బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, యుక్తా గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నూతన నటీనటులతో గుణ శేఖర్ నేటి యూత్‌కి, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్ప లత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, ఫ్లై హై పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూనే టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే.. నేటి యూత్ డ్రగ్స్ మహమ్మారి వల్ల ఎలా పెడదారులు పడుతుందనే విషయాన్ని చూపిస్తూనే తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉండాలనే విషయాన్ని భూమిక పాత్రతో పరిచయం చేశారు. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
యుఫోరియా చిత్రాన్ని ముందుగా ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే అనుకోకుండా చాలా సినిమాలు అదే రోజున రిలీజ్ అవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ క్లాష్‌ను తగ్గించటానికి యుఫోరియా సినిమాను ఫిబ్రవరి 6, 2026న విడుదల చేయటానికి మేకర్స్ నిర్ణయించుకుని అధికారికంగా ప్రకటించారు. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రాబోతున్న యుఫోరియాలో గుణ శేఖర్ అసలేం చూపించబోతున్నారో చూడటానికి అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ స్పందిస్తూ ‘‘క్రిస్మస్ 2025న అనుకోకుండా చాలా సినిమాలు రిలీజ్‌లకు సిద్ధమయ్యాయి. ఈ బాక్సాఫీస్ రద్దీని తగ్గించటానికి, యుఫోరియా వంటి సినిమాకు మంచి రిలీజ్ డేట్ అవసరమని భావించాం. అందువల్ల మా సినిమా రిలీజ్ డేట్‌ను కొన్నాళ్లు వెనక్కి తీసుకెళ్లి ఫిబ్రవరి 6, 2026న యుఫోరియాను విడుదల చేయబోతున్నాం. ఆలోచింప చేసేలా, ప్రభావవంతమైన అనుభవాన్ని అందించాలానేది మా ఆలోచన. థియేటర్స్‌లో మంచి ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేలా సినిమాను ఎగ్జయిటింగ్ ప్రమోషనల్ ప్లానింగ్‌తో మీ ముందుకు తీసుకొస్తున్నాం’’ అన్నారు.
20 ఏళ్ల క్రితం గుణ శేఖర్, భూమిక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఒక్కడు మూవీలో కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. యుఫోరియా కోసం మరోసారి ఈ బ్లాక్ బస్టర్ కాంబో చేతులు కలిపింది. భూమికను దృష్టిలో ఉంచుకుని గుణశేఖర్ ఓ పవర్‌ఫుల్ రోల్‌ను క్రియేట్ చేశారు. అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉంటూనే చక్కటి మెసేజ్ కూడా యుఫోరియా సినిమాలో ఉంటుంది. కాల భైరవ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ప్రవీణ్ కె పోతన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు :
భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్, నాసర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్ప లత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు తదితరులు
సాంకేతిక వర్గం :
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: గుణశేఖర్
సమర్పణ: రాగిణి గుణ
నిర్మాత: నీలిమ గుణ, యుక్తా గుణ
సంగీతం: కాల భైరవ
సినిమాటోగ్రాఫర్: ప్రవీణ్ కె పోతన్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
డైలాగ్స్: నాగేంద్ర కాశి, కృష్ణ హరి
పీఆర్వో : వంశీ కాకా
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…