‘గొర్రె పురాణం’ ట్రైలర్ రిలీజ్- సెప్టెంబర్ 20 రిలీజ్

Must Read

రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న వదనం హ్యాట్రిక్ విజయాల తర్వాత హీరో సుహాస్ నుంచి వస్తున్న యూనిక్ ఎంటర్ టైనర్ ‘గొర్రె పురాణం’. బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు మేకర్స్ ట్రైలర్ ని విడుదల చేశారు. ‘నా పేరు రామ్. అలియాస్ యేసు. గొర్రె జైల్లో వుండటం ఏందీ, ఆడికెల్లి తప్పించుకోవడం ఏందీ ? ఇదంతా మీకు వింతగా వుంది కదా’ అనే వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది.

ఒక గొర్రె ఒక గ్రామంలో రెండు మతాల మధ్య చిచ్చుపెట్టిన నేపధ్యాన్ని ట్రైలర్ లో చాలా ఆసక్తికరంగా ప్రజెంట్ చేశారు. గొర్రె వలన జరిగిన పరిణామాలు చాలా ఆసక్తికరంగా వున్నారు.

సుహాస్ ఖైదీ క్యారెక్టర్ లో టెర్రిఫిక్ గా కనిపించారు. ‘మనం బ్రకతకం కోసం వాటిని చంపేయొచ్చు. మనది ఆకలి. మరి అవి బతకడం కోసం మనల్ని చంపేస్తే అది ఆత్మ రక్షణే కదా’ అని సుహాస్ చెప్పిన డైలాగ్ ఆలోచన రేకెత్తిస్తుంది.

సుహాస్ పెర్ఫార్మెన్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. ఇంటెన్స్ క్యారెక్టర్ లో అదరగొట్టారు. పోసాని కృష్ణ మురళి, రఘు కీలక పాత్రల్లో కనిపించారు. దర్శకుడు బాబీ ఓ యూనిక్ పాయింట్ ని చాలా బ్రిలియంట్ గా ప్రజెంట్ చేశారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది.

పవన్ సిహెచ్ నేపధ్య సంగీతం ఎమోషన్ ని ఎలివేట్ చేసింది.సురేష్ సారంగం కెమరాపనితనం హైలెట్ గా నిలిచింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా వున్నాయి. మొత్తానికి ట్రైలర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది. ప్రస్తుతం ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.  

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 20 న గ్రాండ్ గా విడుదల అవుతుంది.

తారాగణం: సుహాస్, పోసాని కృష్ణ మురళి, రఘు తదితరులు
సాంకేతిక సిబ్బంది
దర్శకత్వం: బాబీ
నిర్మాత: ప్రవీణ్ రెడ్డి
సంగీతం: పవన్ సిహెచ్
కెమెరామెన్ : సురేష్ సారంగం
ఎడిటర్ : వంశీ కృష్ణ రవి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : రామ్ ప్రసాద్ రవి
పీఆర్వో: వంశీ శేఖర్

Latest News

Son’s Heartfelt Love Letter To Their Father, Nanna Song From MaaNannaSuperhero

Nava Dalapathy Sudheer Babu will be seen in an emotionally-packed role as a son who loves his father the...

More News