గంజాయి కి అలవాటు పడ్డ యువతకు చెంపపెట్టు ” RKపురం లో

Must Read

ఈ సందర్భగా చిత్ర దర్శకుడు శ్రీకర్ ప్రసాద్ కట్టా మాట్లాడుతూ” అర్ కె పురంలో మంచి కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్.నేటి యువత డ్రగ్స్ బారిన పడి ఎటువంటి వ్యసనాలకు లోనవుతున్నారు, వారి వల్ల సమాజంలో ఎటువంటి ప్రతికుల పరిస్థితులు మహిళలు ఎదుర్కుంటున్నారు అనేది ఈ చిత్ర కథాంశం. గంజాయి కి అలవాటు పడ్డ యువతకు చెప్ప పెట్టు లాంటిది ఈ చిత్రం.హీరో రవి కిరణ్ కొత్తవాడైన చాలా చక్కగా నటించాడు. అన్ని హంగులతో ఈ సినిమాను త్వరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.
చిత్ర నిర్మాత గుబ్బల రవి కిరణ్ మాట్లాడుతూ”సమాజానికి ఉపయోగ పడే మంచి పవర్ ఫుల్ హీరో క్యారెక్టర్ చేస్తున్నాను మా చిత్రంలో యూత్ కావలసిన అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి. నేడు ఆంధ్ర రాష్ట్రం లో ప్రతి గ్రామం గంజాయి వంటి మత్తు పదార్ధాలతో నిండిపోయి వుంది.మా చిత్రం చూసిన తర్వాత మత్తులో జోగుతున్న కొంత మంది అయినా వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకుంటారన్న ఆశ భావంతో వున్నాము.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలు ఈ వారంలో పూర్తి చేసుకుని సినిమాను త్వరలో విడుదల చేయాలనుకుంటున్నాం, అని అన్నారు.

పవన్ దీపిక ఆర్ట్స్
హీరో – రవి కిరణ్
హీరోయిన్ – త్రిషల
II హీరోయిన్ – రక్ష
సమర్పించు గుబ్బల విజయ హేమ దీపిక
డైరెక్టర్ – శ్రీకర్ ప్రసాద్ కట్టా
నిర్మాత – రవి కిరణ్ గుబ్బల
సహ నిర్మాత – జక్కంపూడి శ్రీనివాస్ శ్రీదేవి
సంగీతం – రాజ్ కిరణ్
ఎడిటర్ – డి.కె
కెమెరా – K. వాసుదేవన్
మాటలు – శ్రీ కుమార్ దలిపర్తి
నిర్మాణ నిర్వహణ – వాసంశెట్టి రాజేంద్రప్రసాద్
పి అర్ ఓ: బాశింశెట్టి వీరబాబు

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News