గోపీచంద్, శ్రీను వైట్ల, విశ్వం’ హైలీ ఎంటర్‌టైనింగ్ టీజర్ విడుదల,

Must Read

డైరెక్టర్ శ్రీను వైట్ల కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను డీల్ చేయడంలో ఎక్స్‌ పర్ట్. ముఖ్యంగా కామెడీని హ్యాండిల్ చేయడంలో దిట్ట. మాచో హీరో గోపీచంద్ తో  శ్రీను వైట్ల రూపొందిస్తున్న స్టైలిష్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘విశ్వం’. ప్రమోషన్స్‌ను కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.

టీజర్ నరేష్ వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైయింది. గోపీచంద్, కావ్యా థాపర్ పాత్రల పరిచయం, వారి క్యారెక్టర్స్ లో కామెడీ స్పార్క్‌ ఆకట్టుకున్నాయి. టీజర్ లో ప్రముఖ నటీనటులతో కామెడిక్ సీన్స్ హిలేరియస్ గా వున్నాయి, టీజర్ చివరి భాగంలో యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ అదిరిపోయాయి.

ఎంటర్‌టైన్‌మెంట్,యాక్షన్‌ని ఎఫెక్టివ్‌గా బ్యాలెన్స్ చేస్తూ హైలీ ఎంటర్‌టైనింగ్ టీజర్ ని ప్రజెంట్ చేశారు శ్రీను వైట్ల. డైలాగ్‌లు, కామెడీ, యాక్షన్‌ బ్లెండ్ మంచి కమర్షియల్ ఔటింగ్ ని ప్రామిస్ చేస్తున్నాయి.

గోపీచంద్ అల్ట్రా-స్టైలిష్‌గా కనిపించారు. తన ఇంటెన్సిటీతో కామెడీని బ్లెండ్ చేసే పాత్రలో మెరిశారు. కావ్య థాపర్ తన గ్లామర్‌తో ఆకట్టుకోగా, నరేష్, వెన్నెల కిషోర్, మిగతా నటులు వినోదాన్ని అందించారు.

కెవి గుహన్ సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా నిలిచింది, చైతన్ భరద్వాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు మరింత డెప్త్ ని జోడించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌ పై నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో వున్నాయి.

శ్రీనువైట్ల బ్లాక్‌బస్టర్స్‌కు పని చేసిన గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. అమర్‌రెడ్డి కుడుముల ఎడిటర్‌, కిరణ్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. “విశ్వం” అక్టోబర్ 11న దసరాకి విడుదల కానుంది, పండగ సీజన్‌లో ఇది పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వుండబోతోంది.

నటీనటులు: ‘మాచో స్టార్’ గోపీచంద్, కావ్య థాపర్, వెన్నెల కిషోర్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: శ్రీను వైట్ల
సమర్పణ: దోనేపూడి చక్రపాణి
నిర్మాతలు: TG విశ్వ ప్రసాద్ & వేణు దోనేపూడి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
డీవోపీ: K V గుహన్
సంగీతం: చైతన్ భరద్వాజ్
రైటర్స్: గోపీ మోహన్, భాను-నందు, ప్రవీణ్ వర్మ
ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
ఫైట్ మాస్టర్: రవి వర్మ, దినేష్ సుబ్బరాయన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొల్లి సుజిత్ కుమార్, ఆదిత్య చెంబోలు
కో-డైరెక్టర్: కొంగరపి రాంబాబు, లోకనాథ్
డైరెక్షన్ టీం: శ్రీ హర్ష, రంజిత్, వీర
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: పూజ్యం శ్రీరామ చంద్ర మూర్తి
ప్రొడక్షన్ మేనేజర్స్: టి వినయ్, డి బాలకృష్ణ
పీఆర్వో: వంశీ శేఖర్
డిజైనర్స్: అనంత్ కంచర్ల (పద్మశ్రీ యాడ్స్)

Latest News

రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా ‘అభిమాని’ మూవీ గ్లింప్స్‌ విడుదల

సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యారు. ఇప్పటికే దేవినేని సహా అనేక సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సురేష్ కొండేటి...

More News