ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

మోస్ట్ టాలెంటెడ్, ఎనర్జిటిక్ రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నా వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం “గాసిప్”. నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, అందమైన ప్రేమ కథతో మేళవిస్తూ సోషల్ సెటైర్ గా డైరెక్టర్ వైభవ్ కౌండిన్య ద్వారా ఈ చిత్రం తెరకెక్కుతోంది. శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి సతీష్ సినిమాటోగ్రఫీ చేయగా జై కుమార్ ఎడిటింగ్ చేశారు. రవివర్మ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో మహేష్ యడ్లపల్లి, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, ఆర్టిస్ట్ విజయ్ అదిరాజు, గురు చరణ్, ఫాల్గుణి, శృతి తదితరులు నటించగా రేపు అనగా ఈ నెల 26న విడుదలకు సిద్ధమైంది.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పాటలకు మంచి స్పందన లభించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టైలర్ చూసిన ప్రేక్షకులు సినిమా ప్రస్తుత సమాజంలో కొన్ని పరిస్థితులను ప్రతిబింబిస్తున్నట్లు ఈ చిత్ర ట్రైలర్ అనిపిస్తుందని అంటున్నారు. రేపు విడుదల కానున్న ఈ చిత్ర టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ప్రేక్షకులు వరుస బుకింగ్స్ తో సినిమా పై ఆసక్తి చూపిస్తున్నారు.

నిర్మాత యతి మాట్లాడుతూ చిత్ర విడుదలకు సహకరిస్తున్న పివిఆర్ సినిమాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సినిమాపై ఆసక్తి చూపుతున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని, చిన్ సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.

దర్శకుడు వైభవ్ కౌండిన్య మాట్లాడుతూ చిత్రంలోని నటించిన నటీనటులకు, సాంకేతిక బృందానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే నిర్మాతకు, విడుదలకు సపోర్ట్ చేస్తున్న పివిఆర్ సినిమాస్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇటువంటి చిన్న సినిమాలను ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరారు.

నటీనటులు : రాశి సింగ్, రవివర్మ, మహేష్ యడ్లపల్లి, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, ఆర్టిస్ట్ విజయ్ అదిరాజు, గురు చరణ్, ఫాల్గుణి, శృతి తదితరులు

సాంకేతిక సిబ్బంది :
రచయిత – వైభవ్ కౌండిన్య
నిర్మాత – ఏతి రేమెళ్ల
బ్యానర్ – వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్
సంగీత దర్శకుడు – శక్తికాంత్ కార్తీక్
డిఓపి- సతీష్
ఎడిటర్ – జై కుమార్
సహ నిర్మాత – నరసింహం తెలనాకుల
మ్యూజిక్ లేబుల్: ఆదిత్య మ్యూజిక్
పిఆర్ఓ: మధు వి ఆర్
డిజిటల్ మార్కెటింగ్ : డిజిటల్ దుకాణం

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

4 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

5 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

5 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago