డార్క్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ “మిషన్ పాజిబుల్” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Must Read

త్వరలో పాన్ ఇండియా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ

నటుడు, దర్శకుడు నవీన్ హిదయత్ రూపొందించిన తమిళ సూపర్ హిట్ డార్క్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ “మూదర్ కూడమ్”. 2013లో రిలీజైన ఈ సినిమాకు సీక్వెల్ గా మూదర్ కూడమ్ 2 రూపొందుతోంది. ఈ సినిమా “మిషన్ పాజిబుల్” పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నవీన్ హిదయత్, ఒవియా, సెన్రయాన్, రాజాజీ, కుబేరన్, జయప్రకాష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నవీన్ హిదయత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గ్రాండెల్ పిక్చర్స్ బ్యానర్ పై సంకిత్ బోరా, కమల్ బోరా నిర్మిస్తున్నారు.

ఈ రోజు మేకర్స్ “మిషన్ పాజిబుల్” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఓ నగరంలో డైనోసార్స్ భీభత్సం సృష్టిస్తుండటం, వాటిని తరిమేందుకు ఆర్మీ హెలికాప్టర్స్ రంగంలోకి దిగడం, శాంటాక్లాజ్ డ్రెస్ లో ఉన్న ఒక బొమ్మను ఫాలో అవుతూ మూవీలోని ప్రధాన పాత్రధారులు పరుగెత్తడాన్ని చూపిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఓ భారీ హాలీవుడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తలపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే “మిషన్ పాజిబుల్” మూవీ సినీ ప్రియుల్లో ఆసక్తి కలిగిస్తోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు.

నటీనటులు – నవీన్ హిదయత్, ఒవియా, సెన్రయాన్, రాజాజీ, కుబేరన్, జయప్రకాష్, తదితరులు

టెక్నీషియన్స్

వీఎఫ్ఎక్స్, యానిమేషన్ సూపర్ వైజర్ – కె.ఎ. బట్చా
ఎడిటర్ – అతియప్పన్ శివ
డీవోపీ – సూరజ్ నల్లుసామి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – నటరాజన్ శంకరన్
మ్యూజిక్ (సాంగ్స్ ) – అమ్రిషన్, నటరాజన్ శంకరన్
ప్రొడ్యూసర్స్ – సంకిత్ బోరా, కమల్ బోరా
స్క్రిప్ట్, డైరెక్షన్ – నవీన్ హిదయత్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)

Latest News

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే సంగీతం'. ఈ సిరీస్‌ ట్రైలర్‌ను...

More News