31 సిటీల్లో ANR 100 ఫిల్మ్ ఫెస్టివల్‌ సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా వుంది అక్కినేని నాగార్జున

Must Read

-నటసామ్రాట్, పద్మవిభూషణ్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు గారి పోస్టల్ స్టాంప్ రిలీజ్ 

-మెగాస్టార్ చిరంజీవి గారికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారి చేతులు మీదగా ANR అవార్డ్- అక్టోబర్ 28న అవార్డు ప్రదానోత్సవం 

– అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా 600 వందల మంది అభిమానులకు బట్టలు బహుకరించిన అక్కినేని ఫ్యామిలీ   

నటసామ్రాట్, పద్మవిభూషణ్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ NFDC-నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాతో కలిసి ‘ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ ఫిల్మ్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తోంది. అభిమానులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ANR ఐకానిక్ ఫిలిం ‘దేవదాసు’ స్క్రీనింగ్ తో ఈ ఫెస్టివల్ గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘దేవదాసు’ (1953), ‘మిస్సమ్మ’ (1955) ‘మాయాబజార్’ (1957), ‘భార్య భర్తలు’ (1961), ‘గుండమ్మ కథ’ (1962), ‘డాక్టర్ చక్రవర్తి’ (1964), ‘సుడిగుండాలు’ (1968), ‘ప్రేమ్ నగర్’ (1971), ‘ప్రేమాభిషేకం’ (1981) ‘మనం’ (2014) సహా ANR ల్యాండ్‌మార్క్ మూవీస్ దేశవ్యాప్తంగా ప్రదర్శించనున్నారు. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ 10 మాస్టర్ పీస్ మూవీ ప్రింట్‌లను 4Kలో పునరుద్ధరించడానికి చొరవ తీసుకున్నాయి. అద్భుతమైన క్యాలిటీలో ఈ క్లాసిక్స్ ని ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. 

అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలని అక్కినేని కుటుంబం ఘనంగా నిర్వహించింది. అన్నపూర్ణ స్టూడియోస్ లోని అక్కినేని విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఇరు రాష్ట్రాలలోని అక్కినేని అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ కి తరలివచ్చి అక్కినేనికి అంజలి ఘటించారు. అక్కినేని కుటుంబ సభ్యులు అభిమానులతో కలిసి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా 600 వందల మంది అభిమానులకు బట్టలు బహుకరించారు. 

ప్రెస్ మీట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాన్నగారు నవ్వుతూ మాకు జీవితాన్ని నేర్పించారు. అందుకే ఆయన పేరు తలచుకుంటే నవ్వుతూనే వుంటాం. శివేంద్ర గారికి థాంక్. దేవదాస్ తో పాటు మరికొన్ని సినిమాలు చూడబోతున్నారు. వాళ్ళు చేసిన బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ అద్భుతంగా వున్నాయి. ఆడియన్స్ కి వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ వుంటుంది. 31 సిటీల్లో ఈ ఫెస్టివల్ చేస్తున్నారు. నార్త్ లో ఫాంటాస్టిక్ రెస్పాన్స్ వస్తుందని శివేంద్ర చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. గోవా ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నాన్న గారి పేరు మీద ఒక చాప్టర్ చేస్తున్నారు. ఈ విషయంలో చాలా హ్యాపీగా వుంది. పోస్ట్ మాస్టర్ జనరల్ బీఎస్ రెడ్డి గారికి థాంక్ యూ. ఈ శత జయంతి రోజున నాన్న గారి స్టాంప్ రిలీజ్ చేయడం చాలా అనందంగా వుంది. ఈ వేడుకకు వచ్చిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ సో మచ్. శత జయంతిని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో ని నాన్న గారి సీనియర్ అభిమానులు రక్తదానం, అన్నదానం లాంటి మంచి కార్యక్రమలు చేశారు. వారందరికీ థాంక్ యు వెరీ మచ్. మీ ప్రేమ అభిమానం మర్చిపోలేనేది. ప్రతి రెండేళ్ళకు ఏఎన్ఆర్ అవార్డ్ ఇస్తున్నాం. ఈ ఏడాది ఏఎన్ఆర్ అవార్డ్ చిరంజీవి గారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయం చెప్పగానే చిరంజీవి గారు చాలా ఎమోషనల్ హాగ్ చేసుకొని ఏఎన్ఆర్ గారి శత జయంతి ఏడాదిలో ఇవ్వడం చాలా ఆనందంగా వుందని చెప్పారు. దీనికి కంటే పెద్ద అవార్డ్ లేదని అన్నారు. అమితాబ్ బచ్చన్ గారు ఆవార్డ్ ప్రధానం చేస్తారు. అక్టోబర్ 28 ఈ ఫంక్షన్ చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు.    

