టాలీవుడ్

యాక్టింగ్ మీద ప్యాషన్ తో మళ్లీ టాలీవుడ్ కు రావాలనుకుంటున్నా – నటి ప్రశాంతి హారతి

పెళ్లాం ఊరెళితే, ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంతి హారతి. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాక కుటుంబంతో అమెరికాలో సెటిల్ అయ్యారు ప్రశాంతి హారతి. అక్కడ ఆమె ఓంకార అనే కూచిపూడి డ్యాన్స్ స్కూల్ ప్రారంభించారు. నటిగా తన కెరీర్ లో సుదీర్ఘ విరామం వచ్చింది. ఇప్పటికీ తనకు యాక్టింగ్ మీద ప్యాషన్ తగ్గలేదని, ఆ ప్యాషన్ తోనే మళ్లీ టాలీవుడ్ కు రావాలని అనుకుంటున్నానని ఇవాళ జరిగిన ఇంటర్వ్యూలో ప్రశాంతి హారతి చెప్పారు.

  • మా కుటుంబం విశాఖలో ఉండేవాళ్లం. నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అంటే ఇష్టం. కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్నాను. మా ఇంట్లో సినిమాలు ఎక్కువగా చూసేవారు కాదు. సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేని వాతావరణం ఉండేది. సినిమాలు చూసేందుకు నన్నూ పంపేవారు కాదు. కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత కొన్ని ఫొటోషూట్స్ చేశాను. ఫొటోస్ చూసి కొన్ని సినిమాల్లో ఆఫర్స్ ఇస్తామంటూ సంప్రదించారు. మా కుటుంబ సభ్యులు నన్ను సినిమా ఇండస్ట్రీకి పంపేందుకు ఒప్పుకోలేదు. కొంతకాలం తర్వాత హైదరాబాద్ షిప్ట్ అయ్యాం. యాక్టింగ్ పట్ల నా ఇంట్రెస్ట్ చూసి మా ఇంట్లో వాళ్లు ఎట్టకేలకు ఒప్పుకున్నారు. అలా శ్రీనివాసరెడ్డి డైరెక్ట్ చేసిన ఫిబ్రవరి 14 నెక్టెస్ రోడ్ అనే సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టాను. ఆ తర్వాత మణిశర్మ గారు నిర్మించిన రూపాయి అనే చిత్రంలో నటించాను. ఇంతలో బాలాజీ టెలీ ఫిలింస్ వారి సీరియల్స్ లో నటించే అవకాశాలు వచ్చాయి. అలా ముంబై వెళ్లాను. ఆ తర్వాత ఇంద్ర సినిమా కోసం అడిగారు. ఆ చిత్రంలో నటించాను. అలా నా కెరీర్ కొనసాగింది.
  • పెళ్లయ్యాక మా వారితో యూఎస్ వెళ్లాను. అప్పటి నుంచి వ్యక్తిగత జీవితానికే సమయం కేటాయించాను. అక్కడ ఓంకార అనే కూచిపూడి డ్యాన్స్ స్కూల్ ప్రారంభించాను. మన నృత్యరూపకాలు రేపటి తరానికి కూడా అందాలనేది నా కోరిక. ఈ ఆశయంతోనే క్లాసికల్ డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు కూచిపూడి డ్యాన్స్ నేర్పిస్తూ వచ్చాను. అక్కడి పిల్లలకు తెలుగు తెలియదు. క్లాసికల్ డ్యాన్స్ పాటల్లోని అర్థాలను ఇంగ్లీష్ లో వివరించి చెప్పేవాళ్లం. అప్పుడు వారికి అర్థమై నేర్చుకునేవారు. మా పాప తాన్య నా దగ్గరే కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంది. మా పాప తాన్యతో తెలుగింటి సంస్కృతి పేరుతో మ్యూజిక్ వీడియో రూపొందించాం. ఈ మ్యూజిక్ వీడియోకు ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య కాన్సెప్ట్ తయారుచేసి రూపొందించారు. తెలుగింటి సంస్కృతికి మంచి రెస్పాన్స్ దక్కడం సంతోషాన్ని కలిగించింది. మా పాప తాన్యకు ఇప్పుడు 16 ఏళ్లు. తన ఏజ్ కు తగిన మంచి అవకాశం వస్తే పాప తాన్యను కూడా సినిమా ఇండస్ట్రీకి పంపేందుకు మా ఫ్యామిలీకి అభ్యంతరం లేదు.
  • నేను యాక్టింగ్ కోర్సులు నేర్చుకోలేదు. అయితే క్లాసికల్ డ్యాన్సర్ ను కాబట్టి నటిగా తెలియకుండానే పరిణితి ఏర్పడింది. నవ్వడం, ఏడ్వడం వంటి భావోద్వేగాలు ఇలా చెబితే అలా చేసేసేవాళ్లం. దానికి ప్రాక్టీస్ కూడా అవసరం లేకుండేది. ఈ ఆత్మవిశ్వాసంతోనే సినిమాలు, సీరియల్స్ చేశాను. అప్పట్లో మీడియా ప్రభావం ఇంత ఉండేది కాదు. చేస్తే సినిమాలు లేకుంటే సీరియల్స్. ఓటీటీలు లేవు. ఇప్పుడు వెబ్ సిరీస్ లు, ఓటీటీ కంటెంట్ తో ఔత్సాహిక నటీనటులకు చాలా అవకాశాలు వస్తున్నాయి. ఈ అవకాశాలు చూసే మళ్లీ టాలీవుడ్ కు రావాలి అనిపించింది. నటిగా నాకున్న ఇష్టాన్ని చూపించాలని అనుకుంటున్నాను.
  • మనకు చాలా సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ కంటే కథలో కీలకమైన కొన్ని క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి. పెళ్లాం ఊరెళితే సినిమాలో నేను చేసిన సునీల్ వైఫ్ క్యారెక్టర్ చూడండి..ఎంతో అమాయకంగా ఉంటుంది. ఇప్పటికీ ఒక ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్ అంటే ఆ పాత్ర గుర్తొస్తుంది. అలాంటి కథలో కీలకంగా ఉండి ప్రాధాన్యత గల పాత్రల్లో నటించాలని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి క్యారెక్టర్స్ ఆఫర్స్ లభిస్తే సినిమాలతో పాటు ఓటీటీ వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్ లో నటించాలని ఉంది. ఇందుకు మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుందని ఆశిస్తున్నా. నేను హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటే. ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఉంటే బెంగళూరు చెన్నై వెళ్లి వస్తుంటా.
  • ఒకప్పటితో చూస్తే మూవీ కంటెంట్ లో చాలా కొత్తదనం వచ్చింది. వెబ్ సిరీస్ లు, సినిమాలు ఇన్నోవేటివ్ గా ఉంటున్నాయి. లేడీ ఓరియెంటెడ్ మూవీస్, వెబ్ సిరీస్ లు పెరిగాయి. మహానటి లాంటి గొప్ప బయోపిక్ లు వచ్చాయి. మేము ఒకప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలు చూసి మంజు భార్గవి, భాను ప్రియలా డ్యాన్స్ నేర్చుకోవాలని ఇన్స్ పైర్ అయ్యాం. మన కళల్ని ముందు తరాలకు చేర్చగలిగాం. అలా ఇన్స్ పైర్ చేసే మూవీస్, సిరీస్ లు ఇప్పుడు కూడా రావాల్సిన అవసరం ఉంది.
Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

1 day ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago