ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ముందు “హాంట్” మూవీ టీం నిరసన

Must Read

హాంట్ సినిమా వివాదం రోజు రోజు కి పెరుగుతుంది. హంట్ మూవీ టైటిల్ మాది అంటూ ఇటు శ్రీ క్రియేషన్స్, అటు భవ్య క్రియేషన్స్ వాదనలు వినిపిస్తున్నప్పటి , భవ్య క్రియేషన్స్ వారికి టైటిల్ ఆమోదం చేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తపరుస్తూ హాంట్ సినిమా టీం వినతి పత్రాన్ని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రెజరర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ కి అందచేశారు.హీరో డైరెక్టర్ నిక్షిత్ మాట్లాడుతూ “మాకు న్యాయం జరగాలి అని లీగల్ గా నోటీసులు సైతం పంపించాము, కౌన్సిల్ నుంచి, భవ్య క్రియేషన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఈ రోజు మేము నిరసన వ్యక్తం చేయాల్సి వచ్చింది,

మా టైటిల్ మాకు వచ్చే వరకు న్యాయ పరమైన పోరాటం చేస్తాం, నిరాహార దీక్ష కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని తెలిపారు. లాయర్ సురేష్ బాబు మాట్లాడుతూ “పరిష్కారం కోసం లీగల్ నోటీసులు సైతం పంపిన ఎలాంటి న్యాయం జరగడం లేదు,ఇలాంటి నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి” అని తెలిపారు. తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ “తప్పు జరుగుతున్నప్పుడు చూస్తూ ఉండడం కూడా పెద్ద తప్పు. ఒకే టైటిల్ ఇద్దరికి ఇవ్వడం వలన ఈ సమస్య మరింత పెరిగింది.

కావున ఈ సమస్యకు త్వరగా పరిష్కారం దొరకలని ట్రెజరర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారిని కోరుతున్నాం” అని తెలిపారు. నిర్మాతల మండలి ట్రెజరర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ “వినతిపత్రం చూసాను, ఏ నిర్మాతకు అన్యాయం జరగకూడదు అనేది మా ఆశయం. ఒకే టైటిల్ ఇద్దరి నిర్మాతలకు ఇవ్వడం మాత్రం తప్పే.. తప్పు ఎక్కడ జరిగింది అనే అంశంపై మా ఈసీ మెంబర్ కమిటీ సభ్యులు అభిప్రాయాలు తీసుకొని ఈ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది” అని తెలిపారు. 

Latest News

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత...

More News