మురళీ మోహన్ మాట్లాడుతూ… అక్కినేని గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం కల్పించిన అక్కినేని కుటుంబం సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి అక్కినేని గారి అభిమానిని. ఆయనతో కలసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. నాగేశ్వరరావు గారు గొప్ప అంకిత భావం కలిగిన నటులు. వారి బ్యానర్ లో నిర్మించిన తొలి సినిమాలో నేను నటించడం గొప్ప అదృష్టం. హైదరాబాద్ కి ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కింది. ఆయన మనతోనే వుంటారు. అందరికీ ధన్యవాదాలు’ అన్నారు.  

వెంకట్ అక్కినేని మాట్లాడుతూ.. నాన్న గారి శత జయంతి రోజున ప్రభుత్వం పోస్టల్ స్టాప్ రిలీజ్ చేసింది. బాపు గారు ఆ ఫోటో గీశారు. దాంట్లో నాన్నగారి లక్షణాలు అన్నీ కలగలిపి వుంటాయి. ఈ స్టాప్ రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు. క్యాబినెట్ మ ఇనిస్తర్ జ్యోతిరాదిత్య సింధియా, చంద్రశేఖర్ గారు ఈ రోజు రిలీజ్ చేయాలని ప్లాన్ చేసి చేశారు. వారికి చాలా ధన్యవాదాలు’ తెలిపారు. 

శివేంద్ర సింగ్ దుంగార్పూర్ మాట్లాడుతూ.. ఈ గొప్ప అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి, అక్కినేని కుటుంబానికి ధన్యవాదాలు. ఈ ఫెస్టివల్ ని దేశంలోని 31 సిటీస్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇదొక హిస్టారికల్ డే. ఈ మూడు రోజుల్లో అక్కినేని గారి పది క్లాసిక్ సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చూడబోతున్నారు. ఈ హెరిటేజ్ ని కాపాడుకుకోవడం మనందరి భాద్యత’ అన్నారు     

దర్శకుడు కె రాఘవేందర్ రావు మాట్లాడుతూ.. అక్కినేని, కోవెలమూడి కుటుంబాలు రెండు వేరువేరు కాదు. నాగేశ్వరరావు గారు, మా నాన్నగారు, నేను, నాగార్జున కలిసే ప్రయాణం చేశాం. నాగేశ్వరరావు గారు హైదరాబాద్ కి అన్నపూర్ణ స్టూడియోని తలమానికంగా ఇచ్చి వెళ్లారు. ఎంతోమందికి ఉపాధి కల్పించారు. దేవదాస్, కాళిదాస్, విప్రనారాయణ ఇలా ఎన్నో క్లాసిక్ సినిమాలు ఇచ్చారు. అలాంటి నటన, సినిమాలు మళ్ళీ చూడగలమా అన్నంత గొప్పగా చేసిన ఘటన నాగేశ్వరరావు గారిది. నాగేశ్వరరావు గారు ఎప్పుడూ మనతోనే వుంటారు. తండ్రి కొడుకులతో సినిమాలు చేసిన అదృష్టం నాకు దొరికింది. నాగేశ్వరరావు గారు ఎక్కడున్నా మనతోనే వుంటారు’ అన్నారు. 

జాయింట్ కలెక్టర్ సంజయ్ మాట్లాడుతూ..ఇండియన్ సినిమా లెజెండ్ ANR గారి ఇయర్స్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం ఆనందంగా వుంది. ANR గారు జనరేషన్స్ కి స్ఫూర్తి. ఈ ఏడాది ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ANR గారి శత జయంతిని భారత ప్రభుత్వం తరపున సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ANR దీవెనలు అందరిపై వుంటాయి. ఈ వేడుకలో భాగం కావడం ఆనందంగా వుంది. అందరికీ ధన్యవాదాలు’ అన్నారు. 

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ.. అక్కినేని కుటుంబ సభ్యులకు, అభిమానులకు కృతజ్ఞతలు. నాగేశ్వరరావు గారు 1955లో లక్ష రూపాయిలు విరాళం ఇచ్చి గుడివాడలో కళాశాల కట్టించారు. అప్పుడు ఎకరం పొలం గుడివాడలో రెండు వేలు. అటువంటి రోజుల్లో ఆయన దగ్గర పాతిక వేలే వుంటే 75వేలు అప్పుతీసుకొని మొత్తం లక్ష ఇచ్చారు. 70 ఏళ్ల క్రితమే ఆయన జన్మభూమి కాన్సెప్ట్ అనుకుకొని ఊర్లో స్కూల్ కట్టించారు. అనేక విద్యాలయాలకు విరాళాలు ఇచ్చారు. ఎంతోమంది పేద విద్యార్ధులకు ఆర్ధిక సాయం చేశారు. బుడమేరు పై వంతెన కట్టించిన ఘనత ఆయనది. తను చేసిన సాయం గురించి ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదు. అక్కినేని గారు మహా మనిషి’ అన్నారు. అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్, సుమంత్, సుశాంత్, అమల అక్కినేని, నాగ సుశీల, సుప్రియా యార్లగడ్డతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుకలు చాలా గ్రాండ్ గా జరిగింది.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News