‘బేబీ’ హిట్ అవుతుందని మొదటి నుంచీ నమ్మాను.. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్

Must Read

మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్‌కేఎన్ నిర్మించిన చిత్రం బేబీ. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించారు. ఈ మూవీ జూలై 14న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ మూవీ సక్సెస్ సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలేంటంటే..

హైద్రాబాద్‌లోనే ఉండేవాడిని. కొన్ని రోజులకు కాకినాడకు వెళ్లాను. అక్కడ ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తుండేవాడిని. నా మ్యూజిక్ అంటే సాయి రాజేష్ గారికి ఇష్టం. నాతో పని చేస్తారా? అని ఓ సారి అడిగారు. ఓకే అన్నాను. కానీ నాతో పని చేయడం కష్టంగా ఉంటుంది.. మీకు ఓకేనా అని సాయి రాజేష్ గారు అడిగారు. పర్లేదు సర్ అని అన్నాను. ఈ కథను కూడా ఆన్ లైన్‌లోనే వినిపించారు. అలా మా జర్నీ మొదలైంది.

కష్టంగా ఉండే పాటలు ముందు చేద్దామని నేను అన్నాను. ప్రేమిస్తున్నా పాటను ముందు కంప్లీట్ చేశాం. ఆ పాట సాయి రాజేష్ గారికి బాగా నచ్చింది. ఆ పాటను రెండు మూడు రోజుల్లోనే పూర్తి చేశాను. మెలోడీ పాటను చేయగలిగితే.. ఏ పాటనైనా కంపోజ్ చేయగలమని నా నమ్మకం. మాస్ పాటలోనైనా మెలోడీ ఉంటేనే ఎక్కువ రోజులు గుర్తుంటుందని నా అభిప్రాయం.

నా మ్యూజిక్‌కు అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. విజయ్ దేవరకొండ గారు చెప్పిన మాటలు, నాని గారి మెసెజ్ నాకు స్పెషల్. ప్రతీ సినిమాకు నా బెస్ట్ ఇచ్చాను. కానీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో నా పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

సాంగ్స్ కంపోజ్‌కు ఎక్కువ రోజులు పట్టలేదు. ఓ రెండు మేఘాలిలా అనే పాటను కూడా చాలా ఫాస్ట్‌గానే కంప్లీట్ చేశాం. ప్రతీ పాటలో మెలోడీ ఉంటుంది. అందుకే బ్యాక్ గ్రౌండ్‌లో కూడా ఆ పాటల ట్యూన్‌నే వాడాం. సాయి రాజేష్ గారితో పని చేయడం ఇబ్బందిగా అనిపించలేదు. మ్యూజిక్, ఆర్ఆర్ విషయంలో మా ఇద్దరిలో ఎవరు మాట్లాడేదాంట్లో సెన్స్ ఉంటే ఆ టైంకి వాళ్ల మాట వినేవాళ్లం.

సాంగ్స్ రిలీజ్ అయినప్పుడే కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక చూద్దామని అన్నాను. ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ కంపెనీల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. అల్లు అరవింద్ లాంటి వాళ్లు కూడా అడుగుతున్నారు (నవ్వుతూ). మీరు నన్ను అడగటం ఏంటి.. నేనే మీ చుట్టూ తిరగాలి కదా? అని అన్నాను (మళ్లీ నవ్వుతూ)

నాకు చదువు ఇంట్రెస్ట్ లేదు.. మ్యూజిక్ నేర్చుకుంటాను అని ఇంట్లో చెబితే కాస్త భయపడ్డారు. కానీ బాగా ఎంకరేజ్ చేశారు. నాకు సంగీతంలో ఏ ఆర్ రెహ్మాన్, ఇళయరాజా, కీరవాణి గారు స్పూర్తి. నేను ఎవ్వరి దగ్గరా అసిస్టెంట్‌గా పని చేయలేదు.

కమెడియన్ సినిమాలకు మ్యూజిక్ చేశావంటూ నా మీద ముద్ర వేశారు.. ఆఫర్లు సరిగ్గా రాలేదు. ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. అలా ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తుండగా.. సాయి రాజేష్ గారు పిలిచారు. బింబిసార డైరెక్టర్ వశిష్ట నాకు ఫ్రెండ్. వశిష్టతో సాయి రాజేష్ పరిచయం అయ్యారు. సాయి రాజేష్ గారితో చేసిన బేబీ సినిమాతో బ్రేక్ వచ్చింది.

ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకం ఉంది. అందుకే రెండేళ్లుగా ఏ ప్రాజెక్ట్ కూడా కమిట్ అవ్వలేదు. సాయి రాజేష్, ఎస్ కే ఎన్, ఆనంద్ తరువాత ఈ సినిమా మీద నాకే ఎక్కువ నమ్మకం ఉండేది.

ఈ సినిమాకు ఫస్ట్ హీరో నేనే అని డైరెక్టర్ గారు, నిర్మాత, ఆనంద్, వైష్ణవి ఇలా అందరూ అన్నారు. కానీ నేను కాదు. సాయి రాజేష్ గారు అడగకపోతే నేను ఆ మ్యూజిక్ ఇచ్చే వాడ్ని కాదేమో. దీనికి కారణం మాత్రం ఆయనే.

నేను ఇంకా ఏ సినిమాను కమిట్ అవ్వలేదు. స్క్రిప్టులు వింటున్నాను. నాకు నాని గారితో పని చేయాలని ఉంది. ఆయన ప్రొడక్షన్‌లో మీట్ క్యూట్‌కి పని చేశాను. ఆయనకు కూడా నా మ్యూజిక్ అంటే ఇష్టం. బేబీ సినిమాను చూశాక కలుస్తాను అని నాని గారు అన్నారు. సప్తగిరి ఎల్ ఎల్ బి ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ గారు కూడా నన్ను మెచ్చుకున్నారు. ఆయనతో కలిసి పని చేయాలని ఉంది.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News