ఇట్స్ కాంప్లికేటెడ్’ సినిమాని థియేటర్స్ లో ఆడియన్స్ చుడాలనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. బాయ్ సిద్ధు జొన్నలగడ్డ

Must Read

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ మూవీ కృష్ణ అండ్ హిస్ లీల. 2020లో  కరోనా మహమ్మారి సమయంలో OTTలో నేరుగా విడుదలైన ఈ సినిమా ఇన్స్టంట్ హిట్ సాధించింది. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లవ్ స్టొరీ పై ఒక రిఫ్రెషింగ్ టేక్. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో నటించారు. రానా దగ్గుబాటి ఈ పాపులర్ చిత్రాన్ని ప్రేమికుల రోజున థియేటర్లలో విడుదల చేయనున్నారు. డిజిటల్ లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 14న కొత్త ట్విస్ట్‌తో థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమా టైటిల్‌ను ‘ఇట్స్ కాంప్లికేటెడ్‌’గా మార్చారు. ఈ కొత్త టైటిల్, ప్రమోషన్స్  మరింత ఆసక్తిని పెంచాయి. తాజాగా మేకర్స్ క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. నాకు సిద్దు రవికాంత్ తో మరో సినిమా చేయాలని వుండేది. ఇది రిలీజ్ చేస్తేగానే మరో సినిమా చేయనని అన్నారు(నవ్వుతూ) దీనికి ఫిబ్రవరి 14 రైట్ డేట్.  ఇది రీరిలీజ్ కాదు. థియేటర్స్ లో ఫస్ట్ టైం రిలీజ్’అన్నారు.

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. సినిమాని థియేటర్స్ లో ఆడియన్స్ చుడాలనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఫిబ్రవరి 14 సినిమాకి యాప్ట్ రిలీజ్. థియేటర్స్ లో ఆడియన్స్ ఎక్సయిట్మెంట్ చూడాలని వుంది’అన్నారు

డైరెక్టర్ రవికాంత్ పెరెపు మాట్లాడుతూ.. లాక్ డౌన్ లో ఈ సినిమా థియేటర్స్ లో చూడటం కుదరలేదు. అందరితో కలసి చూస్తే మజా వస్తుంది. ఆడియన్స్ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాం.’అన్నారు

రానా గారు ఈ టైటిల్ ఐడియా ఎవరిది? టైటిల్ మార్చి రిలీజ్ చేయడం కొత్త ట్రెండ్ అనుకోవచ్చా ?

-ముందు ఒక టైటిల్ అనుకున్నాం. కానీ ఆ టైటిల్ పెట్టనివ్వలేదు. తర్వాత ‘ఇట్స్ కాంప్లికేటెడ్‌’ డైరెక్టరే పెట్టారు. ఈ సినిమా థియేటర్స్ లో అందరితో కలసి చూడడం అనేది వెరీ గుడ్ ఫీలింగ్. ఇది రీరిలీజ్ కాదు. థియేటర్స్ లో ఫస్ట్ టైం రిలీజ్.

రవికాంత్ గారు.. మార్చిన టైటిల్ గురించి చెప్పండి ?
-‘ఇట్స్ కాంప్లికేటెడ్‌’ అని కాలేజ్ డేస్ లో ఓ షార్ట్ ఫిల్మ్ తీశాను. ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న సినిమా శాటిలైట్ రావాలంటే సెన్సార్ క్లియర్ కావాలి. ఈ సినిమాకి ‘ఇట్స్ కాంప్లికేటెడ్‌’టైటిల్ యాప్ట్ అవుతుంది. ఆ రకంగా సినిమాకి ఈ టైటిల్ పెట్టడం జరిగింది. ఈ కథ అందరూ రిలేట్ చేసుకునేలా వుంటుంది.

సిద్దుగారు లైలా (విశ్వక్ సేన్)మీకు మంచి ఫ్రెండ్ కదా.. ఆయన సినిమాతో పాటు మీ సినిమా రిలీజ్ చేయడానికి కారణం ?
-మా సినిమా రీరిలీజ్, అది స్ట్రయిట్ రిలీజ్.. అసలు కంపారీజన్ లేదు.

రానా గారు.. ఈ లవ్ స్టొరీలో మీకు కనెక్ట్ అయిన పాయింట్ ?
-నాకు కొన్ని లవ్ స్టోరీస్ మాత్రమే అర్ధమౌతాయి. అందులో ఈ సినిమా ఒకటి. అందరిలో లైఫ్ లో కొన్ని జరుగుతాయి. వాటిని చాలా బ్యూటీఫుల్ గా క్యాప్చర్ చేశారు.

సిద్దు: అవుట్ అఫ్ ది బాక్స్ కథలు వుంటే రానా దగ్గరికి వస్తారు. రానా వాటిని అర్ధం చేసుకొని ముందుకు తీసుకెళతారు. ఇలాంటి కథలు చేయాలంటే కొందరు ధైర్యం చేయరు. రానా మాత్రం ఇలాంటి కథ చెప్పాలని అనుకుంటారు. ఈ కథ రానాకి చెబితే చాలా స్ట్రాంగ్ గా ఫీలయ్యారు. అక్కడే రానాకి ఈ సినిమా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాని ముందు థియేటర్స్ లో రిలీజ్ చేయాలనే అనుకున్నాం. నిజానికి థియేటర్స్ లో రిలీజ్ చేసుంటే సిక్స్ టైమ్స్ ఎక్కువ వచ్చేది.  

రానాగారు ఈ సినిమాని ఇప్పుడే రిలీజ్ చేయడానికి కారణం ?
-ఈ సినిమా గురించి సోషల్ మీడియా ఎప్పుడూ రిక్వెస్ట్ లు వచ్చేవి. ఒకరోజు సిద్దు దీని గురించి చెప్పారు. అలా క్షణాల్లో జరిగింది. వాలంటైన్ డే ఈ సినిమా రిలీజ్ కి పెర్ఫెక్ట్ టైం.

సిద్దు గారు.. ఈసినిమా థియేటర్స్ లో ఆడియన్స్ తో కలసి చూస్తారా ?
-ఈ సినిమాని థియేటర్స్ లో ఆడియన్స్ చుడాలనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. రానాకు చెబితే ఫెబ్రవరి 14 ఈ సినిమాని రిలీజ్‌ చేయడానికి గ్రేట్ డే గా భావించారు. థియేటర్స్ లో ఆడియన్స్ ఎక్సయిట్మెంట్ చూడాలని వుంది.

రవికాంత్ గారు ఒకే సమయంలో ఇద్దరిని ప్రేమించడం సాధ్యమేనా ? మీ ఒపినియన్ ఏమిటి ?
 -ఇది చాలా పర్శనల్ థింగ్. నా ఒపినియన్ చెప్పాలంటే సినిమాలో ఏముందో అదే(నవ్వుతూ)

రానా గారు మీరు కథల ఎంపిక ఎలా వుంటుంది?
-ఎందుకు ఈ కథ చెబుతున్నామనేది ముందు చూస్తాను. తర్వాత కథ ఎంత కొత్తగా వుందని చూస్తాను. సినిమా అనేది వెరైటీ. అలాంటి డిఫరెంట్ కథలు ఆడియన్స్ కి చూపించడానికి ఇష్టపడతాను.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News