గ్రాండ్‌గా రుద్ర గరుడ పురాణం టీజర్ లాంచ్ ఈవెంట్.

Must Read

‘రుద్ర గరుడ పురాణం ’ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది : సోహైల్

రిషి, ప్రియాంక కుమార్ జంటగా కేఎస్ నందీష్ దర్శకత్వంలో రూపొందుతోన్న కన్నడ చిత్రం ‘రుద్ర గరుడ పురాణం’. అశ్విని ఆర్ట్స్ బ్యానర్‌‌పై అశ్విన్ విజయ్ లోహిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బైలింగ్విల్ మూవీగా తెరకెక్కించి నాలుగు భాషల్లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. బుధవారం ఈ చిత్ర టీజర్‌‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాత మధుర శ్రీధర్ అశ్విన్ ఆర్ట్స్ బ్యానర్ లోగోను లాంచ్ చేయగా, హీరో సోహైల్ తెలుగు టీజర్‌‌ను విడుదల చేశారు.

హీరో సోహైల్ మాట్లాడుతూ.. ‘కన్నడ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ మూవీ టైటిల్‌తో పాటు టీజర్ చాలా బాగుంది. కొత్త కంటెంట్‌ను తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. కేజీయఫ్, కాంతారా దగ్గర నుంచి రీసెంట్‌గా వచ్చిన లవ్ టుడే, మహారాజా, 777 ఛార్లీ, మంజుమ్మల్ బాయ్స్ లాంటి కంటెంట్ బేస్డ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులుగా మేం హిట్ చేశాం. ఈ మూవీ టీజర్ చూశాక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌‌లా అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. నందీశ్వర్ గారు చాలా బాగా తీశారు. రిషి గారి హైట్, పర్సనాలిటీకి ఇది కరెక్ట్‌ సినిమా. నాలుగు భాషల్లో ఈ సినిమా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా’ అంటూ ఆల్ ద బెస్ట్ చెప్పారు.

నిర్మాత మధుర శ్రీధర్ మాట్లాడుతూ ‘రిషి నటించిన కన్నడ సినిమాలు కొన్ని చూశా. ఆయన టెర్రిఫిక్ ఆర్టిస్ట్. తనతో పాటు టీమ్ అందరికీ ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

చిత్ర హీరో రిషి మాట్లాడుతూ ‘కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే మధుర శ్రీధర్ గారికి, సపోర్ట్ చేయడానికి వచ్చిన సోహైల్ గారికి ధన్యవాదాలు. దర్శకుడు మహి వి రాఘవ గారు ‘సైతాన్’ ద్వారా తెలుగు ఆడియెన్స్‌కు నన్ను పరిచయం చేశారు. గరుడ పురాణం ఎలిమెంట్స్‌ను బేస్ చేసుకుని రూపొందిస్తున్న చిత్రమిది. రుద్ర అనే పవర్‌‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నా. 25 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ అయిన ఒక బస్.. దానిలో చనిపోయిన వారంతా తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా సినిమా ఉంటుంది. చాలా ప్యాషనేట్‌గా నందీష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు సపోర్ట్ మరోసారి అందిస్తారని కోరుకుంటున్నా. ప్రస్తుతం కొన్ని తెలుగు ప్రాజెక్టులు చేస్తున్నా’అని చెప్పారు.

హీరోయిన్ ప్రియ మాట్లాడుతూ…‘ఈ చిత్రంలో భాగమవడం చాలా హ్యాపీగా ఉంది. మంచి కంటెంట్‌ను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఇష్టపడతారు. ఈ సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని చెప్పారు.

దర్శకుడు నందీష్ మాట్లాడుతూ..‘మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన నిర్మాత మధుర శ్రీధర్ గారికి, హీరో సోహైల్ గారికి స్పెషల్ థ్యాంక్స్. మా హీరో రిషి ఇప్పటికే ఓ తెలుగు సినిమా చేశారు. ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. టీజర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో చేయాలనుకున్నాం. దర్శకుడిగా నాకు, నిర్మాతగా లోహిత్ గారికి ఇది మా ఫస్ట్ మూవీ. టీజర్ అందరికీ నచ్చిందనుకుంటున్నా’ అని అన్నారు.

నిర్మాత విజయ్ లోహిత్ మాట్లాడుతూ.. ‘మ బ్యానర్ అశ్విని ఆర్ట్స్‌లో నిర్మిస్తున్న మొదటి సినిమా ఇది. బైలింగ్విల్‌ మూవీగా తెరకెక్కిస్తున్నాం. నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు.

నటుడు జ్వాల కోటి, డిస్ట్రిబ్యూటర్ ప్రశాంత్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నటీనటులు : రిషి, ప్రియ కుమార్, జ్వాల కోటి తదితరులు

బ్యానర్ : అశ్విన్ ఆర్ట్స్
కథ, కథనం, దర్శకత్వం : కేఎస్ నందీష్
సినిమాటోగ్రాఫర్ : సందీప్
మ్యూజిక్ డైరెక్టర్ : కృష్ణ ప్రసాద్
నిర్మాత : అశ్విని విజయ్ లోహిత్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News