హీరో ఈశ్వర్ ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’ ట్రైల‌ర్ లాంచ్ వేడుక‌

Must Read

‘కొత్తగా మా ప్రయాణం’ చిత్రంలో హీరోగా నటించిన ఈశ్వర్‌, నైనా సర్వర్‌ జంటగా నటించిన మూవీ ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు, నిర్మించిన ఈ చిత్రానికి రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించాడు. ఈశ్వర్, నైనా సర్వర్, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైల‌ర్ విడుదల కార్య‌క్ర‌మం తాజాగా హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్‌లో ఘనంగా జ‌రిగింది.

ఈ సంద‌ర్బంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ… ‘‘ఈ సినిమాకు కథ నేనే రాశాను. సూర్యాపేట ప‌రిస‌రాల్లో జరిగే కథ. గవర్నమెంట్ నుంచి ఉచితాలు తీసుకోవడం వల్ల ముఖ్యంగా మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్రజలు ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటున్నారో తెలిపే స‌బ్జెక్టు ఇది. మంచి కథ ఉంటే తెలుగు ప్రేక్షకులు అదరిస్తారు, హిట్టు చేస్తారని ఎన్నో సార్లు రుజువైంది. అందుకే ఈ సినిమా చేశాం. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా సహజంగానే ఉంటాయి. 4 పాటలు ఉన్నాయి. కథను డైరెక్టర్ రాజేశ్‌ గారు చాలా బాగా తెరకేక్కించారు. మీరందరూ అదరిస్తారని ఆశిస్తున్నాను.’’ అని అన్నారు.

హీరోయిన్ నైనా మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో నేను జ్యోతి పాత్ర‌లో న‌టించాను. యూత్‌కు బాగా న‌చ్చే స‌బ్జెక్టు ఇది. నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు. ప్ర‌తి ఒక్క‌రు ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’ మూవీని ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను.’’ అని అన్నారు.

ప్రోడ్యూసర్ అనిల్ కుమార్ కాట్రగడ్డ మాట్లాడుతూ… మా హీరో ఈశ్వర్ గారు నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. మా హీరో కథకి పూర్తి న్యాయం చేశాడు. కన్నడ, మలయాళం చిత్రాలలో హీరోయిన్ గా నటించిన నైనా సర్వర్ కి ఇది తెలుగులో మొదటి సినిమా. అయినప్పటికీ చాలా చక్కగా నటించింది. గబ్బర్ సింగ్ ఫేమ్ అభిమన్యు సింగ్ విలన్ రోల్ ఈ సినిమాకు కీలకం. ఇంకా చమ్మక్ చంద్ర, భాషా, లక్ష్మణ్ సంజయ్ (బలగం ఫేమ్) హరీష్ చాలా మంది ఈ సినిమాలో చాలా చక్కగా నటించారు. రోషన్ సాలూరి, గౌర హరి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో ఉన్న మూడు పాటలు, ఒక ఐటమ్ సాంగ్ ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తాయి. నిర్మాతలు ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను త్వరలో రిలీజ్ చేస్తాము’ అని అన్నారు.

సాంకేతిక నిపుణులు:
బ్యానర్ : యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్
టైటిల్ : సూర్యాపేట జంక్షన్
నిర్మాతలు : అనిల్ కుమార్ కాట్రగడ్డ , ఎన్.ఎస్ రావు,
డైరెక్టర్ : నాదెండ్ల రాజేష్
స్టోరీ : ఈశ్వర్
మ్యూజిక్ : రోషన్ సాలూరి, గౌర హరి
డి.ఓ.పి : అరుణ్ ప్రసాద్
ఎడిటర్ : ఎం.ఆర్.వర్మ
కో డైరెక్టర్ : శ్రీనివాస్ కోర
లిరిక్స్ : ఎ.రహమాన్
పోస్టర్ డిజైనర్ ధనియేలె
రైటర్స్ : సత్య, రాజేంద్ర భరద్వాజ్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఎ పాండు
పీఆర్ఓ: కడలి రాంబాబు, దయ్యాల అశోక్

Latest News

Dhanush Directorial ‘Jabilamma Neeku Antha Kopama’ Set to Release on Feb 21

After the success of blockbusters like Pa Pandi and Raayan, Dhanush is all set to impress again as a...

More News