‘హనీ’ తప్పకుండా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా. ప్రేక్షకులకు చాలా డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నవీన్ చంద్ర

నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ మూవీ హనీ. OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది. సైకాలజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హారర్ అంశాలతో రూపొందిన ‘హనీ’ ఫిబ్రవరి 6న థియేటర్ లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ట్రైలర్ ని లాంచ్ చేశారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ట్రైలర్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఫిలిం మేకింగ్ ప్రాసెస్ నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇది మౌత్ టాక్ తో నిలబడే సినిమా. మాకు ఉన్న బడ్జెట్లో థియేటర్స్ కి తీసుకొచ్చి ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని నేను ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఫిబ్రవరి 6న దయచేసి ఒకసారి థియేటర్ కి రండి. ఇది థియేటర్ కి చాలా బాగుంటుంది. దివి చాలా అద్భుతమైన నటి. తను తప్పకుండా పెద్ద స్టార్ అవుతుంది. దివ్య కూడా చాలా చక్కగా నటించింది. ఈ సినిమా వెంటాడుతూనే ఉంటుంది. ఇది ఆలోచన రేకెత్తించే సినిమా. డివోపి మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. ఇందులో ఉన్న పాప కూడా చాలా చక్కగా నటించింది. మట్కా సినిమా సమయంలో కరుణ కుమార్ గారితో చాలా దగ్గర ఆయను. ఈ కథకు ఆయన నన్ను ఎంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను. ఈ సమాజంలో ఆశ కోసం ప్రజలు ఏవేవో చేస్తున్నారు. ఇందులో ఒక డార్క్ సొసైటీని చూపించాము. ఈ కథ విన్న తర్వాత నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడే ఇలాంటి వాటికి మనం విక్టిమ్ అవుతాం. ఆనంద్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసిన కరుణ కుమార్ గారికి థాంక్యూ సో మచ్. మీరు ఈ సినిమాని ఆదరిస్తే ఇలాంటి కథలు మరిన్ని వస్తాయి. ఈ సినిమా చేసిన్నప్పుడు చాలా మ్యాడ్ నెస్ లో ఉన్నాను. చాలా ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ ఇది. ఈ సినిమా షూటింగ్లో ఒక సంఘటన జరిగింది. ఈ క్యారెక్టర్ ప్రభావం వల్ల ఒక వ్యక్తితో నేను దురుసుగా ప్రవర్తించాను. అయితే అది నేను కాదు. ఆ క్యారెక్టర్ అలా ప్రవర్తించింది. తప్పకుండా ఫిబ్రవరి 6న ఈ సినిమాని అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నా ప్రతి ప్రయత్నాన్ని ఆదరిస్తున్న మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈసారి కూడా ఒక కొత్త ప్రయత్నం చేశాను. సాహిత్యం కోసం చీకటి అనే కథ రాశాను. దాన్ని సినిమా తీద్దామని మా నిర్మాతలు వచ్చారు. మదనపల్లి, పాతబస్తీ, ఒకే ఇంట్లో కొందరు ఉరి వేసుకోవడం ఇలాంటి ఘటనలు చూస్తుంటాం. హనీ సినిమాలో పిల్లి మాయ అనే ఒక వస్తువుని శోధించి సాధించే ఒక వ్యక్తి జీవితం చూపించాం. మెదడు అంతా చీకటి ఉన్నా మనసుల మధ్య జరిగిన ఒక కథ. నిజ జీవిత సంఘటన నుంచి స్ఫూర్తిగా తీసుకుని సినిమా చేయడం జరిగింది. మనిషి మెదడు కంటే పెద్ద దయ్యం లేదనేది ఈ సినిమా యొక్క సారాంశం. ఇదొక ఫ్యామిలీ స్టోరీ. కొత్త కథలు చేయడానికి ఎప్పుడూ ముందుండే నవీన్ చంద్ర గారు ఈ సినిమా కథ చెప్పిన వెంటనే ఒప్పుకున్నారు. ఇందులో ఎప్పుడు చూడని నవీన్ చంద్ర గారిని చూడబోతున్నారు. అలాగే రాజా రవీందర్ గారి పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుంది. అలాగే దివి, దివ్య అందరు కూడా ఒకరికి మించి ఒకరు చేశారు. మా టెక్నికల్ టీం కూడా చాలా సపోర్ట్ చేసింది ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఇలాంటి కాన్సెప్టు ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో రాలేదు. అది సైకలాజికల్ హారర్ ఈ సినిమా మిమ్మల్ని వెంటాడుతుంది. ఇది అందరికీ చెప్పాల్సిన కథ. సినిమా ఒకరి జీవితాన్ని మార్చలేదు, అలాగే సందేశాన్ని కూడా ఇవ్వలేదు. కానీ ఒక తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని టార్చి వేసి చూపించగలదు. నేను కూడా అదే చేశానని నమ్ముతున్నాను. మా డైరెక్షన్ టీమ్ అందరికీ థాంక్యు. మా నిర్మాతలు ఈ సినిమాకి ఎంత కావాలో అంత బడ్జెట్ పట్టడం జరిగింది. చాలా మంచి ఇంటర్నేషనల్ క్వాలిటీతో చేశాం. ఈ సినిమాకి ప్రేక్షకులు ఊపిరి పోయాలని కోరుకుంటున్నాను.

