‘హుషార్‌ పిట్టలు’ చిత్రం అందరి హృదయాలకు హత్తుకుంటుంది: బెక్కెం వేణుగోపాల్‌

Must Read

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘హుషారు పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్‌ సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని థియేట్రికల్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. కాగా తాజా ఈ చిత్రం నుంచి టోంగా టోంగా అనే హుషారు గీతంతో పాటు శుక్రవారం నాడు సక్కని గడియ పాటలను విడుదలచేశారు. వీటికి అనూహ్య స్పందన వచ్చింది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను ఆగస్టు 10న విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

దర్శకుడు బిక్షు మాట్లాడుతూ ” మా సినిమా ఆగస్టు 15న విడుదల చేస్తున్నాం కానీ. బుక్‌ మై షోలో ఇప్పటి నుంచే టిక్కెట్స్‌ సేల్‌ చేస్తున్నాం. బుక్‌మై షో బుకింగ్‌ యాప్‌లో నా ఫోటో చూసుకోవాలని ఎప్పటి నుంచో కలలు కన్నాను. ఈ రోజు ఇది నెరవేరింది. ఈ సినిమా చూసి అందరూ మరొకరికి రికమెండ్‌ చేస్తారు. దర్శకుడు కావాలన్న నా డ్రీమ్‌ నెరవేరింది. ఈ సినిమా ట్రైలర్‌ ఈ నెల 10న విడుదల చేస్తున్నాం. ట్రైలర్‌ చూసిన తరువాత సినిమా మీద అందరి ఓపినియన్‌ మారిపోతుంది. తప్పకుండా తెలుగు సినిమా ట్రెండ్‌సెట్టర్‌ సినిమాల్లో ‘హుషార్‌ పిట్టలు’ తప్పకుండా ఉంటుంది’ అన్నారు.

బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడుతూ ” ఈ సినిమా నచ్చి సపోర్ట్‌ చేస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా హిట్‌ కాబోతుందనే ఆత్మవిశ్వాసం అందరిలో కనిపిస్తుంది. సినిమా చూడగానే నాకు కూడా ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది. నిర్మాత సురేష్‌ బాబు గారు చూసి నచ్చి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. చాలా పెద్ద సినిమాల మధ్యలో వస్తుంది. సినిమా మీద నమ్మకంతోనే విడుదల చేస్తున్నారు. ఈ సినిమా పతాక సన్నివేశాలు అందరి హృదయాలను హత్తుకుంటాయి. అన్ని వర్గాలకు నచ్చే సినిమా ఇది. ఇది కేవలం యూత్‌కే కాదు. ఈ మేసేజ్‌ ఉన్న కమర్షియల్‌ సినిమా. దర్శకుడు చాలా ఇంటలిజెంట్‌గా సినిమాను హ్యాండిల్‌ చేశాడు. ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా చిత్రాన్ని తెరకెక్కించాడు. మొదటి సన్నివేశం నుండి చివరి సన్నివేశం వరకు సినిమా అందరికి ఎంతో నచ్చుతుంది’ అన్నారు.

సంగీత దర్శకుడు చరణ్‌ అర్జున్‌ మాట్లాడుతూ ” అందరూ మా చరన్‌ అర్జున్‌లా ఫీల్‌ అయ్యి నా సంగీతాన్ని ఆదరిస్తున్నారు. టాలెంట్‌ ఉండి కూడా అందరూ నేను అనుకున్న స్థాయిలో ఎదగలేదు అంటుంటారు. ఇప్పుడు ఈ హుషారు పిట్టలు లాంటి కమర్షియల్‌ సినిమా నాకు ఆ లోటును తీరుస్తుంది. నాకు కమర్షియల్‌ సక్సెస్‌ వస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమా విజయంతో నాకు సినీ ఇండస్ట్రీలో కూడా గుర్తింపు వస్తుందని అనుకుంటున్నాను. నాకు సంగీతమంటే ప్రాణం. ఏదో ఒకరోజు నాకు సరైన గుర్తింపు, ఎదుగుదల వస్తుందని నమ్ముతున్నాను. నా పాటలే నన్ను నిలబెట్టాయి. నా పాట ద్వారా నాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాందించుకున్నాను. సినిమా పాట హిట్‌ అయితే ఆనందంగా ఉంది. నాకు సీఏంలు తెలిసిన ఏ రోజు రికమండేషన్‌ చేయించుకోలేదు. హిట్‌ సినిమా లేకపోతే ఇండస్ట్రీ గుర్తించదు. ఈ సినిమాతో ఆ గుర్తింపు వస్తుంది. నన్ను నమ్మి ఈ సినిమా చూడండి. మిమ్ములను ఎవ్వరినీ డిజప్పాయింట్‌ చేయదు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు ఎంతో అద్భుతమైన విషయాలు చెప్పాడు. ఇది రీసౌండ్‌ చేసే చిన్న సినిమా.ఈ సినిమా చూస్తున్నప్పుడు సెకండాఫ్‌లో నాలుగు సార్లు ఏడ్చాను.ఈ సినిమా మీకు నచ్చకపోతే ఎప్పుడూ కూడా మరో సినిమా చూడమని అడగను. ఈ సినిమా తరువాత నా కెరీర్‌ కూడా మారబోతుంది. నాకు ఈ సినిమా పాటలు విని చాలా మంది ఫోన్‌ చేసి ప్రశంసించారు. తప్పకుండా ఈ సినిమా చూసి మా టీమ్‌ అందర్ని గెలిపించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

