‘ప్రాజెక్ట్ K’ చిత్రంలో చేరిన ఉలగనాయగన్ కమల్ హాసన్

Must Read

ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ K’ అనౌన్స్ చేసినప్పటి నుంచి హెడ్ లైన్స్ లో నిలుస్తుంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు సినిమా బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఉలగనాయగన్ కమల్ హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారని మేకర్స్ అనౌన్స్ చేశారు. కమల్ హాసన్ ‘ప్రాజెక్ట్ కె’లో చేరడంతో ఇండియన్ సినిమాలో గ్రేటెస్ట్ స్టార్ కాస్ట్ వున్న చిత్రంగా ‘ప్రాజెక్ట్ కె’ నిలిచింది.

దీనిపై ఉలగనాయగన్ కమల్ హాసన్ మాట్లాడుతూ.. “50 సంవత్సరాల క్రితం నేను డ్యాన్స్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు నిర్మాణ రంగంలో అశ్వినీదత్ అనే పేరు పెద్దగా వినిపించింది. 50 ఏళ్ల తర్వాత మేమిద్దరం కలిసి వస్తున్నాం. ఈ చిత్రానికి నెక్స్ట్ జనరేష్  బ్రిలియంట్ డైరెక్టర్  దర్శకత్వం వహిస్తున్నారు. నా సహనటులు మిస్టర్ ప్రభాస్, దీపిక కూడా ఆ తరం వారే. నేను ఇంతకు ముందు అమిత్ జీ తో కలిసి పనిచేశాను. అయినా ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది. అమిత్ జీ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూనే ఉన్నారు.

నేను కూడా ఆ ప్రక్రియను అనుకరిస్తున్నాను. నేను ప్రాజెక్ట్ K కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ప్రేక్షకులు నన్ను ఏ స్థానంలో ఉంచినా, నా మొదట స్వభావం నేను సినిమా అభిమానిని. నా పరిశ్రమలో ఏ కొత్త ప్రయత్నమైనా ఆ స్వభావం మెచ్చుకుంటూనే ఉంటుంది. ప్రాజెక్ట్ K కి నాదే మొదటి ప్రశంస. మా దర్శకుడు నాగ్ అశ్విన్ విజన్‌ తో మన దేశం, సినిమా ప్రపంచం అంతా ప్రశంసలు మార్మ్రోగుతాయని నేను ఖచ్చితంగా చెబుతున్నాను’’ అన్నారు

ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, “నా మనసులోఎప్పటికీ నిలిచిపోయే క్షణం. #ప్రాజెక్ట్ కె లో లెజండరీ కమల్ హసన్ సర్‌ తో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఇంత గొప్ప వ్యక్తి తో కలిసి పనిచేయడం, నేర్చుకునే అవకాశం రావడం కల నెరవేరిన క్షణం’ అన్నారు.

కమల్ హాసన్ ఈ చిత్రంలో చేరడం గురించి నిర్మాత అశ్వనీదత్  మాట్లాడుతూ.. “నా కెరీర్‌లో మిస్టర్ కమల్ హాసన్‌ తో కలిసి పనిచేయడం ఎప్పటినుంచో ఉన్న కల.  ‘ప్రాజెక్ట్ కె’తో ఇప్పుడు కల సాకారమైంది. మిస్టర్ కమల్ హాసన్, మిస్టర్ అమితాబ్ బచ్చన్ .. ఇద్దరు దిగ్గజ నటులతో కలిసి పని చేయడం ఏ నిర్మాతకైనా గొప్ప క్షణం. నా కెరీర్‌లో 50వ సంవత్సరంలో ఈ అవకాశం రావడం ఇది నిజంగా నాకు వరం’’ అని అన్నారు.

దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఉలగనాయగన్ కమల్ హాసన్ చిత్రంలో చేరడం పట్ల తన ఆనందం పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ “ఇన్ని విలక్షణమైన పాత్రలు చేసిన కమల్‌ సర్‌ కలసి పని చేయడం గౌరవంగా వుంది. ఆయన ఈ చిత్రంలోకి వచ్చి మా ప్రపంచాన్ని పూర్తి చేయడానికి అంగీకరించినందుకు మేమంతా చాలా సంతోషిస్తున్నాము’’అన్నారు.

‘ప్రాజెక్ట్ K’ వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న మల్టీ లింగ్వల్ సైన్స్ ఫిక్షన్. 50 మెమరబుల్స్ ఇయర్స్ జరుపుకుంటున్న వైజయంతీ మూవీస్ ఈ గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్‌ ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.  

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News