రాజా రవీంద్ర మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు నచ్చింది కానీ ఎలా తీస్తారో అని అనిపించింది చెప్పిందానికంటే చాలా అద్భుతంగా తీశారు. అలాగే నాకు ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ ఇచ్చారు. గుర్తుండిపోయే క్యారెక్టర్. టెక్నికల్ గా ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. సినిమా చూసి షాక్ తిన్నాను. చెప్పిందానికంటే అద్భుతంగా తీశారు. ఇది రెగ్యులర్ కథ కాదు చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇందులో నవీన్ గారిని చూస్తే భయమేస్తుంది. చాలా కొత్త క్యారెక్టర్. ఈ సినిమా చూసిన తర్వాత కొందరైనా మూఢనమ్మకాలనుంచి బయట పడతారని ఆశిస్తున్నాను. ఆర్టిస్ట్ గా చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను.

హీరోయిన్ దివి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. కరుణ కుమార్ తో గారితో పని చేయాలని నాకు ఎప్పటినుంచో ఉండేది. పలాస సినిమా సమయంలో కలిశాను. కానీ కుదరలేదు. ఆయన నుంచి కాల్ వచ్చిన వెంటనే వెళ్లాను. ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సైటెడ్ గా ఫీలయ్యాను. ఇందులో నవీన్ గారు దివ్య రాజా రవీంద్ర గారు ఇలా అందరూ ఒకరికి మించి ఒకరు పెర్ఫార్మన్స్ ఇచ్చే నటుల మధ్య నటించడం చాలా ఆనందంగా వుంది. ఇది మీ అందరిని వెంటాడే సినిమా అవుతుంది. అందరూ ఫిబ్రవరి 6న థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలని కోరుకుంటున్నాను.

హీరోయిన్ దివ్య పిళ్లై మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. డైరెక్టర్ గారు ఈ కథ చెప్పినప్పుడు భయపడ్డాను. చాలా కొత్త కథ ఇది. నాకు ఈ అవకాశం ఇచ్చిన కరుణ కుమార్ గారికి రవి గారికి థాంక్యూ. నవీన్ తో మరోసారి కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. దివి ఈ సినిమాతో నాకు చాలా మంచి స్నేహితురాలు అయింది. ఇందులో నటించిన చిన్న పాప అద్భుతంగా నటించింది. తప్పకుండా ఈ సినిమా అందరికీ ఒక కొత్త అనుభూతిస్తుంది. ఈ వేడుకలో టీం అందరూ పాల్గొన్నారు.

తారాగణం: నవీన్ చంద్ర, దివ్య పిల్లై, దివి, రాజా రవీందర్, జయన్ని, జయత్రి

రచన, దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి
బ్యానర్:OVA ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: అజయ్ అరసాద
DOP: నగేష్ బన్నెల్
ఎడిటింగ్: మర్తాండ్ కె వెంకటేశ్
పీఆర్వో: తేజస్వీ సజ్జా

TFJA

Recent Posts

సినీ ప్రముఖుల చేతుల మీదుగా‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ టీజర్, ట్రైలర్ లాంచ్

తెలుగు సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…

1 day ago

‘సింగ్ గీతం’ విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న రిలీజ్

సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…

1 day ago

అంగరంగ వైభవంగ మహేంద్రగిరి వారాహి టీజర్ విడుదల కార్యక్రమం !!!

రాజశ్యామల ‌ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…

2 days ago

“టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026” జ్యూరీ ఛైర్ పర్సన్ గా నటి ఇంద్రజ

"టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026" జ్యూరీ ఛైర్ పర్సన్ గా నటి ఇంద్రజ వ్యవహరిస్తారు: టీఎఫ్…

2 days ago

మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్ ‘ఇరుముడి’ ఆగస్టు 21న వరల్డ్ వైడ్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' నిర్మిస్తున్న 'ఇరుముడి' చిత్రం కోసం దర్శకుడు…

3 days ago

‘సింగ్ గీతం’ నేను నిర్మించి ఉంటే బాగుండేదనిపించే చిత్రం : గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ 'సింగ్ గీతం' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక…

3 days ago