ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా

ధనుష్, కృతి స‌న‌న్ హీరో హీరోయిన్లుగా ఆనంద్ ఎల్‌.రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో భూష‌ణ్ కుమార్ నిర్మించిన చిత్రం ‘తేరే ఇష్క్ మై’కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. ఇప్ప‌టికే సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకెళ్తోంది. ధ‌నుష్‌, కృతి న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యి వారిని ప్ర‌శంసిస్తున్నారు. సినిమాలోని పాత్ర‌లు, వాటి మ‌ధ్య ఉన్న ఎమోష‌న్స్, ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం ఇలా అన్నీ క‌లిసి ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నాయి. దీన్ని నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లేలా సినిమా తెలుగు ట్రైల‌ర్ ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. దీంతో సినిమా చూడాల‌నే ఎగ్జ‌యిట్మెంట్ మ‌రింత‌గా పెరుగుతోంది.

https://www.instagram.com/p/DR2LoBuDBm1/?igsh=MTZtcGdsNm90N2QzYw==

హీరో హీరోయిన్ మ‌ధ్య ప్రేమ‌, కొన్ని ప‌రిస్థితుల్లో హీరో ప్రేమ‌ను కోల్పోవ‌టం, ఆ బాధ నుంచి బ‌య‌ట‌కు రావ‌టం వంటి ఫీలింగ్స్‌ను ట్రైల‌ర్‌లో చాలా చ‌క్క‌గా చూపించారు. క‌థ‌లోని డెప్త్, ప్రేమలోని తెలియ‌ని బాధ‌ల‌ను కూడా ప్రేక్ష‌కులు మెచ్చే రీతిలో తెర‌కెక్కించారు. క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కించటంలో త‌న ప్రత్యేక‌త‌ను చాటే ద‌ర్శ‌కుడు ఆనంద్ ఎల్‌.రాయ్ శైలి ఇందులో స్ప‌ష్టంగా తెలుస్తోంది. సినిమాలోని ఎమోష‌న‌ల్ డెప్త్‌ను త‌న రైటింగ్ స్టైల్లోనే ఆయ‌న ఆవిష్క‌రించాడు. ఇది సినిమాను మ‌రింత గొప్ప సినిమాటిక్ జ‌ర్నీగా మార్చింది.

గుల్ష‌న్ కుమార్, టి సిరీస్‌, క‌ల‌ర్ ఎల్లో స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందిన తేరే ఇష్క్ మై సినిమాను ఆనంద్ ఎల్.రాయ్‌, హిమాన్షు శ‌ర్మ‌, భూష‌ణ్ కుమార్‌, కృష్ణ కుమార్ నిర్మించారు. ఆనంద్ ఎల్.రాయ్ సినిమాను తెర‌కెక్కించారు. హిమాన్షు శ‌ర్మ‌, నీర‌జ్ యాద‌వ్ సినిమా రైట‌ర్స్‌, ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ్మాన్ సంగీతం స‌మ‌కూర్చ‌గా ఇర్ష‌ద్ క‌మిల్ సాహిత్యాన్ని అందించారు. న‌వంబ‌ర్ 28 నుంచి ఈ సినిమా హిందీ, త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది.

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

5 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

5 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

5 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago