీజన్‌గా ప్రశంసించారు’. అంటూ పోస్ట్ చేయటంతో ద్వారా అభిమానుల ఆనందం రెట్టింపయ్యింది. పుష్ప సినిమా, అల్లు అర్జున్ గ్లోబల్ స్థాయిలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే విషయంలో దీంతో మరోసారి నిరూపితమైంది.

‘వావ్ మైండ్ బ్లోయింగ్’ అని అల్లు అర్జున్ ఈ ట్వీట్‌ని కోట్ చేస్తూ స్పందించారు. భారతీయ సినిమా, సంగీతం ఎంత దూరం ప్రయాణించగలవో దీంతో తెలిసింది. ఒక ప్రాంతీయ హిట్‌గా మొదలైన పాట ఇప్పుడు గ్లోబల్ పాప్ కల్చర్‌లో భాగంగా మారింది. గొప్ప కథలు, ప్రదర్శనలు, పాటలు ఏ దేశంలో అయినా ప్రతీ ఒక్కరినీ అలరించగలవని మరోసారి దీంతో రుజువైంది.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

3 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

3 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

6 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago