సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న గోట్ చిత్రం గ్లింప్స్ విడుదల.

Must Read

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న గోట్ చిత్రం గ్లింప్స్ విడుదల..

జబర్దస్త్ షో తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న సుడిగాలి సుధీర్ ప్రస్తుతం హీరోగా వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే మూడు చిత్రాల్లో హీరోగా నటించి తనదైన నటనతో వెండితెర ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. ప్రస్తుతం సుధీర్ హీరోగా నటిస్తున్న నాలుగోవ చిత్రం ‘గోట్ ; ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ‘. దివ్య భారతి హీరోయిన్‌గా నటిస్తోంది.

‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి ఈ చిత్రానికి దర్శకత్వం వర్ధిస్తున్నారు. మహాతేజ క్రియేషన్స్ పతాకంపై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ఈ వీడియోలో సుధీర్ ఒక చేత్తో క్రికెట్ బ్యాక్ పట్టుకుని, మరో చేత్తో సిగరెట్ కాల్చుతూ మాస్ రగ్డ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. లియోన్ జేమ్స్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా ఉంది. మాస్ ఎంటర్‌‌టైనర్‌‌ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయ్యింది. రెండు పాటలు చిత్రీకరణ కూడా పూర్తి అయింది. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా చాలా రిచ్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.

టెక్నికల్‌గా కూడా చిత్రం ఉన్నతస్థాయిలో వుంటుంది. సుడిగాలి సుధీర్ కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది అని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, డీఓపీ: బాలాజీ సుబ్రహ్మణ్యం, ఎడిటర్: కె.విజయవర్ధన్, ఆర్ట్: రాజీవ్ నాయర్, రచయిత: ఫణికృష్ణ సిరికి

Latest News

ఘ‌నంగా ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు’ మూవీ ప్రారంభోత్స‌వం

శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్‌పై నరేష్ వర్మ ముద్దం దర్శకత్వంలో, ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన స్వర్గం ముస్కాన్ రాజేంద‌ర్ హీరోహీరోయిన్లుగా "మర్రిచెట్టు కింద మనోళ్ళు"...

More News