‘అనకాపల్లి’ చిత్రం యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లగడపాటి శ్రీధర్
భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మించిన రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఈ సినిమాని త్వరలోనే రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు బుధవారం నాడు అనకాపల్లిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా..
సోనూ సూద్ మాట్లాడుతూ .. ‘‘అనకాపల్లి’ సినిమా ఈవెంట్ కోసం ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది. విక్రమ్, తారక్, సంధ్య అద్భుతంగా నటించినట్టు కనిపిస్తోంది. ఖగేష్ ఈ చిత్రాన్ని గొప్పగా తీసినట్టు అనిపిస్తోంది. అనకాపల్లి సినిమాని అనకాపల్లి ప్రజలు సపోర్ట్ చేయాలి. ఈ మూవీని థియేటర్లో చూసి పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ .. ‘‘అనకాపల్లి’ ఈవెంట్‌కు వచ్చిన సోనూ సూద్ గారికి థాంక్స్. ఆయన ఎంతో మందికి దేవుడు. నేను ఈ మూవీని ఆల్రెడీ చూశాను. అద్భుతంగా వచ్చింది. అనకాపల్లిలోనే ప్రేక్షకులతో పాటుగా మళ్లీ సినిమాని చూస్తాను. అనకాపల్లిలో ఇంత వరకు బెల్లం ఫేమస్.. ఇకపై నిర్మాత నాయుడు గారు ఫేమస్ అవుతారు. విక్రమ్, తారక్ పొన్నప్ప, సంధ్య అద్భుతంగా నటించారు. నా కొడుక విక్రమ్ గురించి నేను ఎక్కువగా చెప్పుకోకూడదు. ఖగేష్ ఈ మూవీని గొప్పగా తీశాడు. దేవ్‌జండ్ మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇలాంటి ట్విస్ట్‌తో ప్రపంచంలో సినిమా రాలేదు. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుంది. తమిళంలో కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. ఆగస్ట్ 7న అనకాపల్లిలో స్పెషల్ షో వేస్తాం. ఇక్కడ స్పందనను బట్టి గ్రాండ్‌గా తర్వాత మూవీని రిలీజ్ చేస్తాం. ఈ సినిమాకి అన్ని రకాలుగా కారణమైన త్రినాథరావు గారికి థాంక్స్’ అని అన్నారు.
విక్రమ్ సహిదేవ్ మాట్లాడుతూ .. ‘‘అనకాపల్లి’ కోసం వచ్చిన సోనూ సూద్ గారికి థాంక్స్. ఖగేష్ మా అందరి కంటే ఎక్కువగా కష్టపడ్డాడు. అతను పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలని కోరుకుంటున్నాను. త్రినాథరావు గారితో నటించడం ఆనందంగా ఉంది. రెండేళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్ అనుకున్నాం. అనకాపల్లిలో చిత్రీకరించడంతో నేను కూడా అనకాపల్లి కుర్రాడిని అయిపోయాను. ఇంద్రజ గారు నాకు అమ్మగా ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాకి ఆమె ప్రాణం పోశారు. నాయుడు గారు, రాజా గారు, త్రినాథరావు గారు కుటుంబ సభ్యుల్లా మారిపోయారు.
‘అనకాపల్లి’తో నాకు మంచి ఫ్యామిలీ దొరికింది. తారక్ పొన్నప్ప గారు గొప్ప నటుడు. సంధ్య గారితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. దేవ్‌జండ్ అద్భుతమైన స్కోర్ ఇచ్చారు. మా సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ .. ‘‘అనకాపల్లి’ ఈవెంట్‌కు వచ్చిన సోనూ సూద్ గారికి, నా మిత్ర బృందంకి థాంక్స్. అనకాపల్లిలో నాటకాలు వేయాలని చదువుకునే టైంలో అనుకున్నాను. కానీ అప్పుడు కుదర్లేదు. కానీ ఇప్పుడు నేను నటించి, నిర్మించిన సినిమా ఈవెంట్ ఇక్కడ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. అనకాపల్లి ప్రజలంతా ‘అనకాపల్లి’ సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి. మళ్లీ సక్సెస్ మీట్‌లో కలుద్దాం’ అని అన్నారు.
నిర్మాత నాయుడు కాండ్రేగుల మాట్లాడుతూ .. ‘‘మా నాన్న కోసం ఈ సినిమాని చేశాను. కానీ ఆయన కొన్ని నెలల క్రితం స్వర్గస్తులయ్యారు. నాన్న ఎక్కడున్నా మాతోనే ఉంటారు. మా నాన్న సినిమా షూటింగ్ టైంలో ఓ చిన్న కుర్రాడిలా సెట్‌లో ఉండేవారు. అనకాపల్లి టైటిల్ పెట్టినందుకు ఊరంతా నాకు సపోర్ట్ చేసింది. నాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన నా గురువు దాడి జగన్ ప్రభాకర్ గారికి థాంక్స్. నాకు ఎల్లప్పుడూ అండగా ఉండే త్రినాథరావు నక్కినకు థాంక్స్.
సంధ్యా వశిష్ట మాట్లాడుతూ .. ‘‘అనకాపల్లి’ ఈవెంట్‌ను అనకాపల్లిలో చేయడం ఆనందంగా ఉంది. మా కార్యక్రమానికి వచ్చిన సోనూ సూద్ గారికి థాంక్స్. నన్ను నమ్మి అమ్ము అనే పాత్రను నాకు ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. కెమెరామెన్ మాయా. వి మా అందరినీ చక్కగా చూపించారు. దేవ్‌జండ్ మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. పొన్నప్ప గారితోనే నేను మొదటి సీన్ షూట్ చేశాను. విక్రమ్‌తో నటించడం ఆనందంగా ఉంది. మా చిత్రంలో అందమైన ప్రేమ కథతో పాటు ఫ్యామిలీ డ్రామా ఉంటుంది’ అని అన్నారు.
దాడి జగన్ ప్రభాకర్ మాట్లాడుతూ .. ‘‘అనకాపల్లి’ టీంకు ఆల్ ది బెస్ట్. నా తమ్ముడు నాయుడు ఎంతో కష్టపడి, ఎంతో ఖర్చు పెట్టి ‘అనకాపల్లి’ మూవీని అద్భుతంగా నిర్మించారు. మన అనకాపల్లి ప్రజలంతా సినిమాని చూసి, సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సతీమణి శ్రీమతి నందమూరి బసవరామ తారకం గారి శతజయంతి సందర్భంగా ప్రారంభించిన నందమూరి…
-సోషల్ మీడియాలో వైరల్ మారిన డెమాన్ పవన్, రీతూ చౌదరి 'బంగారం' సాంగ్ బిగ్‌బాస్ ఫేమ్ డెమాన్ పవన్, రీతూ…
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా వచ్చే వారం గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న యానిమేషన్ మూవీ బహుజన…
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో…
-త్వరలో పాన్ ఇండియా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ నటుడు, దర్శకుడు నవీన్ హిదయత్ రూపొందించిన తమిళ…
ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వంలో రామ్ కార్తీక్,…