సాయి దుర్గాతేజ్‌, బ్రహ్మాజీల చేతుల మీదుగా‘గుట్టు చప్పుడు’ టీజర్‌ లాంచ్‌

Must Read

డాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌రావ్‌ఆయేషాఖాన్‌ జంటగా, హనుమేన్‌ చిత్రంతో పాన్‌ ఇండియా సంగీత దర్శకుడిగా మారిన గౌర హరి సంగీత సారధ్యంలో మణీంద్రన్‌ దర్శకత్వంలో డా॥ లివింగ్‌స్టన్‌ నిర్మిస్తున్న రొమాంటిక్‌ మాస్‌ యాక్షన్‌ లవ్‌, ఎంటర్‌టైనర్‌ ‘గుట్టు చప్పుడు’. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్‌ను తాజాగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్‌ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. అనంతరం ప్రసాద్‌ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీనియర్‌ నటులు బ్రహ్మాజీ తన చేతుల మీదుగా విడుదల చేశారు.

అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో బ్రహ్మాజీ మాట్లాడుతూ…
టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్‌ చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకూ పూర్తయినట్టు ఉంది. టీజర్‌ను సాయి దుర్గాతేజ్‌ ఆన్‌లైన్‌లోను, నేను ఆఫ్‌లైన్‌లోను విడుదల చేయడం సంతోషంగా ఉంది. మా అబ్బాయి నటిస్తున్న 3వ సినిమా ఇది. మంచి నిర్మాత, టెక్నీషియన్స్‌ను కుదిరారు. భారీ బడ్జెట్‌తో తీశారు. దర్శకుడు కూడా తీసిన కంటెంట్‌ను మళ్లీ చెక్‌ చేసుకుంటూ జాగ్రత్తగా ఈ సినిమా చేశారు. ఈ టీజర్‌ చూసిన తర్వాత సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఏర్పడిరది. ఇందులో ఎందుకో గానీ నాకు మాత్రం క్యారెక్టర్‌ ఇవ్వలేదు అని నవ్వుతూ అన్నారు.

నిర్మాత లివింగ్‌స్టన్‌ మాట్లాడుతూ…
డైరెక్టర్‌ మణీంద్రన్‌ కథ చెప్పినప్పుడు ఎగ్జైట్‌గా ఫీలయ్యా. ఆయనతో నాకు 12 సంవత్సరాల అనుబంధం. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు మంచి ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌తోనే చేయాలని ముందే డిసైడ్‌ అయ్యాము. అందుకే పాన్‌ ఇండియా రేంజ్‌కు ఎదిగిన సంగీత దర్శకులు హరి గారితో పాటు ఇతర టెక్నీషియన్స్‌ను కూడా మంచి వారిని ఎంచుకున్నాం. ఇదొక ప్రేమ, యాక్షన్‌, రొమాంటిక్‌తో పాటు మంచి మెసేజ్‌తో కూడిన సినిమా. హీరో సంజయ్‌ రెండు రకాల షేడ్స్‌ను అద్భుతంగా చేశారు. టీజర్‌లో మీరు చూసింది కొద్దిగానే. సినిమాలో ఇంకా మంచి స్టఫ్‌ ఉంది. క్లైమాక్స్‌ ఫైట్‌ను ముందుగా 15 లక్షలతో అనుకున్నప్పటికీ, క్వాలిటీ కోసం దాదాపు 75 లక్షల రూపాయలతో జహీరాబాద్‌ షుగర్‌ ఫ్యాక్టరీలో తీశాం. ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ అందరికీ థ్యాంక్స్‌. ముఖ్యంగా సాయిదుర్గా తేజ్‌ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం అన్నారు.

సంగీత దర్శకుడు గౌర హరి మాట్లాడుతూ…
నేను మండుటెండలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ప్రయాణం మొదలు పెట్టిన తరుణంలో ఈ సినిమా నాకు చెప్పులు దొరికినట్లు దొరికిన అద్భుత అవకాశం. మణీంద్రన్‌ గారు నన్ను చాలా నమ్మారు. ఆయన నమ్మకాన్ని వమ్ముచేయలేదని భావిస్తున్నాను. సినిమాలో మంచి కంటెంట్‌ ఉంది. సంగీతానికి మంచి స్కోప్‌ ఉండేలా దర్శకుడు కథను రాసుకోవడం నాకు బాగా ప్లస్‌ అయ్యింది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌ అన్నారు.

