ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా వచ్చే వారం గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న యానిమేషన్ మూవీ

బహుజన చక్రవర్తిగా కీర్తి పొందిన చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి రూపొందించిన యానిమేషన్ మూవీ “సర్దార్ సర్వాయి పాపన్న”. ఈ సినిమాను వి.జి.మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. దీపక్ న్యాతి నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు వహిస్తున్నారు. ఈ యానిమేషన్ మూవీ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా వచ్చేవారం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ చిత్ర పోస్టర్ లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – ఈ రోజు “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. దాదాపు 360 ఏళ్ల క్రితం బహుజన చక్రవర్తిగా వెలుగొందిన సర్దార్ సర్వాయి పాపన్న జీవిత కథతో వెంకటేష్ గౌడ్ దర్శక నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మా ఆర్కే ఫిలింస్ ద్వారా వచ్చే వారం ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమాను నేను చూశాను. మా వెంకటేష్ అద్భుతంగా రూపొందించాడు. సర్దార్ పాపన్న గొప్పతనం ఎక్కడా తగ్గించకుండా, ఆయన ఎన్ని పోరాటాలు చేశాడు, ఎంతమందిని ఒక్కటి చేయగలిగాడు, ఎన్ని కుట్రలను ఛేదించాడు అనేది కళ్లకు కట్టినట్లు తెరకెక్కించాడు. అన్ని కులాల వారిని ఏకం చేసి అన్యాయాలపై తిరుగుబాటు చేసిన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న. అన్యాయంగా వసూలు చేసే పన్నుల భారాన్ని ప్రజలకు తప్పించిన నాయకుడు ఆయన. ఈ సినిమా చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ప్రతి ఊరిలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ మీద కూడా పాపన్న విగ్రహం పెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. నేను గతంలో సూపర్ స్టార్ కృష్ణ, సుమన్, జైహింద్, శ్రీజ లతో సర్దార్ పాపన్న మూవీని దర్శకత్వం వహించాను. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పటికీ టీవీ ఛానెల్స్ లో ప్రసారమవుతుంటుంది. ఏడాదిన్నరగా వెంకటేష్ కష్టపడి ఈ సినిమాను రూపొందించాడు. సెన్సార్ నుంచి యు.ఎ. సర్టిఫికెట్ వచ్చింది. వచ్చే వారం భారీ ఎత్తున ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాకు మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా అన్నారు.

దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి మాట్లాడుతూ – మా వి.జి. మూవీ మేకర్స్ బ్యానర్ పై “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమాను నిర్మించాం. మాకున్న వనరులకు ఇది భారీ బడ్జెట్ మూవీ అనే చెప్పాలి. అయినా సినిమా కంప్లీట్ చేసి సెన్సార్ పూర్తి చేసి రిలీజ్ కు తీసుకొస్తున్నాం. ఈ నెల 7నే మా మూవీని రిలీజ్ చేయాలని అనుకున్నాం. చిన్న సినిమాలకు థియేటర్స్ ఇబ్బందులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. ఈ నెల 14, లేదా 21న రిలీజ్ అనేది ప్లాన్ చేస్తున్నాం. సర్దార్ పాపన్న 376వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నాం. మా సినిమాను సబ్బండ వర్గాల ప్రజలంతా ఆదరిస్తారని కోరుకుంటున్నాం.

నిర్మాణ పర్యవేక్షకులు దీపక్ న్యాతి మాట్లాడుతూ – విదేశీయులు కీర్తించిన ఘన చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్నది. అలాంటి పోరాట వీరుడి చరిత్రను కొందరు మరుగునపడేలా చేశారు. మంచి రచయిచ, దర్శకుడు అయిన వెంకటేష్ ఎన్నో ఇబ్బందులు తట్టుకుని ఈ సినిమాను ఏఐ, యానిమేషన్ మూవీగా రూపొందించారు. సర్దార్ పాపన్న చరిత్రను పూర్తిగా అధ్యయనం చేసి గొప్ప చిత్రంగా రూపొందించారు. ఇది డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ గారి ఆర్కే ఫిలింస్ ద్వారా రిలీజ్ కు వస్తుండటం సంతోషంగా ఉంది అన్నారు.

టెక్నీషియన్స్

వీఎఫ్ఎక్స్, సూపర్ విజన్ – పి. శ్రీనివాస్
ఎడిటర్ – సతీష్ పెటేటి, మణి
సినిమాటోగ్రఫీ, విజువల్ డైరెక్షన్ – మిర్జాపురి సైమన్
లీడ్ ఏఐ విజువల్ డైరెక్టర్ – సురేష్ మల్ల
మ్యూజిక్ సూపర్ వైజర్, లిరిక్స్ – వెంకటేష్ గౌడ్ లింగంపల్లి
బ్యానర్ – వి.జి. మూవీ మేకర్స్
నిర్మాత, దర్శకత్వం – వెంకటేష్ గౌడ్ లింగంపల్లి
రిలీజ్ – ఆర్ కే ఫిలింస్ (డా.ప్రతాని రామకృష్ణ గౌడ్)
పీఆర్ఓ – చందు రమేష్

TFJA

Recent Posts

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 day ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 day ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 day ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 day ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

2 days ago

పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లందరికీ ఇది ఒక పాఠం — ఇరుముడి చూసి నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది!

ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…

3 days ago