నిర్మాత వెంకట్‌ యాదవ్‌ మాట్లాడుతూ ” మేము విడుదల చేసిన టీజర్‌ అందర్ని టీజ్‌ చేసింది. ప్రశంసలొచ్చాయి.. విమర్శలు వచ్చాయి. వైరల్‌ అయ్యి హిట్ అయ్యింది. ఇటీవల విడుదలైన పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి. టొంగ టొంగ సాంగ్‌, శుక్రవారం సక్కని గడియ పాటలకు వచ్చిన స్పందన అనూహ్యం. ఇక ఆగస్టు 10న ట్రైలర్‌ విడుదల చేస్తున్నాం. టీజర్‌కు మించి ట్రైలర్‌ ఉండబోతుంది. సినిమా ద్వారా మేము ఏం చెప్పబోతున్నామనేది ట్రైలర్‌లో చూపిస్తాం. ఈ సినిమా మా టీమ్‌ అందరి ఎమోషన్‌. మీరు ఈ సినిమా చూస్తే మీ డబ్బులకు తగిన ఫలితం ఉందని సంతృప్తి చెందుతారు’ అన్నారు.

హీరో అన్షు మాట్లాడుతూ ” అందరూ చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. ఈ సినిమా విషయంలో మాకు ఇప్పటి వరకు అంతా పాజిటివ్‌ వైబ్స్‌ ఉన్నాయి. పాటలు, టీజర్‌కు కొన్ని ట్రోల్స్‌ వచ్చిన ఫరవలేదు. సినిమా చూసిన తరువాత అందరి ఓపినియన్‌ మారిపోతుంది. ఆగస్టు 15న విడుదల కాబోతున్న మా సినిమాను అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను’ అన్నారు.

హీరోయిన్‌ వాసవి గణేషన్ మాట్లాడుతూ ” సినిమాకు ఇంత లవ్‌ అందిస్తున్న అందరికి కృతజ్ఞతలు. అందరి బ్లెసింగ్స్‌తో బుక్‌మై షోలో టిక్కెట్ష్‌ ఓపెన్‌ చేశాం. హుషార్‌ పిట్టలు కొన్ని చోట్ల కేకలు పట్టిస్తుంది. నవ్విస్తుంది. కొన్ని చోట్ల ఎంజాయ్‌ మెంట్ ఫీల్‌ వస్తది. థియేటర్‌ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు మీ మనసు కదిలిస్తుంది. ఇటీవల నేను ప్రీమియర్‌ షో చూశాను. తప్పకుండా సినిమా అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌కు సినిమా రీచ్‌ అవుతుంది. సినిమా అందరికి నచ్చుతంది. అందరి హృదయాలకు హత్తుకుంటుంది’ అన్నారు.

ఈ కార్యక్రమంలో గీత రచయిత చిరంజీన్, డీవోపీ రుద్రసాయి, నటులు గోవర్థన్‌, భాను, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Latest News

డార్క్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ “మిషన్ పాజిబుల్” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

-త్వరలో పాన్ ఇండియా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ నటుడు, దర్శకుడు నవీన్ హిదయత్ రూపొందించిన తమిళ సూపర్ హిట్ డార్క్ కామెడీ యాక్షన్...

More News