దర్శకుడు మణీంద్రన్‌ మాట్లాడుతూ…
ముందుగా నేను చెప్పిన బడ్జెట్‌కన్నా ఎక్కువ అవుతున్నా.. నా వర్క్‌ చూసిన నిర్మాత లివింగ్‌స్టన్‌ గారు ఎక్కడా అడ్డు చెప్పకుండా సహకరించిన విధానం హేట్సాఫ్‌. అలాగే హీరో గారు కూడా బాగా సహకరించారు. అందుకే సినిమా ఇంత గ్రాండ్‌గా వచ్చింది. ప్రతి టెక్నీషియన్‌ నేను ఏది ఆశిస్తున్నానో.. అంతకుమించి అవుట్‌పుట్‌ ఇచ్చారు. ఆర్టిస్ట్‌లు కూడా చక్కటి సహకారం అందించారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ గౌర హరి గారితో నాకు 10 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఆయన సంగీతం ఈ సినిమాకు హైలైట్‌. డబ్బులు పెట్టి టిక్కెట్‌ కొనుక్కుని థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుణ్ణి డబ్బుకు మించిన ఆనందాన్ని ఇచ్చే సినిమా ఇది.

హీరో సంజయ్‌రావు మాట్లాడుతూ…
ఇది నాకు 3వ సినిమా. ప్రతి టెక్నీషియన్‌ వారి బెస్ట్‌ అవుట్‌పుట్‌ 100 శాతం ఇచ్చారు. అలాగే ఆర్టిస్ట్‌లు కూడా. సంగీత దర్శకుడు గౌర హరిగారు నన్ను కలిసి వినిపించిన తొలి ట్యూన్‌తోనే ఆయన్నే పెట్టుకోవాల్సిందిగా నేను రికమెండ్‌ చేశాను. దర్శకుడు మణీంద్రన్‌ నాకు మంచి మిత్రుడు కూడా. అలాగే నిర్మాత లివింగ్‌స్టన్‌ గారు కూడా అంతే. వీరిద్దరి వల్లే నా జీవితభాగస్వామిని కలవడం జరిగింది. లింగ్‌స్టన్‌ గారు అనుకున్న దానికన్నా బడ్జెట్‌ను భారీగానే పెంచుకుంటూ వస్తున్నారు. కేవలం సినిమా వస్తున్న క్వాలిటీ విధానం ఆయనకు నచ్చే ఇలా జరిగింది. ఇది నాకు మంచి టర్నింగ్‌పాయింట్‌ ఇచ్చే సినిమా. అన్ని వర్గాలను ఆకట్టుకునే అన్ని అంశాలూ ఇందులో ఉన్నాయి. టీం అందరికీ సూపర్‌ సక్సెస్‌ ఇచ్చే సినిమా ఇది అన్నారు.
అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూనిట్‌ సభ్యులు ఈ సినిమా ఘన విజయం సాధించి తమకు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ ప్రసంగించారు.
ఈ చిత్రానికి సంగీతం: గౌర హరి, కెమెరా: శ్రీకాంత్‌ గేదెల, ఎడిటర్‌: తలారి సాయిబాబు, మాటలు: వై. సురేష్‌ కుమార్‌, ఆర్ట్‌: నాగు Ê కల్యాణ్‌, ఫైట్స్‌ : శంకర్‌, మేకప్‌: వెంకట్‌, సీజీ: చందు ఆది Ê టీం, కాస్ట్యూమ్స్‌: శ్రీ గణేష్‌, డాన్స్‌: ప్రశాంత్‌ మాస్టర్‌, పి.ఆర్‌.ఓ: సురేష్‌ కొండేటి, నిర్మాత: లివింగ్‌స్టన్‌, రచన, దర్శకత్వం: మణీంద్రన్‌.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News